Quid pro quo?: తెలంగాణ నీటిపారదశాఖ స్పెషల్ చీఫ్ , ఐఏఎస్ రజత్ కుమార్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఆయన వ్యవహారం జాతీయ స్థాయిలో దుమారంరేపుతోంది. ‘ది న్యూస్ మినిట్’ అనే వెబ్ సైట్ పరిశోధించి మరీ వేసిన కథనం తెలంగాణ సర్కార్ ను ఇరకాటంలో పడేసింది. ఐఏఎస్ అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది.

డిసెంబర్ 20న రజత్ కుమార్ విలాసవంతమైన ప్యాలెస్ తాజ్ ఫలక్ నుమాలో 70 మంది అతిథులకు విందును ఏర్పాటు చేశారు. ఒక్కో అతిథికి రూ.16520 చొప్పున ఆ హోటల్ వసూలు చేసింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను రజత్ కుమార్ కుమార్తె, ఇతర కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ కార్యక్రమం మొత్తం ఖర్చును ‘బిగ్ వేవ్ ఇన్ ఫ్రా’ ప్రైవేట్ లిమిటెడ్ కట్టిందట.. దాదాపు 23 లక్షల బకాయి మొత్తం బిగ్ వేవ్ కట్టింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా సదురు వెబ్ సైట్ బయటపెట్టింది. ఈ విషయం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది.
ఇంగ్లీష్ వెబ్ సైట్ ‘దిమినిట్’ కథనం ప్రకారం.. రెండు కంపెనీల పేరుతో ఇన్ వాయిస్ లు ఉన్నాయి. అవి ఇంటరాక్టివ్ డేటా సిస్టమ్స్, బిగ్ వేవ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్. ఇవి జూన్ 2021లో ప్రారంభించారు. ఇంటరాక్టివ్ డేటా సిస్టమ్స్ డైరెక్టర్ లు ప్రముఖ కంపెనీలో బోర్డు సభ్యులుగా ఉన్నట్లు తేలింది.
తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్ట్ పొందిన సంస్థనే వీటిని కట్టిందని పెద్ద ఎత్తున దుమారం రేపడంతో.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో విరుచుకుపడ్డారు. ‘ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ కూతురు వివాహానికి ఎవరు స్పాన్సర్ చేశారని’ ప్రశ్నించారు. ఫైవ్ స్టార్ సౌకర్యాలతో అత్యంత ఖరీదైన వివాహానికి దాతలు ఎవరు అని ప్రశ్నించారు. ఇది ‘క్విడ్ ప్రో కో కాదా? ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ సీనియర్ అధికారికి.. నీటి పారుదల శాఖ కాంట్రాక్టర్ కు మధ్య అనుబంధంపై విచారణకు ఆదేశిస్తారా?’ అంటూ నిలదీశారు.
Who sponsored the five-star wedding of Telangana's Special Chief Secretary (Irrigation) Rajat Kumar's daughter?
Was it done as Quid pro quo?
— Revanth Reddy (@revanth_anumula) January 27, 2022
దీనిపై కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ వివాదాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. కేంద్రమంత్రి అమిత్ షా, సీబీఐలకు ట్యాగ్ చేస్తూ ఈ అక్రమ, అనైతిక బంధంపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఈ వివాదం మరింత రాజుకుంది. తెలంగాణ సర్కార్, రజత్ కుమార్ ఇరకాటంలో పడ్డారు. దీనిపై ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.
Classic case of illegal & immoral nexus between bureaucrats in #Telangana & crony capitalists..
Demand @AmitShah @CVCIndia @HMOIndia @DoPTGoI & @CBItweets 2take action against these manipulators@AICCMedia @INCIndia https://t.co/V7lyNyYubt— Prof Dasoju Sravan Kumar (@sravandasoju) January 27, 2022