https://oktelugu.com/

Neru Review: నేరు ఫుల్ మూవీ రివ్యూ…

జీతు జోసెఫ్ మోహన్ లాల్ కాంబినేషన్ వర్కౌట్ అయిందా..? కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు అలరించింది..? అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Written By:
  • Gopi
  • , Updated On : January 24, 2024 / 02:07 PM IST

    Neru Review

    Follow us on

    Neru Review: కొన్ని సినిమాలు చూస్తున్నంత సేపు ప్రేక్షకుడు ఆ సినిమాలో లీనమైపోయి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.అలాంటి సినిమాల్లో మలయాళ దర్శకుడు అయిన జీతు జోసఫ్ సినిమాలు మొదటి వరుసలో ఉంటాయి. ఈయన దర్శకత్వంలో వచ్చిన దృశ్యం, దృశ్యం 2 సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. మలయాళం లో మోహన్ లాల్ ఈ సినిమాల్లో హీరోగా నటిస్తే, తెలుగులో మాత్రం వెంకటేష్ హీరోగా ఈ సినిమాలను రీమేక్ చేశాడు.ఇక ఇప్పుడు మోహన్ లాల్, జీతు జోసఫ్ కాంబినేషన్ లో ‘నేరు’ అనే మరొక సినిమా వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది, మరోసారి జీతు జోసెఫ్ మోహన్ లాల్ కాంబినేషన్ వర్కౌట్ అయిందా..? కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు అలరించింది..? అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ
    ముందుగా ఈ సినిమా కథలోకి వెళ్తే సారా
    అనే ఒక అంధురాలు కొన్ని కారణాలవల్ల 12 సంవత్సరాల వయసులోనే తన కంటి చూపు కోల్పోతుంది. ఇక తన తండ్రి సపోర్ట్ తో చిన్నప్పటి నుంచి బొమ్మల్ని తయారు చేయడం నేర్చుకుంటుంది. అలాగే ఒక మనిషిని తన చేతులతో తాకి తన రూపం ఎలా ఉంటుందో కూడా అలాంటి బొమ్మలను తయారు చేసేంత నాలెడ్జ్ సారా కి ఉంటుంది. ఒకరోజు తల్లిదండ్రులు తనని ఇంట్లో వదిలేసి బయటికి వెళ్ళిన క్రమంలో మైఖేల్ అనే ఒక వ్యక్తి ఆమెని రేప్ చేస్తాడు. దాంతో సారా మైఖైల్ బొమ్మ తయారు చేసి పోలీసులకి తను ఎవరో తెలిసేలా చేస్తుంది. ఇక ఈ మొత్తం ప్రాసెస్ లో మైఖేల్ అనే కుర్రాడిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. కానీ అతను ఒక బిజినెస్ మాన్ కొడుకు అవడం వల్ల ఈ కేసును తను ఎలాగైనా గెలవాలి అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు న్యాయవాది అయిన రాజశేఖర్ ని తన వైపు వాదించడానికి తీసుకొస్తాడు. ఇక రాజశేఖర్ కి భయపడి చాలామంది లాయర్లు సారా వైపు వాదించడానికి భయపడతారు.

    ఇక ఇలాంటి క్రమంలోనే రాజశేఖర్ వల్ల 5 సంవత్సరాలు బార్ కౌన్సిల్ నుంచి సస్పెండ్ అయిన విజయ్ మోహన్ (మోహన్ లాల్) సారా తరపున కేసు వాదించడానికి వస్తాడు. ఇక సారా కేసు ని విజయ్ మోహన్ గెలిపించాడా..? అసలు విజయ్ మోహన్ కి, రాజశేఖర్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి, వాళ్లిద్దరి మధ్య జరిగిన గొడవ ఏంటి..? రాజశేఖర్ ఎందుకు విజయ్ మోహన్ ని 5 సంవత్సరాల పాటు సస్పెండ్ చేయించాడు. అనే విషయాన్ని తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూసి తీరాల్సిందే…

    విశ్లేషణ
    ఇక ఈ సినిమాలో జీతూ జోసఫ్ ఎప్పటిలాగే తన మార్క్ చూపిస్తూ తెరపైన తన మ్యాజిక్ ని రిపీట్ చేశాడు. ఇక ముఖ్యంగా మోహన్ లాల్ కి కంప్లీట్ యాక్టర్ గా ఉన్న బిరుదును మరొకసారి ఈ సినిమాలో తన నటనతో ప్రూవ్ చేసుకున్నాడనే చెప్పాలి. అయితే కొన్ని సీన్లలో జీతూ జోసఫ్ చూపించిన లాజిక్స్ చాలా బాగా వర్క్ అవుట్ అయ్యాయి. ఇక ఈ సినిమా మొత్తం కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కింది. అయితే మోహన్ లాల్ కి రాజశేఖర్ పాత్ర చేసిన సిద్ధికీ కి మధ్య కొన్ని సీన్లు మాత్రం చాలా బాగున్నాయి. కేసు గెలవడానికి రాజశేఖర్ అబద్ధపు సాక్ష్యాలను సృష్టిస్తూ ఉంటే మోహన్ లాల్ మాత్రం నిజాన్ని గెలిపించడానికి చేసే ప్రయత్నం చాలా బాగుంది. ఆయన వేసే ఎత్తులను మోహన్ లాల్ పసిగడుతూ వాటికి తన లాజిక్కులతో సమాధానం చెప్తూ ఉంటాడు. ఇక ఇలాంటి సీన్లతో జీతూ జోసఫ్ ప్రేక్షకులను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక ఈ ప్రయత్నంలో తను చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి… ఎప్పటిలాగే జీతూ జోసఫ్ మోహన్ లాల్ ని మరొకసారి డిఫరెంట్ గా చూపించి సక్సెస్ అయ్యాడు. ఇక వీళ్ళ కాంబినేషన్ కి మొదటి నుంచి మంచి గుర్తింపు అయితే ఉంది.

    ఆ సక్సెస్ లను కంటిన్యూ చేస్తూ ఇప్పుడు కూడా వీళ్ళ కాంబినేషన్ సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు సాగుతుందనే చెప్పాలి…అయితే జీతూ జోసఫ్ కొన్ని సినిమాలను తీసినప్పటికీ ఆయన ఈ సినిమా విషయంలో ఎంచుకున్న లాజిక్కులు మాత్రం చాలా బాగా వర్క్ అయ్యాయి. ఒక కేసును డీల్ చేయాలంటే లాయర్ దగ్గర ఎలాంటి పొటెన్షియాలిటీ ఉండాలి అనేది పర్ఫెక్ట్ గా చూపించారు. న్యాయవ్యవస్థ లో పేదవాడికి న్యాయం జరుగుతుందా, లేదా డబ్బు, అధికారం ఉన్నవాళ్లే న్యాయాన్ని కొంటున్నారా అనే ఆలోచించే అంశాన్ని కూడా ఈ సినిమాలో మిళితం చేసి చూపించడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…ఇక ఈ సినిమాతో జీతూ జోసఫ్ మరొక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు…

    నటీనటుల పర్ఫామెన్స్
    మోహన్ లాల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. ఆయనకి ఏ క్షణాన కంప్లీట్ యాక్టర్ అనే బిరుదు ఇచ్చారో తెలియదు కానీ అది ఆయనకి పర్ఫెక్ట్ యాప్ట్ అని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ చేశాడు. ఇక దీంట్లో తను వన్ మ్యాన్ షో చేశాడు. అలాగే రాజశేఖర్ గా నటించిన సిద్ధికి కూడా చాలా వరకు మంచి పర్ఫామెన్స్ ని ఇచ్చాడు. ఇక మోహన్ లాల్ తో పోటా పోటీగా నటించి తను కూడా ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర వహించాడు. ఇక మిగిలిన పాత్రల్లో నటించిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు అయితే బాగా నటించారనే చెప్పాలి… అలాగే ఈ సినిమాలో సాంగ్స్ లేనప్పటికీ బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగా హెల్ప్ అయింది… సినిమాటోగ్రఫీ కూడా చాలా కూల్ గా ఉంది. ఎక్కడ కూడా డిస్టబెన్స్ లేకుండా డీసెంట్ వే షాట్స్ డిజైన్ చేశారు…

    ప్లస్ పాయింట్స్…
    ఇక ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే…

    కథ
    మోహన్ లాల్ యాక్టింగ్
    జీతూ జోసఫ్ డైరెక్షన్

    మైనస్ పాయింట్స్…
    ఇక సినిమాలో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటంటే…

    కొన్ని సీన్లు లాగయ్యాయి, అలాగే సినిమా ఎక్కువ భాగం మొత్తం కోర్టు రూమ్ లోనే ఉండటం వల్ల ప్రేక్షకుడికి అక్కడక్కడ బోర్ కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి.

    ఇక ట్విస్ట్ లు ఎమి లేకుండా చాలా ప్లాట్ గా ఉంటుంది…

    రేటింగ్
    ఇక ఈ సినిమాకు మేము ఇచ్చే రేటింగ్ 2.75/5