Na Potta Na Istam: జర్మనీలో పెద్ద జాబ్ వదిలేశాడు.. కరీంనగర్ లో ‘పొట్ట’తిప్పలతో సక్సెస్ అయ్యాడు

Na Potta Na Istam ‘నా పొట్ట.. నా ఇష్టం’.. ఇది హోటల్‌ పేరు. జర్మనీ నుంచి కరీనంగర్‌కు వచ్చి స్టార్ట్‌ చేసింది ఈ బిజినెస్సే. ఈ పేరు బోర్డుపై చూడగానే లోపలికి వెళ్లి తినాలనిపిస్తుంది. ట్రెండ్‌కు తగ్గట్టుగా వ్యాపారులు కూడా పేర్లను కొత్తగా ఆలోచిస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : January 31, 2024 8:36 am
Follow us on

Na Potta Na Istam: పేరు చదవగానే కొత్తగా.. వింతగా.. వెరైటీగా అనిపిస్తుంది కదూ.. జర్మనీ రిటర్న్‌ అంటున్నారు.. యువకుడు అంటున్నారు.. నా పొట్ట.. నా ఇష్టం అంటున్నారు. ఏంటి కథ అనుకుంటున్నారు. నిజంగా క థే.. ఇంగ్లండ్‌లో చదివి.. జన్మనీలో ఉద్యోగం చేసిన ఓ యువకుడు కరీనంగర్‌కు వచ్చి బిజినెస్‌ స్టార్ట్‌ చేశాడు. ఆ బిజినెస్‌కు అచ్చ తెలుగు.. ఇంక అచ్చమైన తెలంగాణ యాసలో ‘నా పొట్ట.. నా ఇష్టం’ అని పేరు పెట్టాడు. ఇంగ్లండ్‌లో చదివి.. జర్మనీలో ఉద్యోగం చేసి కరీంనగర్‌లో బిజినెస్‌ పెట్టడమే ఓ వెరైటీ అనుకుంటే.. బిజినెస్‌ పేరు మరింత వెరైటీగా కస్టమర్లను ఆకట్టుకునేలా పెట్టి మరింతగా ఆకట్టుకుంటున్నాడు. ఆ యువకుడు ఎవరు.. అతను స్టార్ట్‌ చేసిన బిజినెస్‌ ఏంటో తెలుసుకుందాం.

పేరు చూడగానే తినాలనిపించేలా..
‘నా పొట్ట.. నా ఇష్టం’.. ఇది హోటల్‌ పేరు. జర్మనీ నుంచి కరీనంగర్‌కు వచ్చి స్టార్ట్‌ చేసింది ఈ బిజినెస్సే. ఈ పేరు బోర్డుపై చూడగానే లోపలికి వెళ్లి తినాలనిపిస్తుంది. ట్రెండ్‌కు తగ్గట్టుగా వ్యాపారులు కూడా పేర్లను కొత్తగా ఆలోచిస్తున్నారు. కస్టమర్లను పేర్లతోనే ఆకట్టుకుంటూ బిజినెస్‌ పెంచుకుంటున్నారు. అలాగే ఈ జర్మనీ బాబు కూడా వెరైటీగా నా పొట్ట.. నా ఇష్టం పేరుతో హోటల్‌ ప్రారంభించాడు.

అచ్చ తెలుగు పేరులో కిక్కు..
విదేశీ పేర్లకంటే.. అచ్చమైన తెలుగు భాష.. ఇంకా చెప్పాలంటే అచ్చమైన తెంగాణ యాసలో పేర్లు పెడుతున్నారు వ్యాపారుల. హోటల్‌ అయినా.. షాప్‌ అయినా.. సంప్రదాయ తెలుగు పేర్లను పెడుతున్నారు. వ్యాపారంలో రాణించేందుకు పేర్లలోనూ వెరైటీ చూపుతున్నారు. ఇక జర్మన్‌ రిటర్న్‌ బాబు స్టార్ట్‌ చేసిన బిజినెస్‌ పేరు ‘నా పాట్ట.. నా ఇష్టం’ చూసి కూడా చాలా మంది ఇంట్రెస్ట్‌ చూపుతున్నారు. కడుపు నిండా నవ్వుకుంటున్నారు. ఇక పేరు చూసి లోపలికి వెళ్తున్న కస్టమర్లు అక్కడి వెరైటీలు చూసి తినకుండా ఉండలేకపోతున్నారు.

యజమాని ఎవరంటే..
కరీంనగర్‌ చెందిన అజయ్‌ లండన్‌లో చదువుకున్నాడు. జర్మనీలో ట్రాన్సేట్‌గా ఉద్యోగం కూడా చేశాడు. పరాయి దేశంలో సంతృప్తి లేని అజయ్‌ తిరిగి కరీంనగర్‌ వచ్చేశాడు. ఉన్న ఊరిలో ఏదో ఒక బిజినెస్‌ పెట్టుకోవాలని ఆలోచించాడు. ఇక్కడికి వచ్చాక ‘నా పొట్ట నా ఇష్టం’ పేరుతో హోటల్‌ స్టార్ట్‌ చేశాడు.

వెరైటీ ఐటమ్స్‌..
ఇక నా పొట్ట.. నా ఇష్టం హోటల్‌లో ఫుడ్‌ ఐటమ్స్‌ కూడా పేరులాగే వెరైటీగా ఉన్నాయి. ఇక్కడ స్నాక్స్, ఫాస్ట్‌ ఫుడ్, ఫ్రూట్‌ జ్యూస్, కాక్‌టైల్స్‌ చాలా స్పెషల్‌. ఇక మీల్స్‌ కూడా అందుబాటులో ఉంది. పూర్తిగా ఓన్‌ బ్రాండ్‌తో అజయ్‌ బిజినెస్‌ స్టార్ట్‌ చేశాడు. ట్రేడ్‌ లైసెన్స్‌ కూడా ఉంది. ప్రస్తుతం ఎక్కడా బ్రాంచ్‌లు లేవు. కానీ ఎవరైనా కావాలంటే తనను సంప్రదించవచ్చని అజయ్‌ తెలిపాడు. తమ బిజినెస్‌ పేరు ప్రజల్లోకి త్వరగా వెళ్లడానికే పేరు కూడా డిఫరెంట్‌గా పెట్టామని చెప్పాడు. మొదట్లో టేస్ట్, క్వాలిటీ గురించి ఆలోచించే కస్టమర్లు ఇప్పుడు మౌత్‌ పబ్లిసిటీకి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ‘నా పొట్ట.. నా ఇష్టం’కు క్యూ కడుతున్నారు.