https://oktelugu.com/

Australia vs Netherlands : 40 బంతుల్లో సెంచరీ.. వరల్డ్ కప్ లో మ్యాక్స్ వెల్ పెను విధ్వంసం.. చిత్తుగా ఓడిన నెదర్లాండ్

ఇక 40 బంతుల్లో సెంచరీ చేసి విధ్వంసాన్ని సృష్టించిన గ్లెన్ మాక్స్ వెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు....

Written By:
  • NARESH
  • , Updated On : October 25, 2023 / 09:27 PM IST
    Follow us on

    Australia vs Netherlands : వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు ఆస్ట్రేలియా నెదర్లాండ్ టీమ్ ల మధ్యన ఒక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టీం భారీ విధ్వంసాన్ని సృష్టించింది.పసికూన అయిన నెదర్లాండ్ టీమ్ బౌలర్ల పైన విరుచుకుపడుతూ ఆస్ట్రేలియన్ టీం ప్లేయర్లు అయిన డేవిడ్ వార్నర్ అద్భుతమైన సెంచరిని చేశాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఆస్ట్రేలియన్ హిట్టర్ అయిన మాక్స్ వెల్ కూడా తనదైన రీతిలో బ్యాటింగ్ చేస్తూ సరికొత్త రికార్డుని క్రియేట్ చేశాడు. 40 బంతుల్లో సెంచరీ చేసి ఈ టోర్నీ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్ గా హిస్టరీ ని క్రియేట్ చేశాడు.

    ఇక మొదటి రెండు మ్యాచ్ ల్లో ఆస్ట్రేలియన్ టీం ఓడిపోయినప్పటికి ఆ తర్వాత ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఆస్ట్రేలియన్ టీమ్ వరుసగా మూడు విజయాలను అందుకొని టాప్ ఫోర్ పొజిషన్ లో కొనసాగుతుంది… ఇక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియన్ టీం నిర్ణీత 50 ఓవర్లకి 8 వికెట్లు కోల్పోయి 399 పరుగులు చేసింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా చేసిన అత్యధిక స్కోర్ కూడా ఇదే కావడం విశేషం….

    ఇక ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్స్ లలో వార్నర్ 104 పరుగులు చేయగా, స్టీవ్ స్మిత్ 71 పరుగులు చేశాడు, అలాగే లబుషాంగి 62 పరుగులు చేశాడు. ఇక చివరిలో మ్యాక్స్ వెల్ విధ్వంసాన్ని సృష్టిస్తూ 44 బంతుల్లో 8 సిక్స్ లు, 9 ఫోర్లతో 106 పరుగులు చేశాడు… ఇక టోర్నీ లో ప్రతి మ్యాచ్ లో ఫెయిల్ అవుతూ వస్తున్న మ్యాక్స్ వెల్ ఈ మ్యాచ్ లో మాత్రం నెదర్లాండ్ బౌలర్లను చీల్చి చెండాడాడు అనే చెప్పాలి. గ్రౌండ్ నలుమూలల షాట్లు కొడుతూ చూసే ప్రతి ప్రేక్షకులను ఆనంద పరుస్తూ ఒకప్పటి మాక్స్ వెల్ విధ్వంసాన్ని ఈ మ్యాచ్ తో మళ్లీ పునరావృతం చేశాడు… గత మూడు సంవత్సరాల క్రితం మ్యాక్స్ వెల్ అంటే భారీ హిట్టర్ అని ప్రతి ఒక్కరు చెప్తూ ఉండేవారు. కానీ ఆ మ్యాజిక్ అనేది ఈమధ్య కాలం లో రిపీట్ కావడం లేదు.ఇక ఇవాళ్ళ ఆడిన మ్యాచ్ లో మాక్స్ వెల్ మళ్లీ టచ్ లోకి వస్తూ ఒక హిట్టర్ ఎలా అయితే చివర్లో తన పాత్ర పోషిస్తాడో ఇవాళ్ళ తను కూడా తన పాత్రను అద్భుతంగా పోషించాడు…

    ఇక 400 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్ టీం కి విక్రమ్ జిత్ సింగ్ అనే బ్యాట్స్ మెన్ మాత్రమే 25 రన్స్ చేసి మాక్స్ వెల్ చేతిలో రనౌట్ అయిపోయాడు.ఇక నెదర్లాండ్ టీమ్ లో ఏ ప్లేయర్ కూడా ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. దాంతో నెదర్లాండ్ టీం 399 పరుగులకే ఆల్ అవుట్ అవ్వాల్సి వచ్చింది. ఇక ఆస్ట్రేలియన్ బౌలర్లలో స్పిన్ దిగ్గజం అయిన ఆడం జంపా 4 వికెట్లు తీయగా,మిచెల్ మార్ష్ 2 వికెట్లు తీశాడు ,ఇక అలాగే పాట్ కమ్మిన్స్, స్టార్క్, హజిల్ వుడ్ ముగ్గురు కూడా తలో వికెట్ తీశారు…దీంతో 309 పరుగుల భారీ స్కోర్ తో ఆస్ట్రేలియా విజయం సాధించడం జరిగింది. దీంతో ఆస్ట్రేలియా టీం 5 మ్యాచ్ ల్లో 3 విజయాలను దక్కించుకొని పెయింట్స్ టేబుల్ లో ఫోర్త్ ప్లేస్ లోనే కొనసాగుతుంది. ఇక దీంతో భారీ విజయాన్ని సాధించడంతో ఆస్ట్రేలియన్ టీం రన్ రేట్ అనేది భారీగా మెరుగుపడింది.ప్రస్తుతం +1.142 గా ఉంది దీంతో ఆస్ట్రేలియా సెమిస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది… ఇక 40 బంతుల్లో సెంచరీ చేసి విధ్వంసాన్ని సృష్టించిన గ్లెన్ మాక్స్ వెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు….