Balakrishna vs Nagarjuna : ఇండస్ట్రీ లో వివాదాలకు ఆమడ దూరం లో ఉండే హీరోల లిస్ట్ తీస్తే అందులో అక్కినేని నాగార్జున పేరు ముందు వరుస లో ఉంటుంది..అనవసరంగా ఆయన ఎవరినీ ఒక మాట అనడు..ఎవరి చేత అనిపించుకోడు కూడా.. గొడవలకు మరియు కాంట్రవర్సీలకు దూరంగా ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడానికే ఆయన ఎక్కువ మొగ్గు చూపిస్తూ ఉంటాడు..కానీ ఇండస్ట్రీ కి లెజెండరీ స్థానం లో ఉన్న తన తండ్రి గారిని ఒక బాలయ్య లాంటి పెద్ద హీరో నలుగురిలో అవమానించినా కూడా మాట్లాడడా..ఎందుకీ మౌనం.

ఎవరి వల్ల అయితే ఆ కుటుంబం మొత్తం ఇన్నేళ్లు చీకు చింతా లేకుండా భోగభాగ్యాలతో జీవితాన్ని గడుపుతున్నారో..అలాంటి వ్యక్తికి అవమానం చేసినప్పుడు కూడా గొంతెత్తి మాట్లాడకపోతే ఇక ఎందుకు అని అభిమానులు సైతం నాగార్జున పై విరుచుకుపడుతున్నారు..అయితే నాగార్జున మౌనమే బాలయ్య కి పిడుగులాంటి సమాధానం అని మరికొంత మంది అభిమానులు చెప్పుకొస్తున్నారు.
బాలయ్య వ్యాఖ్యలపై పరోక్షంగా నాగార్జున కుమారులైన అక్కినేని నాగ చైతన్య మరియు అక్కినేని అఖిల్ చేత లేఖలు విడుదల చేయించాడు..అది నాగార్జున చెప్పడం వల్లనే వాళ్లిద్దరూ అలా చేశారంటున్నారు అభిమానులు..విచక్షణ లేకుండా బాలయ్య చేసిన ఆ కామెంట్స్ ని తన అనుభవం అంత వయస్సు కూడా లేని వాళ్ళతో చెప్పించి ‘వాళ్లకు ఉన్న సంస్కారం కూడా నీకు లేదు’ అని నాగార్జున చెప్పించినట్టు అయ్యిందని అంటున్నారు.
ఒక విధంగా ఆలోచిస్తే అది కూడా నిజమేనని చెప్పాలి..అయితే ఈరోజు బాలయ్య తానూ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పకపోగా అగ్గి మీద పెట్రోల్ పోసిన విధంగా వివాదం ని మరింత పెంచేలా చేసాడు..ఇప్పటికీ కూడా నాగార్జున మౌనం పాటిస్తే వేరే విధంగా అర్థం చేసుకోవాల్సి వస్తుందని అభిమానులు ఈ సందర్భంగా చెప్తున్నారు..మరి నాగార్జున తన నోటిని ఇప్పటికైనా విప్పుతాడో లేదో చూడాలి.