Naresh’s affair is a hot topic in the industry: దివంగత ప్రముఖ దర్శకురాలు విజయ నిర్మల కుమారుడు, నటుడు, కమెడియన్ నరేష్ నాలుగు స్తంభాలాట ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నరేష్, పవిత్ర సిక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని, వీరిద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారనే వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈక్రమంలోనే నరేష్ మూడో భార్య తన సంగతి తేల్చాలంటూ పంచాయితీకి దిగడంతో ఇంటిగుట్టు కాస్తా రోడ్డుకెక్కింది.

- మీడియా ముఖంగా మాటలయుద్ధం..
నరేష్, పవిత్రలు కొంతకాలంగా మీడియాలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారారు. ప్రముఖ దేవాలయాలను సందర్శించడం, స్వామీజీలతో పూజలను కలిసి చేస్తుండటంతో వీరిమధ్య సంథింగ్.. సంథింగ్ ఉందనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే నరేష్ మూడో భార్యగా చెప్పుకుంటున్న రమ్య రంగంలోకి దిగారు. మీడియాలో ప్రెస్ మీట్ పెట్టి మరీ పవిత్ర, నరేష్ ల బంధంపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
- పవిత్రపై దాడికి యత్నం..
నరేష్ ప్రస్తుతం కన్నడలో ఓ సినిమా చేస్తున్నాడు. దీంతో నరేష్ ప్రస్తుతం బెంగూళూరులో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే నరేష్ భార్య రమ్య సైతం బెంగుళూరుకి వెళ్లి మీడియా ప్రెస్ మీట్ పెట్టి పవిత్రపై ఆరోపణలు గుప్పించారు. తాజాగా మైసూరులోని ఓ హోటల్లో పవిత్ర, నరేష్ లు ఉంటున్నారని తెలుసుకున్న రమ్య వారిని రెడ్ హ్యండెండ్ గా పట్టుకునేందుకు పోలీసులతో అక్కడికి వెళ్లారు. తనకు విడాకులు ఇవ్వకుండానే నరేష్ పవిత్రతో ఎలా సహజీవనం చేస్తాడంటూ ఆమె ప్రశ్నించింది. ఈక్రమంలోనే పవిత్రపై చెప్పుతో దాడికి చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
- నా సంగతి తేల్చిండి..
నరేష్, పవిత్ర లోకేష్ ఉంటున్న హోటల్ వద్దకు వెళ్లిన రమ్య అక్కడ ఆందోళనకు దిగారు. నరేష్ తనకు విడాకులు ఇవ్వలేదని చెప్పారు. తన విడాకుల వ్యవహారం కోర్టులో ఉండగానే నరేష్ మరో వ్యక్తితో సహజీవనం ఎలా చేస్తాడంటూ నిలదీసింది. నరేష్ కు విడాకులు ఇచ్చేందుకు తాను సిద్ధంగా లేనని చెప్పింది. నరేష్ తో కలిసి జీవించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. నరేష్, పవిత్ర వ్యవహారంపై తన బిడ్డకు ఆందోళన చెందుతుందని చెప్పారు. తనకు విడాకులు వద్దని, న్యాయం చేయాలంటూ ఆమె వేడుకుంటోంది.
- కథ కంచికి చేరేనా?
నరేష్, పవిత్ర, నరేష్ భార్య రమ్య, పవిత్ర భర్త సుచేంద్రల వ్యవహరం నాలుగు స్తంభాలాటను తలపిస్తోంది. నరేష్ తన భార్య రమ్యపై అనేక ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆర్థికంగా, మానసికంగా తనను ఇబ్బందులుపాలు చేస్తుందని తెలిపాడు. అలాగే పవిత్ర భర్త సుచేంద్ర సైతం పవిత్రది కాపురాలు కూల్చే క్యారెక్టర్ అంటూ చెప్పుకొచ్చాడు. మరోవైపు పవిత్ర మాత్రం సుచేంద్రతో తనకు వివాహం జరుగలేదని, కేవలం సహజీవనం మాత్రమే చేశానంటూ చెబుతోంది. నరేష్, రమ్య మధ్య ఏదైనా సమస్య ఉంటే కూర్చోని పరిష్కరించుకోవాలని, అనవసరం తనను ఇందులోకి లాగొద్దని చెబుతోంది. ఏదిఏమైనా ఈ నలుగురి వ్యవహరం ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.