‘Shiva’ Movie : అక్కినేని నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మొదట చేసిన కొన్ని సినిమాలతో అసలు సక్సెస్ లను అందుకోలేకపోయాడు. ఇక దాంతో నాగార్జున ఇండస్ట్రీలో హీరోగా ఎదగడం కష్టం అనుకుంటున్నా టైంలో రామ్ గోపాల్ వర్మ తీసిన శివ సినిమాతో ఒక్కసారిగా తన స్టార్ డమ్ ఏంటో ఇండస్ట్రీ మొత్తానికి పరిచయం చేశాడు. ఇక ఇదే క్రమంలో ఆయన చేసిన వరుస సినిమాలు మంచి విజయాలను అందుకుంటూ వచ్చాయి.ఇక ఇదిలా ఉంటే శివ సినిమా టైమ్ లో వర్మకి, నాగార్జునకి మధ్య గొడవైనట్టుగా అప్పట్లో చాలా కథనాలు అయితే వెలువెత్తాయి.
అయితే నాగార్జున అమలను హీరోయిన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. కానీ వర్మ మాత్రం అప్పటికే హీరోయిన్ గా మంచి క్రేజ్ లో ఉన్న శ్రీదేవిని తీసుకోవాలనుకున్నాడు. ఇక వీళ్లిద్దరి సంఘర్షణలో నాగార్జున గారే పై చేయి సాధించారనే చెప్పాలి. ఎందుకంటే వర్మకి అది మొదటి సినిమా కాబట్టి అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు పిలిచి వర్మకి ఛాన్స్ ఇచ్చినప్పుడు కొన్ని విషయాల్లో తగ్గాల్సి ఉంటుంది. అందుకే హీరోయిన్ విషయంలో వర్మ తగ్గినట్టుగా అప్పట్లో చాలా కథనాలు అయితే వెలువడ్డాయి.
అయితే నాగార్జున అమలను తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే అప్పటికే వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. కాబట్టి నాగార్జున అమల అయితే తనకి కన్వినెంట్ గా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ సినిమాలో హీరోయిన్ గా ఆమెని తీసుకున్నాడు. మొత్తానికైతే నాగార్జున వర్మ మధ్య జరిగిన గొడవని నాగార్జున వాళ్ళ అన్నయ్య అయిన అక్కినేని వెంకట్ సద్దుమనగ గొట్టి ఈ సినిమాకి అమలను హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు.
ఇక వర్మ కూడా ఈ సినిమా షూటింగ్ ను చాలా ఫాస్ట్ గా చేసి రిలీజ్ చేశాడు. అందులో భాగంగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఇక దాంతో వర్మ స్టార్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత వర్మ వెంకటేష్ తో చేసిన క్షణక్షణం సినిమాలో వర్మ శ్రీదేవి ని హీరోయిన్ గా పెట్టి ఆ సినిమా చేశాడు.ఇక ఆ సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధించింది. ఇక మొత్తానికి వర్మ కి, నాగార్జున కి మధ్య ఒక గొడవ జరగడం అనేది అప్పట్లో పెను సంచలనాన్ని రేపింది. ఇక వీళ్ళిద్దరూ కలి మళ్లీ గోవింద గోవింద, ఆఫీసర్ లాంటి సినిమాలను కూడా చేశారు..