Revanth Reddy – Narendra Modi : మోడీ నా బడే భాయ్.. రాష్ట్రం కోసం రేవంత్ రెడ్డి తిప్పలివీ

ప్రధాని నరేంద్ర మోడీ వేదిక మీద ఆసీనులైన తర్వాత రేవంత్ రెడ్డి స్వాగత ఉపన్యాసం చేశారు. "ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాకు బడే భాయ్. ఆయన ఆశీస్సులు తెలంగాణ రాష్ట్రంపై ఉండాలి. దేశంలో ప్రధాన మెట్రోపాలిటన్ సిటీలల్లో హైదరాబాద్ ఒకటి. ఆ ప్రాంతాల్లో లాగా మెట్రో అభివృద్ధికి కేంద్రం చేయూత కావాలి. కేంద్రం చేయూత ఉంటేనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉంటుంది.

Written By: NARESH, Updated On : March 4, 2024 2:03 pm
Follow us on

Revanth Reddy – Narendra Modi : పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రధానమంత్రి కి స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ వంటి వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని ఆకాశానికి ఎత్తేశారు. గత ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవహార శైలి కంటే భిన్నంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించారు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముందుండి స్వాగతం పలికి.. వేదిక వద్దకు తోడ్కోని వెళ్లారు.

ప్రధాని నరేంద్ర మోడీ వేదిక మీద ఆసీనులైన తర్వాత రేవంత్ రెడ్డి స్వాగత ఉపన్యాసం చేశారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాకు బడే భాయ్. ఆయన ఆశీస్సులు తెలంగాణ రాష్ట్రంపై ఉండాలి. దేశంలో ప్రధాన మెట్రోపాలిటన్ సిటీలల్లో హైదరాబాద్ ఒకటి. ఆ ప్రాంతాల్లో లాగా మెట్రో అభివృద్ధికి కేంద్రం చేయూత కావాలి. కేంద్రం చేయూత ఉంటేనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉంటుంది. గత ప్రభుత్వం మాదిరి మేము కేంద్రంతో తగాదా పెట్టుకోవాలని అనుకోవడం లేదు. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం అని రంగాల్లో ముందంజలో నడుస్తోంది. 5 ట్రిలియన్ డాలర్ల ఎకనామిగా ఎదిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ రాష్ట్రం అన్ని రంగాలలో ముందంజలో ఉంది” అని రేవంత్ రెడ్డి అన్నారు. దీంతో ఒక్కసారిగా వేదిక మీద ఉన్న కిషన్ రెడ్డి షాక్ కు గురయ్యారు. రేవంత్ మాట్లాడుతుంటే గవర్నర్ కూడా సంతోషంగా కనిపించారు..

“నరేంద్ర మోడీ దేశాన్ని ప్రపంచ వేదిక ముందు శక్తివంతమైన స్థానంలో నిలబెట్టారు. దానివల్ల మన దేశ కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగాయి. అలాంటి నరేంద్ర మోడీ ఆశీస్సులు తెలంగాణపై ఉండాలి. అలా ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా గుజరాత్ లాగా అభివృద్ధి చేస్తామని” రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ మాట్లాడుతున్నంత సేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఉల్లాసంగా కనిపించారు. ఆయన మాట్లాడుతున్న తీరును తదేకంగా పరిశీలించారు. త్వరలో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో.. రేవంత్ మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు మోడీ తీరును విమర్శిస్తుంటే.. రేవంత్ పొగుడుతూ మాట్లాడటం విశేషం.