Minister KTR: సంచలన లీక్ : తెలంగాణలో ఈ డిసెంబర్ లో ఎన్నికలు జరగవా?

వచ్చే ఎన్నికల్లో 90 స్థానాలకు పైగా బీఆర్ఎస్ గెలుస్తుందని కేటీఆర్‌ ధీమా వ్యక‍్తం చేశారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత రాష్ట్రంలో పార్టీకి మరింత సానుకూల వాతావరణం ఏర్పడిందని చెప్పుకొచ్చారు.

Written By: Raj Shekar, Updated On : September 12, 2023 6:20 pm

KTR

Follow us on

Minister KTR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఓ వైపు ఎని‍్నకల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు పార్టీలు అభ్యర్థుల ప్రకటనపై దృష్టిపెట్టాయి. తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్లు బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇక కాంగ్రెస్‌, బీజేపీలు టికెట్ల కేటాయింపునకు దరఖాస్తులు స్వీకరించాయి. స్కృటినీ చేసి అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇక నోటిఫికేషన్ రావడమే ఆలస్యమని ప్రతిపక్షాలు, రాష్ట్ర ప్రజలు అనుకుంటున్న సమయంలో కేటీఆర్ బాంబ్ పేల్చారు.

మీడియా సమావేశం పెట్టి మరీ..
మంగళవారం మీడియా మీట్ నిర్వహించిన మంత్రి కేటీఆర్‌.. ఎన్నికల ప్రస్తావన తెచ్చారు. అక్టోబర్-10లోపు నోటిఫికేషన్ వస్తేనే.. సమయంలోపు (డిసెంబర్ నెలలో) ఎన్నికలు జరుగుతాయన్నారు. సమయంలోగా నోటిఫికేషన్ వచ్చేది అనుమానమేనన్నారు. అంతేకాదు.. ఎన్నికలు ఎప్పుడు జరగొచ్చేదానిపై కూడా మంత్రి మాట్లాడారు. తెలంగాణ ఎన్నికలు కూడా ఏప్రిల్ లేదా మే నెలలో జరగొచ్చని జోస్యం చెప్పారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తెలంగాణలో జరిగే ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాశముందని చెప్పుకొచ్చారు. మరి కేటీఆర్‌కు ఈ విషయాలన్నీ ఎలా తెలుసో.. ఎక్కడ్నించి సమాచారం వచ్చిందో మాత్రం తెలియదు.

పార్టీలు, గెలుపు స్థానాలపై..
వచ్చే ఎన్నికల్లో 90 స్థానాలకు పైగా బీఆర్ఎస్ గెలుస్తుందని కేటీఆర్‌ ధీమా వ్యక‍్తం చేశారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత రాష్ట్రంలో పార్టీకి మరింత సానుకూల వాతావరణం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలిపారు. ఈ విషయంలో ప్రజలు క్లారిటీగా ఉన్నారని, ప్రతిపక్షాలే అయోమయంలో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాల తాపత్రయం రెండవ స్థానం కోసమే అని తెలిపారు. సిట్టింగులకు సీట్లు ఇవ్వకుంటే మా దగ్గరికి వస్తారని ప్రతిపక్షాలు భావించాయని, తాను నిర్మించిన నాయకత్వం, పార్టీ నాయకులపైన తనకున్న నమ్మకం మేరకే కేసీఆర్ సిట్టింగ్ స్థానాలకు సీట్లు ఇచ్చారి వెల్లడించారు.

అవి ఢిల్లీ బానిస పార్టీలు..
జాతీయ పార్టీలను ఢిల్లీ బానిస పార్టీలుగా కేటీఆర్‌ అభివర్నించారు. ఆత్మగౌరవం అధికంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఈ బానిసత్వ పార్టీలను అంగీకరించరని తెలిపారు. ఢిల్లీ బానిసలు కావాలా..? తెలంగాణ బిడ్డ కావాలా..? అనేది తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలని సూచించారు. కేవీపీ రామచంద్రరావు, షర్మిల, తెలంగాణ వాదులమని చెప్పుకుంటున్నారన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన కేవీపీ, షర్మిల కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తాం అంటున్నారన్నారు.