https://oktelugu.com/

MISS WORLD 2024 : ప్చ్.. మన సినీ శెట్టి ఆశలు గల్లంతు.. టాప్ -4 లో దక్కని చోటు

ఈ పోటీలకు కరణ్ జోహార్, మెగాన్ యంగ్ ఈ మిస్ వరల్డ్ పోటీలకు యాంకర్లు గా వ్యవహరించారు. బాలీవుడ్ నుంచి కృతి సనన్, సౌత్ నుంచి పూజా హెగ్డే జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.. ఈ పోటీల సందర్భంగా ప్రసిద్ధ గాయకులు షాన్, నేహా కక్కర్, టోనీ కక్కర్ తమ పాటలతో ఆహూతులను అలరించారు.

Written By:
  • NARESH
  • , Updated On : March 9, 2024 / 11:43 PM IST
    Follow us on

    MISS WORLD 2024 : టాప్ -40 లో ఇరగదీసింది. టాప్ -12 లో సత్తా చాటింది. టాప్ -8 లో ప్రతిభ చూపింది. ఇంకేముంది టాప్ -4 లో నెగ్గితే చాలు.. కిరీటం మనదే.. మిస్ వరల్డ్ పురస్కారం మన అమ్మాయి దే.. ఇలానే అందరూ అనుకున్నారు. కానీ జరిగింది వేరు. ఫలితంగా సినీ శెట్టి ఆశలు గల్లంతయ్యాయి. ఇన్నాళ్లు ఆమె పడ్డ శ్రమ వృధా అయ్యింది. దీంతో ఆమె కన్నీరు పెట్టుకుంది. ఉద్వేగానికి గురైంది. కానీ ఏం చేస్తాం.. మనదేశంలో పోటీలు నిర్వహిస్తున్నంత మాత్రాన.. మన అమ్మాయికి కిరీటం రావాలని లేదు కదా. సినీ శెట్టి చాలా కష్టపడింది. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ప్రతి పోటీలోనూ తన బెస్ట్ ఇచ్చింది. టాప్ -4 లో తను చెప్పిన సమాధానాలు న్యాయ నిర్ణేతలను మెప్పించలేకపోయాయి. ఫలితంగా ఆమె వెనుతిరగాల్సి వచ్చింది.

    2017లో చైనా వేదికగా జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో భారతదేశానికి చెందిన మానుషి చిల్లర్ కిరీటం దక్కించుకుంది. ఇక అప్పటినుంచి ఇప్పటిదాకా భారత్ మిస్ వరల్డ్ కిరీటాన్ని పొందలేకపోయింది. అయితే ఈసారి మిస్ వరల్డ్ 71 వ ఎడిషన్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో కిరీటం కచ్చితంగా వస్తుందని చాలామంది భావించారు. ఈ పోటీల్లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన సినీ శెట్టి మన దేశానికి ప్రాతినిధ్యం వహించింది మిస్ వరల్డ్ అంటే అందం మాత్రమే కాకుండా బ్యూటీ విత్ బ్రెయిన్ పోటీలు కాబట్టి.. ఆ పోటీల్లో సినీ శెట్టి జడ్జిల మెప్పు పొందింది. ఫైనల్ పోటీలకు అర్హత సాధించింది. శనివారం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన ఫైనల్స్ లో టాప్ -8 వరకు వచ్చిన సినీ శెట్టి.. ఆ తర్వాత జరిగిన పోటీల్లో న్యాయ నిర్ణేతలను మెప్పించలేకపోయింది. ఫలితంగా టాప్ -4 లో స్థానం సంపాదించలేకపోయింది. దీంతో ఆమె మిస్ వరల్డ్ ఆశలు గల్లంతయ్యాయి.

    టాప్ -4 లో ఉన్నది వీరే

    1. అచ్చే అబ్రహమ్స్ (ట్రిని డాడ్ అండ్ టొబాగో)
    2. లేసేగో చొంబో( బోట్స్ వానా)
    3. క్రిస్టినా(చెక్ రిపబ్లిక్)
    4. యాస్మినా జే టౌన్(లెబనాన్)
    వీరు మాత్రమే టాప్ -4 లో నిలిచారు. తదుపరి పోటీల అనంతరం వీరిలో ఒకరిని విజేతగా ప్రకటిస్తారు. విజేతగా నిలిచిన యువతి మిస్ వరల్డ్ కిరీటం ధరిస్తుంది. టాప్ -8 లో స్థానం సంపాదించిన సినీ శెట్టి.. టాప్ -4 లో అడుగుపెట్టిన తర్వాత అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పినప్పటికీ న్యాయ నిర్ణేతలు సంతృప్తి చెందనట్లు తెలుస్తోంది..

    ఈ పోటీలకు కరణ్ జోహార్, మెగాన్ యంగ్ ఈ మిస్ వరల్డ్ పోటీలకు యాంకర్లు గా వ్యవహరించారు. బాలీవుడ్ నుంచి కృతి సనన్, సౌత్ నుంచి పూజా హెగ్డే జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.. ఈ పోటీల సందర్భంగా ప్రసిద్ధ గాయకులు షాన్, నేహా కక్కర్, టోనీ కక్కర్ తమ పాటలతో ఆహూతులను అలరించారు. కాగా, ఆదరణ పొందిన కంటెస్టెంట్ల జాబితాలో బంగ్లాదేశ్ కు చెందిన శమ్మీ నీలా, వెనిజులా కు చెందిన అరియాగ్ని డాబోయిన్, ట్యునిషియాకు చెందిన ఐమెన్ మెర్జి, మడగాస్కర్ కు చెందిన అంటాస్లీ, మెక్సికోకు చెందిన అలే జాండ్రా డీ లియోజ్ నిలిచారు. అందాల పోటీల్లో పాల్గొనడంతో పాటు సామాజిక సేవలోనూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్న కొంతమంది యువతులకు బ్యూటీ విత్ పర్పస్ పురస్కారాలను అందజేశారు.