Naveen Polishetty : సినిమా కంటెంట్ ఎలా ఉన్నా, తమ యాక్టింగ్ టాలెంట్ తో సూపర్ హిట్ రేంజ్ కి తీసుకెళ్లే హీరోలు మన టాలీవుడ్ లో చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వారిలో ఒకరే నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty).. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ని మొదలు పెట్టి, ఆ తర్వాత హీరో గా మారి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకొని, ఆ తర్వాత ‘జాతి రత్నాలు’, ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ వంటి వరుస బ్లాక్ బస్టర్స్ ని అందుకొని, రీసెంట్ గా సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో మరో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. ఇంతటి పోటీ వాతావరణం లో 28 కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో దిగిన ఈ సినిమా, కేవలం నాలుగు రోజుల్లోనే ఆ టార్గెట్ ని అందుకొని, లాభాల్లోకి అడుగుపెట్టింది.
నాలుగు సినిమాల్లో హీరో గా చేస్తే, నాలుగు సూపర్ హిట్ అయ్యాయి, పైగా అవన్నీ తన యాక్టింగ్ టాలెంట్ తోనే అవ్వడం గమనించాల్సిన విషయం. యూత్ ఆడియన్స్ లో కూడా తనకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడడం తో నవీన్ పోలిశెట్టి తన రెమ్యూనరేషన్ ని అమాంతం పెంచేసినట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటూ వచ్చిన నవీన్ పోలిశెట్టి, ఇకపై చేయబోయే సినిమాలకు పాతిక కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. రీసెంట్ గానే ఆయన ఒక క్రేజ్ కాంబినేషన్ లో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. పెద్ద స్కేల్ లో ఈ సినిమాని నిర్మించబోతుండడంతో, రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్ లో డిమాండ్ చేస్తూ పాతిక కోట్లు అడిగాడట. నిర్మాత అందుకు ఒప్పుకొని అడ్వాన్స్ కూడా ఇచ్చి వెళ్లినట్లు తెలుస్తోంది. సొంత కామెడీ టైమింగ్ తో ఒక సినిమాని సూపర్ హిట్ రేంజ్ కి తీసుకెళ్లే టాలెంట్ ఉన్నటువంటి నవీన్ పోలిశెట్టి లాంటోళ్ళు ఎంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినా తప్పులేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ తో పాటు నవీన్ పోలిశెట్టి మాస్ మహారాజ రవితేజ తో కలిసి ఒక మల్టీస్టార్రర్ చిత్రం చేయబోతున్నట్టు టాక్. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనేది ఇంకా ఖరారు కాలేదు. కానీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనే ఈ చిత్రం తెరకెక్కుతోందని అంటున్నారు. ఎనర్జీ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే నవీన్, రవితేజ కలిసి సినిమా చేస్తే ఆడియన్స్ కి ఏ రేంజ్ ఎంటర్టైన్మెంట్ అందుతుందో మీరే ఊహించుకోండి. ఈ క్రేజీ కాంబినేషన్ ఈ ఏడాది సెకండ్ హాఫ్ లోనే మొదలు కానుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో నవీన్ పోలిశెట్టి గ్రాఫ్ ఎలా ఉండబోతుంది అనేది.
