https://oktelugu.com/

IPL 2024 Chennai: 2024 లో చెన్నై టీమ్ కి కొత్త కెప్టెన్…ధోని ప్లాన్ ఏంటంటే..?

నిజానికి ధోని కెప్టెన్ గానే కాకుండా మంచి క్రికెటర్ గా, మంచి ఫినిషర్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఇప్పుడు గైక్వాడ్ కెప్టెన్సీ లో ధోని ప్లేయర్ గా ఆడతాడు అంటూ చాలా వార్తలైతే వస్తున్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : December 30, 2023 / 01:59 PM IST

    IPL 2024 Chennai

    Follow us on

    IPL 2024 Chennai: ఐపిఎల్ లో కప్పు కొట్టడానికి ప్రతి టీం కూడా తమదైన రీతిలో కసరత్తులను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఎందుకంటే ఈసారి తప్పకుండా ప్రతి టీం కూడా కప్పు కొట్టాలని చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్టుగా అర్థమవుతుంది. గత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్యంగా కప్పు కొట్టి 5 వ సారి ఐపీఎల్ కప్పు గెలుచుకున్న టీం గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

    ఇక ఇదిలా ఉంటే చెన్నై టీం లో ప్రస్తుతం ధోని కెప్టెన్ గా ఉన్నాడు.ఇక ఈ సీజనే ధోనీకి లాస్ట్ సీజన్ కాబోతుంది అంటూ పలువురు క్రికెట్ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ధోని ఈ సీజన్లోనే రిటైర్ అవ్వాల్సింది కానీ టీం కి సరైన కెప్టెన్ లేకపోవడం వల్ల ధోని ఈ సీజన్ ని కంటిన్యూ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సీజన్ లో ధోని రుతు రాజ్ గైక్వాడ్ కి కెప్టెన్సీ ఇచ్చి తనకు కెప్టెన్సీ మెలకువలు చెప్పి తనతో కెప్టెన్సీ చేయించబోతున్నట్టు గా తెలుస్తుంది.

    నిజానికి ధోని కెప్టెన్ గానే కాకుండా మంచి క్రికెటర్ గా, మంచి ఫినిషర్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఇప్పుడు గైక్వాడ్ కెప్టెన్సీ లో ధోని ప్లేయర్ గా ఆడతాడు అంటూ చాలా వార్తలైతే వస్తున్నాయి. ధోని ప్లాన్ ప్రకారం గైక్వాడ్ ని ఇప్పుడు కెప్టెన్ చేసి 2025వ సీజన్ నుంచి ఫుల్ టైం కెప్టెన్ గా తనని నియమించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు కొన్ని మ్యాచ్ లకు ధోని కెప్టెన్సీ చేస్తాడు మిగతా కొన్ని మ్యాచ్ లకు రుతు రాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా మ్యాచ్ లను నడిపించే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ధోని ప్లాన్ ప్రకారం గైక్వాడ్ కనక కెప్టెన్ గా క్లిక్ అయితే మాత్రం తనని ఫుల్ టైమ్ కెప్టెన్ గా వచ్చే సంవత్సరం 2025 నుంచి కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ధోని అనుకున్నట్టుగా గైక్వాడ్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా నిలుస్తాడా లేదా అనేది తెలయాలంటే 2024 ఐపిఎల్ సీజన్ స్టార్ట్ అయేంత వరకు ఎదురు చూడాల్సిందే…