Narendra Modi: మోడీపై దేశమంతా ఎప్పుడూ లేనంత సానుకూల పవనాలు

మోడీపై దేశమంతా ఎప్పుడూ లేనంత సానుకూల పవనాలు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : March 5, 2024 6:39 pm

ఎన్నికల షెడ్యూల్ కూడా ఇంకా ప్రకటన రాలేదు. 13వ తేదీ వరకూ ఈసీ పర్యటనలు ఉన్నాయి. లాస్ట్ జమ్మూ కశ్మీర్ లో ఈసీ పర్యటించనుంది.14వ తేదీన ఈసీ దేశవ్యాప్తంగా ఎన్నికలకు నోటిఫికేషన్ వేసే అవకాశం ఉంది.

ప్రధాని మోడీ ప్రోగ్రాం కూడా దాని ప్రకారం ఉంది. అధికారిక అభివృద్ధి కార్యక్రమాలను 13వ తేదీ వరకూ సీరియల్ గా ప్లాన్ చేశారు. ఇప్పటికే ఎన్నికలు వచ్చేశాయని చెప్పొచ్చు. దేశం మొత్తం మోడీ మేనియా ఆవహించింది. తరతమ బేధం లేకుండా అందరూ మోడీని గెలిపించేందుకు నడుం బిగించారు. మహిళలు, పురుషులు తేడా లేదు. ప్రాంతాల విభేదాలు లేవు. హిందీ బెల్ట్, నాన్ హిందీ బెల్ట్ అయినా అన్ని చోట్ల మోడీ మేనియా ఆవహించింది.

అందరి కన్నా చాలా అడ్వాన్స్ గా మోడీ ప్రచారం ఉంది. రాహుల్ గాంధీ కేంబ్రిడ్జి వర్సిటీ కార్యక్రమానికి హాజరయ్యారు. పాదయాత్రను పక్కన పెట్టారు. రాహుల్ గాంధీ ప్రచారం ఊపు ఎక్కడా లేదు.

మోడీపై దేశమంతా ఎప్పుడూ లేనంత సానుకూల పవనాలు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.