https://oktelugu.com/

Bhola Shankar Trailer: భోళాశంకర్ లో జగన్ ని టార్గెట్ చేస్తూ చిరు డైలాగ్… పవన్ కోసమేనా?

భోళా శంకర్ ట్రైలర్ చూశాక చిరంజీవి మార్క్ ఊరమాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అనిపిస్తుంది. అయితే చెల్లి సెంటిమెంట్ తో ప్రధానంగా సాగనుంది. చిరంజీవి ప్రెజెన్స్, డైలాగ్స్, మేనరిజం ట్రైలర్ కి హైలెట్. ఉన్నత నిర్మాణ విలువలతో భారీగా తెరకెక్కించారు. మెహర్ రమేష్ స్టైలిష్ మేకింగ్ కి పెట్టింది పేరు, ట్రైలర్ తో తన మార్క్ కనిపించింది. యాక్షన్ పాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువే ఉన్నాయి. వన్ లైనర్స్ అదిరాయి.

Written By:
  • Shiva
  • , Updated On : July 27, 2023 / 04:45 PM IST

    Bhola Shankar Trailer

    Follow us on

    Bhola Shankar Trailer: దర్శకుడు మెహర్ రమేష్ చాలా గ్యాప్ తర్వాత మెగా ఫోన్ పట్టాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన భోళా శంకర్ విడుదలకు సిద్ధమైంది. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 11న థియేటర్స్ లో దిగనుంది. ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ విడుదల చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భోళా శంకర్ ట్రైలర్ తన చేతుల మీదుగా రిలీజ్ చేయడం విశేషం.

    భోళా శంకర్ ట్రైలర్ చూశాక చిరంజీవి మార్క్ ఊరమాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అనిపిస్తుంది. అయితే చెల్లి సెంటిమెంట్ తో ప్రధానంగా సాగనుంది. చిరంజీవి ప్రెజెన్స్, డైలాగ్స్, మేనరిజం ట్రైలర్ కి హైలెట్. ఉన్నత నిర్మాణ విలువలతో భారీగా తెరకెక్కించారు. మెహర్ రమేష్ స్టైలిష్ మేకింగ్ కి పెట్టింది పేరు, ట్రైలర్ తో తన మార్క్ కనిపించింది. యాక్షన్ పాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువే ఉన్నాయి. వన్ లైనర్స్ అదిరాయి.

    ఇక క్యాస్టింగ్ కూడా భారీగా ఉంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలు పాత్ర చేశారు. ఆమె పాత్ర కథలో చాలా కీలకం. చెల్లి సెంటిమెంట్ పతాక సన్నివేశాల్లో హైలెట్ అయ్యే సూచనలు కలవు. అలాగే చిరంజీవి పాత్రలో సర్ప్రైజింగ్ ట్విస్ట్ ఉండే అవకాశం ఉంది. ఆయన అండర్ కవర్ పోలీస్ కూడా కావచ్చు. వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, శ్రీముఖి, రష్మీ గౌతమ్ సైతం మూవీలో భాగమయ్యారు.

    చిరంజీవి పవన్ కళ్యాణ్ మేనరిజం అనుకరించడం కొసమెరుపు. ఇక భోళాశంకర్ సినిమాలో జగన్ ను టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ స్టైల్లో చిరంజీవి చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ఇది జగన్ ను ఉద్దేశించి చేసిందేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.  ఇక అక్కినేని హీరో సుశాంత్ మరో కీలక రోల్ చేశారు. ఆయన కీర్తి సురేష్ ప్రేమికుడి రోల్ చేస్తున్నారు. రెండు నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్ యాక్షన్, ఎమోషన్, కామెడీ వంటి అంశాలు కలిగి ఉంది. మహతి స్వర సాగర్ సంగీతం ఆకట్టుకుంది. చిరంజీవి ఫ్యాన్ కి కావలసిన అంశాలన్నీ పుష్కలంగా ఉన్నాయి.

    ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. భోళా శంకర్ తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్. కాగా చిరంజీవి వాల్తేరు వీరయ్య హిట్ తో మంచి జోరు మీదున్నారు. భోళా శంకర్ తో సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నెక్స్ట్ ఆయన సోగ్గాడే చిన్నినాయనా ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మూవీ చేస్తున్నట్లు సమాచారం.