https://oktelugu.com/

Minister Roja: పబ్బులో చిందులేసిన మంత్రి రోజా.. వీడియో వైరల్

రోజా బెంగళూరులో కొత్త సంవత్సరం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి న్యూ ఇయర్ కు స్వాగతం పలికారు.

Written By:
  • Dharma
  • , Updated On : January 3, 2024 / 11:12 AM IST

    Minister Roja

    Follow us on

    Minister Roja: మంత్రి రోజా మరోసారి వార్తల్లో నిలిచారు. న్యూ ఇయర్ వేడుకల్లో ఆమె చిందులేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాధ్యతాయుతమైన మంత్రిగా ఉంటూ ఈ తరహా ప్రదర్శన లేని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినీ రంగం నుంచి రాజకీయాల్లో రోజా అడుగు పెట్టారు. బుల్లితెరపై హోస్ట్ గా కూడా వ్యవహరించారు. అయితే మంత్రి పదవి చేపట్టాక పూర్తిగా రాజకీయాలకి పరిమితమయ్యారు. అయితే ఇప్పుడు మరోసారి తన గ్లామర్ చూపిస్తూ డాన్స్ వేయడంతో సోషల్ మీడియాకు అడ్డంగా బుక్ అయ్యారు.

    రోజా బెంగళూరులో కొత్త సంవత్సరం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి న్యూ ఇయర్ కు స్వాగతం పలికారు. బెంగళూరులోని ఓ పబ్ లో సందడిగా గడిపారు. ఓ పాటకు డ్యాన్సులు వేస్తూ.. లయ బద్ధంగా స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్ వేసుకొని రోజా డాన్స్ వేస్తూ కనిపించారు. ఈ వీడియోలను చూస్తున్న నెటిజెన్స్ రోజా తీరుపై ఫైర్ అవుతున్నారు. రాష్ట్రంలో అంగన్వాడీలు, పారిశుధ్య కార్మికులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతుంటే ఒక బాధ్యతాయుతమైన మంత్రికి ఇవేం పట్టవా? బెంగళూరు పబ్బులో చిందులు వేస్తున్నావ్.. నువ్వు అసలు మంత్రి వేనా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

    గతంలో మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలను మరికొందరు గుర్తు చేస్తున్నారు. గతంలో మంత్రిగా భూమా అఖిలప్రియ వ్యవహరించిన సంగతి తెలిసిందే. నంద్యాల ఉప ఎన్నికల్లో అఖిలప్రియ పంజాబీ డ్రెస్ వేసుకుని ప్రచారం చేయడంతో రోజా తీవ్రస్థాయిలో కామెంట్స్ చేశారు. ఇప్పుడు అదే రోజా ఇలా డాన్స్ వేస్తూ కనిపించడం విమర్శలకు తావిచ్చింది. నాడు అలా మాట్లాడారు కదా? మీరు చేసింది కరెక్టేనా మంత్రిగారు? అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వీడియో పై రోజా ఎలాంటి కామెంట్స్ చేస్తారో చూడాలి.