https://oktelugu.com/

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. తెలియకుండా స్టేటస్ చూసే ఛాన్స్..?

స్మార్ట్ ఫోన్లలో ఎక్కువగా ఉపయోగించే అప్లికేషన్లలో ఒకటైన వాట్సాప్ యాప్ ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ యూజర్లకు మరింత చేరువవుతున్న సంగతి తెలిసిందే. సాధారణంగా వాట్సాప్ యాప్ లో మన ఫోన్ లో కాంటాక్ట్ నంబర్లకు సంబంధించిన స్టేటస్ లను మనం చూడవచ్చు. అయితే మనం స్టేటస్ చూసినట్టు అవతలి వ్యక్తులకు సులభంగా తెలుస్తుంది. కానీ మనం అవతలి వ్యక్తులకు తెలియకుండానే స్టేటస్ ను చూసే ఛాన్స్ ఉంది. Also Read: ఆధార్, పాన్, రేషన్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 29, 2020 / 07:13 PM IST
    Follow us on


    స్మార్ట్ ఫోన్లలో ఎక్కువగా ఉపయోగించే అప్లికేషన్లలో ఒకటైన వాట్సాప్ యాప్ ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ యూజర్లకు మరింత చేరువవుతున్న సంగతి తెలిసిందే. సాధారణంగా వాట్సాప్ యాప్ లో మన ఫోన్ లో కాంటాక్ట్ నంబర్లకు సంబంధించిన స్టేటస్ లను మనం చూడవచ్చు. అయితే మనం స్టేటస్ చూసినట్టు అవతలి వ్యక్తులకు సులభంగా తెలుస్తుంది. కానీ మనం అవతలి వ్యక్తులకు తెలియకుండానే స్టేటస్ ను చూసే ఛాన్స్ ఉంది.

    Also Read: ఆధార్, పాన్, రేషన్ కార్డ్ పోగొట్టుకున్నారా.. కొత్తది ఎలా పొందాలంటే..?

    వాట్సాప్ రెండు సంవత్సరాల క్రితం వాట్సాప్ స్టేటస్ ఫీచర్ ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ స్టేటస్ ద్వారా మన అభిప్రాయాలను చెప్పడంతో పాటు వీడియోలు, ఫోటోలను కూడా షేర్ చేయవచ్చు. అప్ లోడ్ చేసినప్పటి నుంచి 24 గంటల పాటు వాట్సాప్ స్టేటస్ ఉంటుంది. 24 గంటల సమయం తరువాత ఆటోమేటిక్ గా స్టేటస్ డిలేట్ అవుతుంది. అయితే బ్లూ టిక్ ఆప్షన్ ను ఆఫ్ చేయడం ద్వారా అవతలి వ్యక్తులకు మనం స్టేటస్ చూసినా తెలియదు.

    Also Read: భారత్ పై స్మిత్ ’సెంచరీ‘ రికార్డు

    సాధారణంగా బ్లూ టిక్ ఆప్షన్ ను అవతలి వ్యక్తి మనం పంపించిన సందేశాన్ని చదివాడో లేదో తెలుసుకోవడం కోసం ఉపయోగిస్తారు. బ్లూ టిక్ ఆప్షన్ ను ఆఫ్ చేస్తే మనం అవతలి వ్యక్తుల మెసేజ్ లను చదివినా చదివినట్టు తెలియదు. ఇదే ఆప్షన్ స్టేటస్ విషయంలో సైతం ఉపయోగపడుతుంది. బ్లూ టిక్స్ ఆప్షన్ ను ఆఫ్ చేసి అవతలి వ్యక్తులు స్టేటస్ చూసిన వాళ్ల లిస్ట్ లో మీ పేరు లేకుండా చేసుకోవడం సాధ్యమవుతుంది.

    మరిన్ని వార్తలు కోసం: జనరల్

    బ్లూ టిక్స్ ఆప్షన్ ను ఆఫ్ చేయాలనుకునే వాళ్లు మొదట వాట్సాప్ అప్లికేషన్ ను ఓపెన్ చేయాలి. ఆ తరువాత టాప్ రైట్ లో ఉన్న మూడు డాట్స్ పై క్లిక్ చేయాలి. ఆ తరువాత సెట్టింగ్స్ లోకి వెళ్లి అకౌంట్ ఆప్షన్ లోని ప్రైవసీని ఎంచుకోవాలి. ఆ తరువాత రీడ్ రిసిప్ట్ ను ఆఫ్ చేస్తే అవతలి వ్యక్తుల స్టేటస్ ను చూసినా వాళ్లకు మనం చూసినట్టు తెలియదు.