https://oktelugu.com/

Tollywood : టాలీవుడ్ ను షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసు.. పోలీసులకు దొరక్కుండా ఆ హీరో పరార్

నవదీప్ పేరు ఇప్పుడే కొత్తగా వినిపించడం లేదు డ్రగ్స్ దొరికింది అన్న ప్రతిసారి నవదీప్ పేరు కూడా దాంట్లో వినిపిస్తూ ఉండేది

Written By:
  • Gopi
  • , Updated On : September 14, 2023 / 10:12 PM IST

    Tollywood-Drugs-Case---Picture-A

    Follow us on

    Tollywood : టాలీవుడ్ ను డ్రగ్స్ కేసు వీడడం లేదు. ఇప్పటికే ప్రముఖ హీరోలు, దర్శకులు, హీరోయిన్లు ఈ డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్నారు. అందులో ఈ హీరో కూడా ఉన్నారు. అయితే నాడు తెలంగాణ సర్కార్ లైట్ తీసుకోవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ మత్తు నుంచి బుద్ది తెచ్చుకోని యంగ్ హీరో మరోసారి డ్రగ్స్ తీసుకొని పోలీసుల దృష్టిలో పడ్డారు. పేరు బయటకు రావడంతో ఇప్పుడు పరార్ అయ్యారు.

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి సినిమాలతో మంచి హీరోగా గుర్తింపు పొందిన హీరో లలో నవదీప్ ఒకరు.ఈయన తేజ తీసిన జై సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అప్పటినుంచి ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటిస్తూ నటుడిగా మంచి గుర్తింపును సాధించుకున్నారు ఆయన హీరోగా చేసిన చాలా సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. అందులో చందమామ సినిమా ఒకటి ప్రస్తుతం నవదీప్ కి హీరోగా అవకాశాలు లేకపోవడంతో ఇప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తున్నాడు… అందులో భాగంగానే ఆయన చాలా సినిమాల్లో నటించి మెప్పించారు…

    అయితే సినిమాలలో చేసిన దానికంటే ఎక్కువగా కాంట్రవర్సీలలో నిలుస్తూ న్యూస్ లో ఎక్కువగా ఆయన పేరు వినిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు ఆయన పేరు మీద ఒక కాంట్రావర్సి నడుస్తుంది. అదేటంటే మాదాపూర్ కి సంబంధించిన ఒక డ్రగ్స్ కేసులో నవదీప్ కి సంబంధం ఉన్నట్టుగా సిపి సివి ఆనంద్ తెలిపారు. అలాగే ఆయన డ్రగ్స్ తీసుకున్నట్టుగా గుర్తించామన్నారు.ఇక ఆయనతోపాటు ఇంకా కొంతమంది డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా నిర్ధారించాము అని చెప్తూనే ఇక నవదీప్ తో పాటు వీళ్లంతా పరారీ లో ఉన్నట్టుగా కూడా తెలిపారు… ఇక వీళ్ళతోపాటుగా ఇదే కేస్ లో మాజీ ఎంపీ కుమారుడు సురేష్ రావు ని అరెస్ట్ చేశామని వెల్లడించారు…

    అయితే నవదీప్ పేరు ఇప్పుడే కొత్తగా వినిపించడం లేదు డ్రగ్స్ దొరికింది అన్న ప్రతిసారి నవదీప్ పేరు కూడా దాంట్లో వినిపిస్తూ ఉండేది. ఇలా ఈయన పేరు ఇప్పటికి చాలాసార్లు డ్రగ్స్ కేస్ లో వినిపించింది. ఇక ప్రస్తుతం నవదీప్ దొరికితే ఆయన తో పాటు ఇంక చాలామంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.హైద్రాబాద్ పోలీసులు చాలాసార్లు డ్రగ్స్ కు సంబంధించిన కేసును బయటికి తీస్తున్నారు కానీ దాంట్లో ఇన్వాల్వ్ అయిన చాలామంది పెద్ద వాళ్ల పేర్లను బయట పెట్టడం లేదు అంటూ చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు నవదీప్ దొరికితే చాలామంది సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన వాళ్ల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది…