https://oktelugu.com/

Naa Saami Ranga Review : నా సామి రంగ మూవీ యూఎస్ఏ రివ్యూ

ముఖ్యంగా నాగార్జున, రాజ్ తరుణ్, అల్లరి నరేష్ ల మధ్య నడిచే కామెడీ సీన్స్ అయితే చాలా బాగున్నాయట. అలాగే ఈ సినిమా లో హీరోయిన్రోజు ఆషిక రంగనాథ్ కూడా ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ అయిందట...

Written By:
  • NARESH
  • , Updated On : January 13, 2024 / 03:18 PM IST
    Follow us on

    Naa Saami Ranga Review: సీనియర్ హీరోలలో స్టార్ హీరో అయిన నాగార్జున తన కంటు ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ సంక్రాంతి కి ఆయన నా సామి రంగ అనే సినిమాతో రేపు మన ముందుకు రాబోతున్నాడు. ఇక ఇప్పటికే యూఎస్ఏ లో ఈ సినిమాకి సంబందించిన ప్రీమియర్ షోలను కూడా స్టార్ట్ చేశారు. ఇక అక్కడ ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు ఏం చెప్తున్నారు. నాగార్జున హిట్ కొట్టాడా..? లేదా సంక్రాంతి విన్నర్ అయ్యాడా..? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ
    ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక ఊరిలో నాగార్జున ఆడుతూ పాడుతూ జాలీగా తిరుగుతూ ఏ బాధ్యత లేకుండా ఉంటాడు. అలాంటి నాగార్జునకి కొంతమంది పెద్ద మనుషులతో గొడవ ఏర్పడుతుంది ఇక ఇదే క్రమంలో తన స్నేహితులు అయిన అల్లరి నరేష్, రాజ్ తరుణ్ తో కలిసి నాగార్జున చేసే సందడి మామూలుగా ఉండదు. అయితే నాగార్జున వాళ్ళ బ్యాచ్ చేసిన ఒక పని వల్ల ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులకి నష్టం ఏర్పడుతుంది దానివల్ల వాళ్ళు వీళ్ళ మీద ఎలాగైనా సరే రివెంజ్ తీర్చుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళని చంపేయాలని చూస్తారు ఇక ఇలాంటి క్రమంలో నాగార్జున తన స్నేహితులను కాపాడుకుంటూ ఆ దుర్మార్గులకు ఎలా సమాధానం చెప్పాడనే దాని మీదనే ఈ సినిమా స్టోరీ నడుస్తుందట…

    విశ్లేషణ
    ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే సినిమా డైరెక్టర్ అయిన విజయ్ బిన్ని స్వతహాగా ఒక కొరియోగ్రాఫర్ అయినప్పటికీ నాగార్జున ఆయన మీద నమ్మి ఈ సినిమాని తీసే అవకాశం అయితే ఇచ్చాడు. దాంతో నాగార్జున ఆయన మీద పెట్టుకున్నా నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా కథలో ఎక్కడెక్కడ ఎమోషన్స్ ఎక్కడెక్కడ ఎలివేషన్స్ అయితే కావాలో వాటిని వేస్తూ జాగ్రత్తగా హీరో ని వాడుకుంటూ కామెడీ ని కూడా పండిస్తూ ఈ సినిమాని అధ్యంతం ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాడు. ఈ సినిమాలో నాగార్జునతో చేయించిన యాక్టింగ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయిందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఒక తప్పు ఏంటి అంటే ఈ సినిమాలో ఉన్న కొన్ని సీన్లల్లో లెంత్ మరీ ఎక్కువ అయిపోతుందట, దాన్ని లాగ్ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో కొన్ని సీన్లు అనవసరంగా పెట్టారు ఏమో అనిపిస్తుందట ఇక ముఖ్యంగా నాగార్జున, రాజ్ తరుణ్, అల్లరి నరేష్ ల మధ్య నడిచే కామెడీ సీన్స్ అయితే చాలా బాగున్నాయట. అలాగే ఈ సినిమా లో హీరోయిన్రోజు ఆషిక రంగనాథ్ కూడా ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ అయిందట…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్…
    ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే నాగార్జున ఎప్పటిలాగే చాలా బాగా నటించాడట ఈ సినిమాకి తనే ప్రాణం పోశారని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా నా సామిరంగ అనే ఆ ఊత పదంతో ప్రేక్షకులందరిలో మంచి జోష్ నింపాడట.అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లు ఫ్రెండ్ గా నటిస్తునే అక్కడక్కడ కన్నీళ్లు కూడా పెట్టించారట ఇక హీరోయిన్ కూడా ఈ సినిమాకి చాలా బాగా హెల్ప్ అయిందని తెలుస్తుంది. తన పాత్ర పరిధి మేరకు నటించడమే కాకుండా ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అయిందనే చెప్పాలి… ఇక మిగిలిన ఆర్టిస్టులు కూడా వాళ్ల పరిధి మేరకు ఆ పాత్రలో ఒదిగిపోయి నటించినట్టు గా తెలుస్తుంది. ఇక సినిమా సక్సెస్ కి అందరూ వాళ్ల వంతు ప్రయత్నం అయితే చేశారట…

    టెక్నికల్ విషయాలు…
    ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన ఎం ఎం కీరవాణి సాంగ్స్ కొద్దిపాటిగా ఓకే అనిపించినప్పటికీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా ఇచ్చాడట… కొన్ని సీన్లకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోసిందనీ తెలుస్తుంది. రాజమౌళి సినిమాలో ఇచ్చినట్టు గా మ్యూజిక్ ఇవ్వలేదు గాని ఈ సినిమాకి ఎంత కావాలో అంత వరకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని చాలా అద్భుతంగా ఇచ్చినట్టు గా తెలుస్తుంది…ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ కూడా తన విజువల్స్ తో ఒక మ్యాజిక్ చేసాడని చెప్తున్నారు. ఇక ఎడిటర్ చోటా కె ప్రసాద్ కొన్ని సీన్ లని ఎడ్జ్ లో కట్ చేసినప్పటికీ,కొన్ని సీన్లు మాత్రం మరీ లాగ్ అయ్యాయి. వాటిని కరెక్ట్ గా చూసుకొని ఉంటే బాగుండేది అని
    అంటున్నారు…