https://oktelugu.com/

Nara Lokesh : నారా లోకేష్.. రెడ్ బుక్ శంఖారావం..

అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని లోకేష్ హెచ్చరించారు. లోకేష్ ఈ తరహా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతున్నది. మరి దీనిపై వైసీపీ నాయకులు ఏ విధమైన కౌంటర్ ఇస్తారో వేచి చూడాల్సి ఉంది.

Written By:
  • NARESH
  • , Updated On : February 12, 2024 / 09:02 AM IST
    Follow us on

    Nara Lokesh : ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తే.. ప్రత్యర్థి పార్టీపై విమర్శలు చేస్తే.. ఓటర్లు జిందాబాద్ కొట్టి..జై అంటూ నినాదాలు చేసే రోజులు కావివి. మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఇమిడిపోయిన తర్వాత ఎంతలా అప్డేట్ అయ్యామో.. ఓటర్లు కూడా అలాగే అప్డేట్ అయ్యారు. అందుకే తమ నాయకుల నుంచి కేజీఎఫ్ లెవెల్ లో ఎలివేషన్ కోరుకుంటున్నారు.. వారి అంచనాలకు చేరుకోకుండా ఉంటే వెంటనే తమ నిరసన లేదా ఆగ్రహాన్ని ముఖం మీద చూపిస్తున్నారు. సో ఇప్పుడు ఓటర్లను ఆకట్టుకునే ఎలివేషన్ల కోసం నాయకులు తెగ తాపత్రయపడుతున్నారు. అయితే అలాంటి ఎలివేషన్ ను టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నమే రెడ్ బుక్. ఇచ్చాపురంలో మొదలైన ఈ రెడ్ బుక్ ప్రస్తావన ఏపీ రాజకీయాలను ఏం చేస్తుందో తెలియదు గాని.. ప్రస్తుతానికైతే చర్చనీయాంశంగా మారింది.

    సాధారణంగా కేసులను రెడ్ బుక్ లో నమోదు చేస్తారు. ప్రస్తుతం నారా లోకేష్ కూడా ఆ పుస్తకాన్నే ప్రజల ముందుకు తెచ్చాడు. యువ గళం పాదయాత్ర ముగిసిన తర్వాత నారా లోకేష్ శంఖారావం పేరుతో మలిదశ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మద్దతుదారులపై దాడులు జరుగుతున్నాయని.. టిడిపి అనుకూల కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. అలాంటి వేధింపులపై తాను రెడ్ బుక్ లో వివరాలు నమోదు చేస్తామని నారా లోకేష్ ప్రకటించారు. అన్నట్టుగానే సభలో ఆయన రెడ్ బుక్ తో కనిపించారు. పార్టీ కార్యకర్తలు చెప్పిన కేసులను ఆయన రెడ్ బుక్ లో రాసుకున్నారు. కొందరైతే ఫోటోలు కూడా ఇస్తే వాటిని అందులో భద్రంగా దాచుకున్నారు.

    జగన్ ప్రభుత్వ హయాంలో టిడిపి నాయకులకు రక్షణ అంటూ లేకుండా పోయిందని నారా లోకేష్ ఆరోపించారు. అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డి అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని విమర్శించారు. అలాంటి అధికారుల పేర్లను తాను రెడ్ బుక్ లో నమోదు చేస్తున్నానని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారులను, వారిని ప్రేరేపించిన రాజకీయ నాయకులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ చెబుతున్నారు. అయితే నారా లోకేష్ రెడ్ బుక్ ప్రస్తావన తీసుకురావడంతో ప్రజల నుంచి ఆశించినంత దాని కంటే ఎక్కువ స్పందన లభిస్తుంది. ఇక ఆదివారం ఇచ్ఛాపురంలో ప్రారంభమైన శంఖారావం యాత్రలో నారా లోకేష్ పదేపదే రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చారు. దీంతో జనం కేరింతలు కొట్టారు.. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నుంచి మొదలు పెడితే తన వరకు నమోదైన కేసులు.. కొన్ని కేసుల్లో నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని లోకేష్ హెచ్చరించారు. వారందరి వివరాలు రెడ్ బుక్ లో నమోదు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని లోకేష్ హెచ్చరించారు. లోకేష్ ఈ తరహా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతున్నది. మరి దీనిపై వైసీపీ నాయకులు ఏ విధమైన కౌంటర్ ఇస్తారో వేచి చూడాల్సి ఉంది.