Homeఎంటర్టైన్మెంట్Megastar Chiranjeevi : ఫ్యాన్స్ కోసం, కళాకారుల కోసం చిరంజీవి గొప్ప నిర్ణయం

Megastar Chiranjeevi : ఫ్యాన్స్ కోసం, కళాకారుల కోసం చిరంజీవి గొప్ప నిర్ణయం

Megastar Chiranjeevi  : తన అభిమాన ఫ్యాన్స్ కోసం.. కళాకారుల కోసం చిరంజీవి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. వారికి క్యాన్సర్ చికిత్సలు, టెస్టులు చేయడానికి ముందుకొచ్చాడు. చిరంజీవిగా నేను, క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ తరుఫున మీరు ముందుకొచ్చి సాయం చేయాలని కోరారు. ఎన్ని కోట్లు అయినా భరిస్తానని.. మీ వంతు సాయం చేసి ఈ క్యాన్సర్ మహమ్మారిని నివారిద్దామని చిరంజీవి స్టార్ హాస్పిటల్స్ ఎండీకి విన్నించారు. దీనికి స్టార్ ఆస్పత్రి యజమాని కూడా సరేననడంతో ఈ గొప్ప ప్రక్రియకు నాంది పలికింది.

జీనోమిక్స్ టెస్ట్ ద్వారా క్యాన్సర్ ను ముందుగానే గుర్తించవచ్చని చిరంజీవి తెలిపారు. అభిమానులకు, సినీ కార్మికులకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయిస్తానని.. వారి కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తానన్నాడు. హైదరాబాద్ క్యాన్సర్ నియంత్రణకు హబ్ కావాలని ఆకాంక్షించాడు.

హైదరాబాద్ లో కాకుండా జిల్లాల్లోనూ క్యాన్సర్ స్కీనింగ్ చేయాలని ఆస్పత్రులను కోరాడు. క్యాన్సర్ పై అవగాహన కోసం తన వంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చాడు.

మెగాస్టార్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కి గురై సోషల్ మీడియా లో మా చిరంజీవి కి ఇంత జరిగిందా అంటూ భయాందోళనతో కామెంట్స్ చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ‘గతంలో నేను క్యాన్సర్‌ బారిన పడ్డాను.ముందుగా గుర్తించి చికిత్స తీసుకుని బయటపడ్డాను. క్యాన్సర్‌ వచ్చిందని చెప్పడానికి భయపడలేదు. ముందుగా గుర్తిస్తే క్యాన్సర్‌ పెద్ద జబ్బు కాదు’ అంటూ మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ వ్యాఖ్యలు వక్రీకరించారని చిరంజీవి ఒక ప్రకటనలో తెలిపారు. ‘కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో non – cancerous polyps ని డిటెక్ట్ చేసి తీసేశారు అని చెప్పాను. ‘అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో’ అని మాత్రమే అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు / స్క్రీనింగ్ చేయించుకోవాలి’ అని మాత్రమే అన్నాను.

అయితే కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యం తో ‘నేను క్యాన్సర్ బారిన పడ్డాను’ అని ‘చికిత్స వల్ల బతికాను’ అని స్క్రోలింగ్ లు, వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టాయి. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూషన్ ఏర్పడింది. అనేకమంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్ లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ క్లారిఫికేషన్. అలాగే అలాంటి జర్నలిస్టులకి ఓ విజ్ఞప్తి. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయకండి. దీనివల్ల అనేక మందిని భయభ్రాంతుల్ని చేసి బాధ పెట్టిన వారవుతారు’’ అని చిరంజీవి తనకు క్యాన్సర్ రాలేదన్న వాస్తవాన్ని బయటపెట్టారు.

LIVE : చిరంజీవి సంచలన వ్యాఖ్యలు | Megastar Chiranjeevi Shocking Comments | Tollywood News | TV5 News

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version