https://oktelugu.com/

CM Revanth Reddy: మేడిగడ్డ డ్యామేజి..కాళేశ్వరం పై రేవంత్ కీలక నిర్ణయం..

కాళేశ్వరం మూడవ టీఎంసీ కి 32,165 కోట్లు అదనంగా ఖర్చవుతుందని గత ప్రభుత్వం అంచనా వేసింది. 16, 669 కోట్లు రుణాల ద్వారా స్వీకరించింది. ప్రభుత్వం నుంచి 2,817 కోట్లను మాత్రమే ఖర్చు చేసింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : February 15, 2024 / 01:08 PM IST
    Follow us on

    CM Revanth Reddy: మేడిగడ్డ బ్యారేజీ కి సంబంధించిన పిల్లర్లు కుంగిపోయిన నేపథ్యంలో.. ఇటీవల ఎమ్మెల్యేలతో ఆ ప్రాంతాన్ని పరిశీలించిన క్రమంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు వల్ల ప్రభుత్వంపై పెరిగిన ఆర్థిక భారం.. నిర్దేశించుకున్న లక్ష్యంలో వస్తున్న ఫలితాలు అంతంతమాత్రంగా ఉండడంతో.. నీటిపారుదల శాఖ అధికారులు ముఖ్యమంత్రికి ఒక నివేదిక సమర్పించారు. ప్రాజెక్టుకు మొత్తం 93,872 కోట్లు ఖర్చు అయ్యాయి. ఇందులో 61,665 కోట్లు కార్పొరేషన్ పేరుతో ప్రభుత్వం అప్పులు తీసుకుంది. మరో 32, 207 కోట్లను ప్రభుత్వం బడ్జెట్ నుంచి విడుదల చేసింది. ఆయకట్టు విషయంలో కొత్తగా 19.63 లక్షల ఎకరాలను సాగులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. ఐదు సంవత్సరాలలో లక్ష లోపు ఎకరాలు మాత్రమే సాధ్యమైంది.

    ఇక కాళేశ్వరం మూడవ టీఎంసీ కి 32,165 కోట్లు అదనంగా ఖర్చవుతుందని గత ప్రభుత్వం అంచనా వేసింది. 16, 669 కోట్లు రుణాల ద్వారా స్వీకరించింది. ప్రభుత్వం నుంచి 2,817 కోట్లను మాత్రమే ఖర్చు చేసింది. ఈ టిఎంసికి విద్యుత్ వినియోగం, భూ సేకరణ అవసరాలకు సంబంధించి 33,459 కోట్లను అంచనా వేసింది. కాకపోతే ఇప్పటికే 20,372 కోట్లు ఖర్చయ్యాయి. వీటితో మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం 1.28 లక్షల కోట్లకు చేరుకుంది. ఇప్పటికైన ఖర్చులో 73,500 కోట్లు రెండు టీఎంసీల అవసరాలకు అయితే.. మూడవ టీఎంసీ కోసం 20,372 కోట్లు ఖర్చు చేయడం విశేషం.

    ఇక మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయిన విషయంలో క్షేత్రస్థాయి అధికారులు మూడు రోజులపాటు అక్కడ కీలక అంశాలను సేకరించారు. ప్రాజెక్టు ద్వారా ప్రతి సంవత్సరం 180 టీఎంసీల నీటిని పోయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఐదు సంవత్సరాలలో 2019_2020 నుంచి 2023_24 వరకు మొత్తం 90 టీఎంసీలకు గాను కేవలం 162.36 టిఎంసిల నీటిని మాత్రమే ఎత్తిపోశారు. ఇది గత ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యంలో 18.04 శాతం మాత్రమే సాధ్యమైంది. ఇక మేడిగడ్డ బ్యారేజ్ కి తొలుత 1,849 కోట్లు మాత్రమే అంచనా వ్యయం అనుకుంటే.. ఆ తర్వాత అది 2,591 కోట్లకు, చివరకు 4,321 కోట్లకు చేరుకుంది. మొత్తంగా 133.6% అదనంగా ఖర్చయింది.

    ఇక నిర్దిష్ట ప్రణాళికకు విరుద్ధంగా మేదిగడ్డ ఏడవ బ్లాక్ నిర్మాణం జరిగింది. దీని కాంట్రాక్టు సంస్థ ఎల్ అండ్ టి అయినప్పటికీ.. అనూహ్య పరిస్థితుల్లో సబ్ కాంట్రాక్టు చేతికి వెళ్ళింది. బ్యారేజ్ కి సంబంధించి 2019 జూన్ 21 న ప్రారంభం తర్వాత నిర్వహణ విషయాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదు. వర్షాకాలం వచ్చే వరదలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ పటిష్టతపై సౌండింగ్, ప్రోబింగ్ పద్ధతిలో పరిశీలన జరగాలి. కానీ గత ప్రభుత్వం ఇటువంటిది ఏదీ పట్టించుకోలేదు. నీటి ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు కాఫర్ డ్యామ్ నిర్మించినప్పటికీ.. ప్రారంభ సమయానికి దానిపై షీట్ ఫైల్స్ లాంటివి కాంట్రాక్టు సంస్థ తొలగించలేదు. ఈ నేపథ్యంలోనే కాంట్రాక్టు సంస్థ, గతంలో పనిచేసిన అధికారులు, ప్రభుత్వ విధానాల్లో తప్పులు వంటి విషయాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి.. చర్యలు తీసుకునేందుకు సమయతమవుతున్నట్టు తెలుస్తోంది.