https://oktelugu.com/

Madapur Rave Party : పనిచేసింది నేవీలో.. చేస్తున్నదేమో రేవ్ పార్టీలు.. మద్యం, డ్రగ్స్ దందా

ఇదీ హైదరాబాద్ మహానగరంలో రేవ్ పార్టీలు జరుగుతున్న తీరు. తాజాగా మాదా పూర్ విఠల్ రావు నగర్ లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ ఉదంతం ఆందోళన కలిగిస్తోంది.

Written By:
  • Rocky
  • , Updated On : August 31, 2023 / 08:18 PM IST

    police-conducts-raids

    Follow us on

    Madapur Rave Party : ఇంతకుముందు శివారు ప్రాంతాల్లో నిర్వహించేవారు. ఇప్పుడు మరింత బరి తెగించారు. నగరం నడిబొడ్డులోనే ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి 10 దాటితే చాలు సందేశాలు పంపుతున్నారు. వేరువేరు నెంబర్ల ద్వారా లోకేషన్లు పంపుతున్నారు. ఇక వారు అందులోకి వచ్చిన తర్వాత అసలు తతంగం మొదలు పెడుతున్నారు. తాగేవారికి మద్యం, పీల్చే వారికి సిగరెట్లు, తూలేవారికి డ్రగ్స్, ఇంకా అంతకుమించి కోరుకునే వాళ్లకు ఆ తరహా సౌలభ్యం కల్పిస్తున్నారు. ఇదీ హైదరాబాద్ మహానగరంలో రేవ్ పార్టీలు జరుగుతున్న తీరు. తాజాగా మాదా పూర్ విఠల్ రావు నగర్ లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ ఉదంతం ఆందోళన కలిగిస్తోంది.

    పోలీసులు జరిపిన దాడిలో..

    మాదా పూర్ విఠల్ రావు నగర్ లో పోలీసులు జరిపిన దాడుల్లో రేవ్ పార్టీ భగ్నమైంది. ఇదే సందర్భంలో డ్రగ్స్ రాకెట్ కూడా వెలుగులోకి వచ్చింది. ఈ దాడుల్లో సినీ నిర్మాత వెంకటరత్నారెడ్డి అలియాస్ వెంకట్, ప్రధాన నిందితుడు బాలాజీ మురళిని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. 33 లక్షల విలువైన డ్రగ్స్ తో పాటు 72,500 నగదు ఐదు కార్లు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే తొలుత పక్కా సమాచారంతో పోలీసులు గుడిమల్కాపూర్ లోని ఓ అపార్ట్మెంట్లో బాలాజీ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతడు ఇచ్చిన సమాచారంతో మాదాపూర్ విఠల్ రావు నగర్ లోని అపార్ట్మెంట్లో జరుగుతున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో సినీ నిర్మాత వెంకటరత్నారెడ్డి అలియాస్ వెంకట్, గుంటూరుకు చెందిన మురళిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు బాలాజీ మాజీ నేవీ అధికారి అని పోలీసుల దర్యాప్తులో బయటపడింది. కంటికి గాయం కావడంతో నేవీ నుంచి బాలాజీ వైదొలిగాడు. ఆపై అతడు స్నేహితులతో కలిసి మాదాపూర్ లోని ప్రెస్ లింగ్ అపార్ట్మెంట్లో తరచూ పార్టీలు నిర్వహిస్తున్నాడు. అయితే ఈ పార్టీలు మొత్తం కేవలం విఐపి లను దృష్టిలో పెట్టుకొని నిర్వహిస్తున్నాడు. దీనికోసం ఏకంగా పదులకొద్దీ వాట్స్అప్ గ్రూపులు నిర్వహిస్తున్నాడు. ముంబై, పూణే, అహ్మదాబాద్ నగరాలకు చెందిన యువతులను రేవ్ పార్టీలు నిర్వహించేటప్పుడు హైదరాబాద్ తీసుకొస్తున్నాడు.

    డ్రగ్స్ ముఠాలతో పరిచయాలు

    బాలాజీ నేవీ అధికారి కావడంతో.. డ్రగ్స్ ఎవరెవరు సరఫరా చేస్తున్నారో సులభంగానే తెలుసుకున్నాడు. కంటికి గాయం కావడంతో నేవీ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలకు చెందిన డ్రగ్ సరఫరాదారులతో బాలాజీ పరిచయాలు పెంచుకున్నాడు. డ్రగ్స్ సరఫరాదారులు సీక్రెట్ మార్గంలో బాలాజీకి మాదక ద్రవ్యాలు సరఫరా చేయడం మొదలుపెట్టారు. మాదాపూర్ కేంద్రంగా అతడు విఐపి ల కోసం రేవ్ పార్టీలు నిర్వహించడం మొదలుపెట్టాడు. డబ్బులు బాగా వస్తుండడంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రేవ్ పార్టీలు నిర్వహించడం మొదలుపెట్టాడు. కేవలం స్థానికంగా ఉన్న వారితోనే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన విఐపి ల కోసం కూడా పార్టీలు నిర్వహించే స్థాయికి ఎదిగాడు. ఈ క్రమంలోనే నైజీరియన్లతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. బెంగళూరులోని ముగ్గురు నైజీరియా ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన బాలాజీ.. సినీ పరిశ్రమలోని కొందరికి అమ్మినట్టు తెలుస్తోంది. ఇక వెంకట్ కూడా తరచూ విఐపి ల కోసం పార్టీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కోసం బాలాజీకి ఆయన భారీగా డబ్బు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఘటన పై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.