Nara Lokesh – Arnab Goswami : అక్కడున్నది మామలూ జర్నలిస్ట్ కాదు.. అర్నాబ్ గోస్వామి. ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. ఎదుటివారిని మాట్లాడకుండా నోరు మూయిస్తాడు. అలాంటి జర్నలిస్టు దగ్గరకు సరిగ్గా భాష కూడా పలుకరాని.. వ్యక్తం చేయలేని నారా లోకేష్ వెళ్లాడు. తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని ఢిల్లీ వేదికగా ఎండగట్టాలని చూశాడు.
కానీ ఇక్కడ మీడియాను మేనేజ్ చేసినట్టు ఢిల్లీలో చేస్తామంటే కుదరదు కదా.. అందుకే అడ్డంగా బుక్కయ్యాడు. అర్నాబ్ గోస్వామి ‘రిపబ్లిక్ టీవీ’ చానెల్ డిబేట్ కు వెళ్లి పరువు పోగొట్టుకున్నాడు. పక్కా ఆధారాలతో అర్నాబ్ గోస్వామి ‘చంద్రబాబు అవినీతి చేశాడనానికి ఆధారాలు ఉన్నాయని పేపర్లు’ చూపిస్తుంటే నారా లోకేష్ మౌనం దాల్చాడు. ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు.
ఇక నారా లోకేష్ చెప్పిన ఉదాహరణ నవ్వుల పాలైంది. ‘ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ తప్పు చేస్తే.. ఎస్బీఐ చైర్మన్ ను అరెస్ట్ చేస్తారా?’ అంటూ తన తండ్రి చంద్రబాబు తప్పు చేయలేదు అని.. కింది వాళ్లు చేశారని లోకేష్ హింట్ ఇచ్చారు. అంటే ఈ స్కాంలో అవినీతి జరిగిందని పరోక్షంగా మీరు ఒప్పుకుంటున్నారా? అని అర్నాబ్ గోస్వామి అక్కడే అడిగేశారు. దీంతో లోకేష్ కూడా ఏం చెప్పాలో తెలియక స్కాం జరిగిందని ఒప్పుకునే పరిస్థితిని అర్నాబ్ గోస్వామి తెచ్చారు.
జాతీయ మీడియా సాక్షిగా "స్కిల్ డెవోలప్మెంట్ స్కామ్" లో తప్పు జరిగింది అని ఒప్పుకుంటున్న నారాలోకేష్..!!#SkillDevelopmentScam #CorruptBabuNaidu #KhaidiNo7691 pic.twitter.com/X8hjxP7hJT
— Jagananna Connects (@JaganannaCNCTS) September 16, 2023
మొత్తంగా ఢిల్లీ వెళ్లి మరీ సరైన ఆధారాలు, వాగ్ధాటి, టీవీ చర్చల్లో సరిగ్గా స్పందించడం రాక నారా లోకేష్ పరువు పొగొట్టుకున్నట్టు అయ్యింది. జాతీయ మీడియా సాక్షిగా నారా లోకేష్ డిఫెన్స్ లో పడిపోయారు. ఇలాంటి విషయాల్లో కాస్త ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిది. లేకుంటే ఇలానే అడ్డంగా బుక్కవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు.
ఒరే పప్పు గా జాతీయ చానెల్స్ దగ్గర కూడా అన్ని ఆధారాలు ఉన్నాయి రా…. మర్యాద పోగొట్టుకోవడానికి అంతా దూరం వెళ్ళావా pic.twitter.com/ybeIPI6pwW
— Anitha Reddy (@Anithareddyatp) September 16, 2023