Mega Family Bathukamma : ఆపదలో ఎవరు ఉన్నా సరే.. తనవంతుగా ముందుకొచ్చి మరీ సాయం చేస్తుంటాడు మెగా స్టార్. నిజంగానే ఆయనది పెద్ద మనసు అని నిరూపించుకున్నారు. రక్తదానం నుంచి మొదలుపెడితే.. సినీ కార్మికుల కష్టాలు.. నటులు అనారోగ్యం పాలైతే వారి బాగోగులు.. ఆస్పత్రి ఖర్చులు అన్ని భరించేస్తుంటాడు మన చిరంజీవి. ఇటీవలే మొగల్తూరు చెందిన తన చిన్ననాటి మిత్రుడికి ఆరోగ్యం బాగా లేకపోతే తెలుసుకొని మరీ హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో సొంత ఖర్చుతో ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నాడు.
తాజాగా మరోసారి మెగాస్టార్ ఫ్యామిలీ తన గొప్ప మనసు చాటిచెప్పింది. దసరా , బతుకమ్మ సంబరాలను అనాథ బాలికలతో కలిసి జరుపుకొని వారి కళ్లల్లో ఆనందాన్ని చూసింది. ఈ సందర్భంగా అనాథ పిల్లలతో కలిసి అందరూ బతుకమ్మ ఆడారు.
ఈ వేడుకల్లో రాంచరణ్, ఉపాసన, వీరి కూతురు క్లింకార ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి-సురేఖ దంపతులు, సాయిధరమ్ తేజ్, శ్రీజ, చిరంజీవి మనవరాళ్లు అందరూ బతుకమ్మ వేడుకలో పాల్గొన్నారు.
ఇక అక్కడికి వచ్చిన మహిళలందరికీ చిరంజీవి తల్లి అంజనాదేవి చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మెగా కోడలు ఉపాసన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది.
ఉపాసన అమ్మమ్మ పుష్ప కామినేని మూడు దశాబ్ధాలుగా గత మూడేళ్లుగా ‘సేవా సమాజ్’ పేరిట సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అమ్మమ్మ పేరిట తాజాగా బతుకమ్మ సంబరాల్లో పేద, అనాథ బలికలకు బట్టలు, విందు ఏర్పాటు చేసి వేడుకలను మెగా ఫ్యామిలీ ఘనంగా జరుపుకుంది.