https://oktelugu.com/

Modi vs Maldives : మోదీ మొండోడు.. దేశం కోసం ఎందాకైనా..!

ఇలా చెప్పుకుంటూ పోతే మోదీ అనేక నిర్ణయాల వెనుక దేశప్రయోజనాలు ఇమిడి ఉంటాయి.

Written By:
  • NARESH
  • , Updated On : January 8, 2024 / 08:33 PM IST
    Follow us on

    Modi vs Maldives : నరేంద్రమోదీ.. కరుడుగట్టిన దేశ భక్తుడు. దేశం కోసం ఎంత కఠిన నిర్ణయమైనా తీసుకోవడానికి వెనుకాడరు. ఇందుకు కరోనా సమయంలో చైనా భారత సరిహద్దుల్లో సృష్టించిన అలజడి.. అందుకు మోదీ చైనాను ఆర్థికంగా దెబ్బతీసిన విధానమే నిదర్శనం. భారత దేశం కోసం దేశానికి లాభ, నష్టాల గురించి ఆలోచించకుండా.. అవతల ఉన్నది బలమైన దేశామా, బలహీన దేశమా అని విచక్షణ చేయకుండా కఠినంగా వ్యవహరిస్తారు. ఇప్పుడు మాల్దీవుల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయమే ఇందుకు నిదర్శనం.

    భారత వ్యతిరేక ప్రభుత్వం…
    మాల్దీవుల్లో ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన పార్టీని అక్కడి ప్రజలు గెలిపించారు. చైనా అనుకూల ప్రభుత్వం ఏర్పాటయింది. దీంతో మాల్దీవుల ఆర్థిక మూలమైన టూరిజంను దెబ్బ కొట్టేందుకు భారీ స్కెచ్‌ వేశారు మోదీ. కొత్త సంవత్సరం వేళ ఆయన లక్ష్యద్వీప్‌లో పర్యటించారు. అక్కడ సముద్రం ఒడ్డున కుర్చీలో కూర్చున్నారు. బీచ్‌లో నడిచారు. స్నోర్కెలింగ్‌ చేశారు. ఈమేరకు ఫొటోలను ప్రధాని మోదీ స్వయంగా ఎక్స్‌లో పోస్టు చేశారు. లక్ష్యద్వీప్‌ పర్యాటకంగా ఎంతో అఆకట్టుకుంటుందని స్నోర్కెలింగ్‌ చేసేవారు లక్ష్యద్వీప్‌ వెళ్లాలని సూచించారు. అక్కడి ప్రకృతిని, ఆహ్లాదకరమైన వాతావరనాన్ని మోదీ వివరించారు. దీంతో మాల్దీవులపై మోదీ ప్రభావం పడింది. ఇప్పటికే బుక్‌ చేసుకున్న అనేక మంది రద్దు చేసుకున్నారు. లక్ష్యద్వీప్‌ గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు.

    ప్రముఖుల మద్దతు..
    బాలీవుడ్‌ ప్రముఖులు కూడా లక్ష్యద్వీప్‌ పర్యాటకానికి మద్దతుగా నిలుస్తున్నారు. సల్మాన్‌ఖాన్, అమితాబచ్చన్‌తోపాటు అనేక మంది మాల్దీవులకన్నా.. మన లక్ష్యద్వీప్‌ చాలా అందంగా ఉంటుందని, ఆహ్లాదకరంగా ఉంటుందని వెల్లడించారు. ఈమేరకు ఎక్స్‌లో పోస్టులు చేస్తున్నారు. దీంతో మాల్దీవులకు వెళ్లే భారతీయ వ్యాపారులు, పర్యాటకులు మనసు మార్చుకుంటున్నారు. మాల్దీవుల్లో ఇప్పటికే బుక్‌ చేసుకున్న హోటళ్లు రద్దు చేసుకుంటున్నారు. దీంతో అక్కడి మంత్రులు మోదీ పర్యటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు మంత్రులు ప్రధాని మోదీపై ఎక్స్‌లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కారణం తమ ఆదాయం తగ్గడమే.

    పరిస్థితి చక్కదిద్దే పనిలో మాల్దీవుల ప్రభుత్వం..
    భారత ప్రధాని నరేంద్రమోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా దుమారం రేపాయి. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. మోదీపై ఆరోపణలు, విమర్శలు చేసిన ముగ్గురు మంత్రులను సస్పెండ్‌ చేసింది. భారత్‌తో వైరం మంచిది కాదని గుర్తించిన సర్కార్‌ పరిస్థితిని చక్కదిద్ది.. భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించే ప్రయత్నాలు మొదలు పెట్టింది.

    మోదీ అనుకుంటే అంతే..
    మోదీ ఏదైనా అనుకుంటే దానిని చేసి తీరుతారు. ఆయన తీసుకునే నిర్ణయాల వెనుక దేశ భద్రత, రక్షణ, ఆర్థిక వృద్ధి, శత్రుదేశాల నాశనం ఉంటాయి. ఇందుకు కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటే.. పెద్దనోట్ల రద్దు ఒకటి. పుల్వామా దాడి తర్వాత మోదీ.. పాకిస్తాన్‌ను అడుక్కుతినేలా చేస్తానని శపథం చేశారు. అన్నట్లుగానే ఆయన దేశంలోని పెద్దనోట్లు రద్దు చేశారు. దీంతో పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. దొంగనోట్ల చలామణి తగ్గింది. చివరకు పాక్‌ ఆర్థిక పరిస్థితి కుదేలైంది. ప్రపంచంలో ఎవరైనా సాయం చేస్తేగానీ మనుగడ సాధించలేని స్థితికి చేరింది. ఇక చైనా గాల్వాన్‌లో భారత సైన్యంపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన మోదీ చైనా ఆర్థిక మూలాలను దెబ్బకొడుతూనే ఉన్నారు. అనేక చైనా యాప్స్‌ను రద్దు చేశారు. చైనా దిగుమతులపై నిషేధం విధించారు. వినాయక చవితి, దీపావళికి వచ్చే పూజాసామగ్రి, టపాసులు బ్యాన్‌ చేశారు. ఇక రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలో చాకచక్యంగా వ్యవహరించి మన రూపాయల్లోనే రష్యా నుంచి ఇంధనం కొనుగోలు ప్రారంభించారు. ఇలా చెప్పుకుంటూ పోతే మోదీ అనేక నిర్ణయాల వెనుక దేశప్రయోజనాలు ఇమిడి ఉంటాయి.