800 movie Review : 800 మూవీ ఫుల్ రివ్యూ

ఈ వీకెండ్ లో ఒక మంచి స్టోరీ ని చూసి ఒక మంచి అనుభూతిని పొందాలి అంటే ఈ సినిమాని చూడొచ్చు...

Written By: Gopi, Updated On : October 5, 2023 9:12 pm

800 movie review

Follow us on

800 movie Review : సినిమా అనేది ఒక మనిషిని ఎంతగా ప్రభావితం చేస్తుంది అంటే ఒక మనిషి మంచిగా మారడానికైనా, చెడుగా మారిపోవడానికి అయిన సినిమా అనేది వాళ్ళని చాలా బాగా ప్రభావితం చేస్తుంది. ప్రస్తుత కాలంలో చాలా వరకు జనాలు సినిమాలని చూసి ప్రభావితం అవుతున్నారు.రీసెంట్ గా వచ్చిన బలగం సినిమా చూసి చాలా మంది వాళ్ల ఫ్యామిలీ తో కలిశారు.అయితే కొన్ని సినిమాలు చూసి గొప్ప వ్యక్తులు అయిన వాళ్ళు ఉన్నారు. సినిమాని ఒక రాంగ్ వే లో అర్థం చేసుకొని కెరియర్ ని కోల్పోయిన వాళ్లు కూడా ఉన్నారు.

అందుకే ఇప్పుడున్న రోజుల్లో ఒక మంచి సినిమా అనేది జనాలకి ఇవ్వడం చాలా ముఖ్యం…ఇక అలాంటి కోవ కి చెందిన సినిమానే 800…ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.శ్రీలంక టీం యొక్క దిగ్గజ క్రికెటర్ అయిన ముత్తయ్య మురళీధరన్ గారి బయోపిక్ గా రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఆయన తీసిన వికెట్ల అయిన 800 వికెట్లనే ఈ సినిమాకి పేరు గా పెట్టడం జరిగింది…ఈ అయితే ఈ సినిమా ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం…

ముందుగా ఈ సినిమా కథ గురించి డిస్కస్ చేసుకుంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి అయిన మురళీధరన్ ఎలా ఇంటర్నేషనల్ స్థాయిలో క్రికెట్ ఆడి తన బౌలింగ్ తో యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఆయన క్రికెటర్ గా ఎదిగే టైంలో ఆయనకి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి, ఆయన ఎలాంటి వివక్షలను ఎదుర్కొన్నాడు. వాటన్నింటినీ అధిగమించి ఒక సామాన్యుడు అత్యుత్తమమైన స్థాయికి వెళ్లొచ్చా…అలాగే ప్రపంచంలో ఎవరికి సాధ్యం కానీ విధంగా అన్ని వికెట్లని ఎలా తీయగలిగాడు అనే ఉత్కంఠ భరితమైన సీన్లతో నడుస్తుంది.రియల్ గా చెప్పాలంటే ఒక సామాన్య మానవుడు ఎలా అంతటి గొప్ప స్థాయి ని అచ్చివ్ చేయగలిగాడు అనేదే ఈ సినిమా స్టోరీ…

ఇక ఈ సినిమా గురించి ఒకసారి బ్రీఫ్ గా అనాలసిస్ చేయగలిగితే ఈ సినిమాని మొదట జర్నలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఓపెన్ చేయడం జరిగింది. అలా చేయడం బాగుంది ఇంతకు ముందు కొన్ని సినిమాలని కూడా అలానే ఓపెన్ చేశారు.మొదటి రెండు నిమిషాలు ఆనిమేషన్ ఫిగర్స్ తో సినిమాని ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ ఆ తర్వాత నార్మల్ గా ప్రజెంట్ చేయడం జరిగింది.అయితే ఈ సినిమాల్లో మురళీధరన్ ఎపిసోడ్స్ అనే కాకుండా శ్రీలంక లో జరిగిన కొన్ని పరిస్థితుల్ని కూడా చాలా చూపించారు.

అలాగే మురళీధరన్ చిన్నప్పుడు ఆ స్కూల్లో ఎలా జాయిన్ అయ్యాడు. ఆ స్కూల్ నుంచి ఆయన కి క్రికెట్ పైన ఎలా ఇష్టం అనేది ఏర్పడింది అనే విషయాన్ని డైరెక్టర్ చాలా సెన్సిటివ్ గా డీల్ చేస్తూ ఎక్కడ డివియేట్ అవ్వకుండా కథను మాత్రమే నమ్ముకొని అనవసరమైన హంగులకు పోకుండా క్యారెక్టర్ మీద ఉన్న నమ్మకంతో బ్లైండ్ గా ముందుకెళ్లాడు. నిజానికి ఆయన అలా చేయడమే ఈ సినిమా కి చాలా ప్లస్ అయింది. ఫస్ట్ ఆఫ్ లో కొన్ని సీన్లు అయితే డైరెక్టర్ క్రియేట్ చేసిన డ్రామా కి నిజంగా ఆయనకి సెల్యూట్ చేయవచ్చు.ఎందుకంటే ఒక స్పోర్ట్స్ మాన్ గురించి సినిమా అంటే పెద్దగా అద్భుతాలు ఏమీ ఉండవు. ఆయన పడిన ఇబ్బందులని చూపించడం అలాగే ఆయన ఎలా సక్సెస్ అయ్యాడు అనేది చూపించడం ఇవి మాత్రమే ఉంటాయి… కానీ డైరెక్టర్ అలా ప్లాట్ గా కథని చెప్పకుండా గ్రిప్పింగ్ గా సీన్ ని మార్చుకొని సీన్స్ చేయడంలో డైరెక్టర్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఇక ఫస్టాఫ్ విషయానికి వస్తే కొన్ని సీన్లు మాత్రం చాలా అద్బుతం గా ఏలివెట్ అయ్యాయి. అంటే మురళీధరన్ కి మొదట బౌలర్ అవ్వాలని ఆలోచన వచ్చినప్పుడు,అలాగే ఆయన మొదటి వికెట్ తీసినప్పుడు లాంటి కొన్ని సీన్ లను స్క్రీన్ మీద చూపించినప్పుడు చూసే ప్రతి ఆడియన్ కి గూస్ బంస్ రావడం పక్కా…

అలా ఫస్ట్ ఆఫ్ ని చాలా బాగా హ్యాండిల్ చేసిన డైరెక్టర్ సెకండ్ ఆఫ్ ని కూడా చాలా బాగా డీల్ చేశాడు కానీ ఫస్ట్ ఆఫ్ తో పోలిస్తే కొంతవరకు సెకండ్ హాఫ్ తగ్గిందనే చెప్పాలి.సెకెండ్ ఆఫ్ కూడా ఫస్ట్ హాఫ్ రేంజ్ లో ఉంటే ఈ సినిమా ఒక పెద్ద సక్సెస్ అయ్యేది…ఇక మురళీధరన్ లైఫ్ లో ఆయన మంచి బౌలర్ గా ఎదుగుతున్న క్రమంలో ఆయన బౌలింగ్ యాక్షన్ లో ఏదో తేడా ఉంది అనే ఒక వివాదాన్ని ఎదుర్కొన్న తర్వాత బౌలింగ్ యాక్షన్ మీద కొన్ని టెస్టులు అయితే చేయడం జరుగుతుంది. దాంతో ఆయన ఇక ఇంటర్నేషనల్ మ్యాచ్ లు అడలేడు అని కొందరు అనడం దాని నుంచి మళ్ళీ తనని తాను ఎలా ప్రూవ్ చేసుకొని ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడటానికి ఎలా వచ్చాడు అనే ఒక ఎపిసోడ్ కూడా ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ సినిమాని సినిమాల కాకుండా ఒక ప్లేయర్ అనుభవించిన ఇబ్బందులను ఆయన పరిస్థితులను అధిగమించిన విధానాన్ని చూపించారు.రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కాకుండా ఒక ప్లేయర్ పెయిన్ ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా చూడగలిగితే మాత్రం ఈ సినిమా చాలా బాగుంటుంది…

ఇక ఈ సినిమాలో మెయిన్ గా ప్లస్ పాయింట్స్ ఏంటంటే మురళీధరన్ క్యారెక్టర్ చేసిన నటుడు అయిన మధుర్ మిట్టల్ అద్భుతంగా నటించాడు. మురళీధరన్ ఎలా అయితే ప్రతి సిచువేషన్ కి బిహేవ్ చేసేవాడో ఆయన క్యారెక్టరైజేశన్ ని కరెక్ట్ గా పట్టుకుని కొంచెం కూడా అతి లేకుండా ఆ క్యారెక్టర్ లో దూరిపోయి నటించాడు.ఇక ఆయన తర్వాత బాగా నటించిన నటుడు అంటే మురళీధరన్ ఫాదర్ క్యారెక్టర్ లో చేసిన రామ్మూర్తి అనే నటుడు. ఈయన కూడా తన పర్ఫామెన్స్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. ఇక జిబ్రాన్ ఇచ్చిన మ్యూజిక్ బాగున్నప్పటికీ కొన్ని సీన్లను ఎలివేట్ చేయడంలో మాత్రం ఆయన బిజీయం అంత హెల్ప్ కాలేదనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి…

ఇక డైరెక్టర్ ఏం ఎస్ శ్రీపతి మాత్రం ఈ సినిమా ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు ప్రతి సీన్ లో ఆయన కష్టం కనిపిస్తుంది…అలాగే సినిమాటోగ్రాఫర్ అర్డి రాజశేఖర్ చూపించిన విజువల్స్ చాలా బాగున్నాయి. ఎడిటర్ ప్రవీణ్ కే ఎల్ ఎడిటింగ్ బాగానే చేసినప్పటికీ కొన్ని సీన్లు ఇంకా కొంచెం షార్ప్ గా చేసి ఉంటే ఇంకా బాగుండేది…ఈ సినిమా కి చిన్న చిన్న మైనస్ లు తప్ప మేజర్ గా చెప్పుకునే మైనస్ పాయింట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. కాకపోతే అక్కడక్కడ సినిమా కొంచెం స్లో అయింది.క్రికెట్ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు, కానీ క్రికెట్ తో సంబంధంలేని వారు మాత్రం సినిమాని చూస్తే వాళ్లు కొంచెం బోర్ గా ఫీల్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి… ఈ వీకెండ్ లో ఒక మంచి స్టోరీ ని చూసి ఒక మంచి అనుభూతిని పొందాలి అంటే ఈ సినిమాని చూడొచ్చు…

ఇక ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.75