https://oktelugu.com/

MP ‘Haka’ war cry : జస్ట్ 21 ఏళ్ల ఎంపీ.. మాట్లాడిన మాటలకు పార్లమెంటే దద్దరిల్లిపోయింది

రాహితి మైపీ క్లార్క్ న్యూజిలాండ్ దేశానికి చెందిన పార్లమెంటు సభ్యురాలు. ఈమె ఇటీవల జరిగిన ఎన్నికల్లో హౌరకి వైకాటో పార్లమెంటు స్థానం నుంచి గెలుపొంది పార్లమెంటు సభ్యురాలుగా చట్టసభల్లో అడుగుపెట్టింది

Written By:
  • NARESH
  • , Updated On : January 5, 2024 / 10:26 PM IST
    Follow us on

    MP ‘Haka’ war cry : మాతృభాష తల్లి వంటిది. దానిని మనం మర్చిపోయిన నాడు.. మన మనుగడ ముగిసినట్టే.. అయితే ఈ సువిశాల ప్రపంచంలో ఎన్నో భాషలు అంతర్థానమవుతున్నాయి. కొన్ని భాషలు మెజారిటీ ప్రజలు మాట్లాడుతున్నప్పటికీ.. ఇంగ్లీష్ వాడకం పెరగడం వల్ల అవి కూడా క్రమేపి కనుమరుగయ్యే జాబితాలో చేరిపోతున్నాయి. ఈ జాబితాలో తెలుగు కూడా ఉంటుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పైగా మన పాలకులు ఇంగ్లీష్ భాషకు అమితమైన ప్రాధాన్యం ఇస్తుండడంతో తెలుగు భాష క్రమేపి తన ప్రాచుర్యాన్ని కోల్పోతుంది. అయితే ఇలాంటి క్రమంలో ఓ యువ ఎంపీ మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారాయి.

    రాహితి మైపీ క్లార్క్ న్యూజిలాండ్ దేశానికి చెందిన పార్లమెంటు సభ్యురాలు. ఈమె ఇటీవల జరిగిన ఎన్నికల్లో హౌరకి వైకాటో పార్లమెంటు స్థానం నుంచి గెలుపొంది పార్లమెంటు సభ్యురాలుగా చట్టసభల్లో అడుగుపెట్టింది. ఉన్నత విద్యావంతులైన రాహితి మైపీ క్లార్క్.. తన ఎన్నికకు సహకరించిన ప్రజలకు ఏదో ఒకటి చేయాలి అనుకునే ఉదాత్తమైన మనసున్న రాజకీయ నాయకురాలు. పైగా ఆమె తెగ అంటే చాలా ఇష్టం.అయితే ఈమె ఇటీవల పార్లమెంట్లో మాట్లాడిన మాటలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తమ తెగ ప్రజలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. చిన్న చూపు చూస్తోందని ఆమె ఇటీవలి పార్లమెంటు సభల్లో ప్రస్తావించింది.. తాను పార్లమెంటు సభ్యురాలుగా గెలుపొందానంటే మావోరి తెగ ప్రజలే కారణమని పేర్కొంది. వారి సమస్యలు పరిష్కరించినప్పుడు తాను ఎంపీగా సాధించిన విజయానికి సార్ధకత లభిస్తుందని ఆమె వివరించింది. 170 సంవత్సరాల పార్లమెంటు చరిత్ర ఉన్న న్యూజిలాండ్ లో… క్లార్క్ అత్యంత పిన్న వయసులో ఎంపీగా గెలుపొందిన రికార్డు సొంతం చేసుకుంది.. అంతేకాదు తన మాతృభాషలో మాట్లాడిన తొలి ఎంపీగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది.

    అన్నట్టు ఈమె తెగకు సంబంధించిన వారు ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్ కు వలస వచ్చారు. కష్టపడి పని చేయడం ఈ తెగ ప్రజల ప్రధాన లక్షణం. పైగా న్యూజిలాండ్ అభివృద్ధిలో వీరి పాత్ర చాలా ఉంది. అయితే వీరిని ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారి గానే అక్కడి ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అందుకే వీరి సమస్యలను పెద్దగా పట్టించుకోరు. అయితే ఈ చిత్కరింపును చిన్నప్పటి నుంచి చూస్తున్న క్లార్క్.. తన వాళ్ల కోసం ఏదైనా చేయాలని నిర్ణయం తీసుకుంది. అందుకే పార్లమెంట్ కు చట్టసభ సభ్యురాలుగా ఎన్నికయింది. అంతేకాదు తనను గెలిపించిన ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకు.. వారి సమస్యలను పార్లమెంటు వేదికగా.. తన మాతృభాషలో గొంతెత్తింది. ‘‘ఈరోజు నేను ఇక్కడ ఉన్నా. రేపటి నాడు మీకోసం చస్తా. అయినప్పటికీ నాకు ఇబ్బంది లేదు. మీ సమస్యల కోసం పోరాడాను అనే భావన మీలో ఉంటే చాలు.’’ అని పార్లమెంటు సాక్షిగా ఆమె పలికిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. అన్నట్టు ఆ మాటలు మాట్లాడుతున్నంత సేపు ఆమె తన హావభావాలతో సమస్య తీవ్రతను సభ దృష్టికి తీసుకువచ్చారు.