
MLC Kalvakuntla Kavitha: పెయిడ్ ఆర్టికల్స్, పెయిడ్ ఇంటర్వ్యూలు సాధారణంగా ప్రింట్ మీడియాలో కనిపిస్తుంటాయి. తెలంగాణ వచ్చాక మీడియా దాదాపు అధికార పార్టీ చేతుల్లోకి వెళ్లిపోయింది. బీఆర్‌ఎస్ సొంత పత్రిక నమస్తే తెలంగాణను మించి నమస్తే సాక్షి, నమస్తే ఈనాడు, నమస్తే ఆంధ్రప్రభ, అన్నట్లు పత్రికలు, టీ న్యూస్ చానెల్‌కు తాము ఏమాత్రం తక్కువ కాదన్నట్లు టీవీ9, 10 టీవీ, సాక్షి టీవీ, ఎన్‌టీవీ చానెళ్లు అధికార పార్టీపై పాజిటివ్ కథనాలతో తరిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు తెలుగు మీడియా లిక్కర్ స్కాంలో పీకల్లోతు వరకు కూరుకుపోయిన కవితను జాకీలు పెట్టి లేపే ప్రయత్నాలు చేస్తున్నాయి. అరెస్ట్‌కు రంగం సిద్ధమవుతున్న వేళ కవిత మొదలు పెట్టిన గేమ్ ప్లాన్‌ను అమలు చేయడంలో తమవంతు పాత్ర పోషిస్తున్నాయి.
సడెన్‌గా కవితకు మహిళలు గుర్తొచ్చారు..
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ కల్వకుంట్ల కవితకు సడెన్‌గా మహిళలు గుర్తొచ్చారు. చట్ట సభల్లో మహిళల రిజర్వేషన్ గుర్తొచ్చింది. లిక్కర్ స్కాంలో కూరుకుపోతున్న వేళ మహిళలు గుర్తుకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాను ఎంపీగా ఐదేళ్లు పనిచేసిన సమయంలోగానీ, తెలంగాణలో 9 ఏళ్లు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఎన్నడూ మహిళా రిజర్వేషన్ అంశంపై మాట్లాడలేదు. నాలుగున్నరేళ్లు తెలంగాణలో మహిళా మంత్రి లేకుండానే పాలన సాగింది. అయినా కవిత తన తండ్రి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏనాడూ ప్రశ్నించలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ అవుతుందన్న ప్రచారం జరుగుతున్న వేళ ఇప్పుడు సడెన్‌గా మహిళలు గుర్తొచ్చారు.
భజన మీడియాలో విస్తృత ప్రచారం..
కవిత కార్యక్రమం తలపెట్టిందే ఆలస్యం అన్నట్లు అధికార పార్టీకి భజన మీడియా దానికి విస్తృత ప్రచారం కల్పించే బాధ్యతను తలకెత్తుకున్నాయి. ఇక ఎన్నడూ మీడియాకు ఇంటరూ‍్వ్యలు ఇవ్వని కవిత, తాజాగా మహిళా రిజర్వేషన్ పోరాటంపై టీవీ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక్క రోజే ఎన్‌టీవీ, టీవీ9 చానెళ్లలో తన ఇంటర్వ్యూ ప్రచారం అయ్యేలా చూసుకున్నారు కవిత. ఈనెల 10న ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద తలపెట్టిన నిరసన కార్యక్రమంతోపాటు, ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన పాత్ర ఏమీ లేదనిపించేలా యాంకర్లతో ప్రశ్నలు వేయించుకుని సమాధానాలు చెపా‍్పరు.
కేసీఆరే నచ్చిన లీడర్ అంట..
ఇక, తనకు అన్నీ కేసీఆరే అన్నట్లు కవిత ఈ ఇంటర్వ్యూలో కలరింగ్ ఇచ్చారు. ప్రస్తుత రాజకీయాల్లో తనకు నచ్చిన నేత కేసీఆర్ మాత్రమే అని ప్రకటించారు. తన అన్న కేటీఆర్, మంత్రి హరీశ్‌రావు గురించి యాంకర్‌తో అడిగించుకుని వారు కూడా గొప్పవారే అనిపించుకున్నారు. ఇక ఇద్దరిలో ఎవరికి ఎక్కువ మంచివారంటే మాత్రం సమాధానం దాటవేశారు.
సీఎం కేసీఆరే అంట..
ఇక జాతీయ రాజకీయాలు, ప్రధాన మంత్రి పీఠంపై కేసీఆర్ దృష్టిపెడితే ఆయన కూతురు కవిత మాత్రం తెలంగాణకు మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని కుండ బద్ధలు కొట్టారు. కేటీఆర్ నెక్ట్్స సీఎం అని జరుగుతున్న ప్రచారాన్ని ఆమె కొట్టిపారేశారు. కేటీఆర్ పేరే ఎందుకు వస్తుంది, కవిత పేరు ఎందుకు రావడం లేదన్న ప్రశ్నకు సమాధానం దాటవేశారు. కేసీఆర్ ఏది చేయమంటే అది చేస్తా అని తాను తండ్రిచాటు బిడ్డను అని చెప్పుకునే ప్రయత్నం చేశారు.

మొత్తంగా తన కార్యక్రమానికి ప్రచారం చేయించుకుందుకు ఆమె ఇచ్చిన ఇంటర్వూయలో అనేక ప్రశ్నలకు కొత్త సందేహాలు లేవనెత్తేలా ఉన్నాయి. తండ్రిచాటు బిడ్డను అని చెప్పిన కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో కూడా తన తండ్రికి తెలిసే చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.