Maruthi Wagan R: దేశీయ కార్ల మార్కెట్ లో మారుతి కంపెనీ ఎవర్ గ్రీన్ గా నిలుస్తుంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఎన్నో మోడళ్లు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. వీటిల్లో వ్యాగన్ ఆర్ ఇప్పటికీ అత్యధికంగా విక్రయాలు జరుపుకోవడం విశేషం. 2023 ఏడాది మారుతి జరిపిన 20 లక్షల కార్ల విక్రయాల్లో వ్యాగన్ ఆర్ జూలై నుంచి డిసెంబర్ వరకు దాదాపు 80 వేలకు పైగా కార్ల విక్రయాలు జరుపుకుంది. వీటిల్లో అక్టోంబర్ 2023 లో అత్యధికంగా 22,080 యూనిట్ల అమ్మకాలు సాగాయి. డిసెంబర్ 2023 లో అత్యల్పంగా 8,578 కార్లు అమ్ముడుపోయాయి. అయితే మారుతి నుంచి రిలీజ్ అయిన స్విప్ట్ తో పోలిస్తే వ్యాగన్ రెండో స్థానంలో ఉంది. ఇంతకీ వ్యాగన్ ఆర్ ప్రత్యేకతలేంటి?
మారుతి వ్యాగన్ ఆర్ కు పోటీగా ఎన్నో కార్లు వచ్చాయి. కానీ దీని ప్రత్యేకత తగ్గడం లేదు. అందుకు కారణం ఈ కారుకు ఉన్న బెస్ట్ ఫీచర్స్ అండ్ స్పెషిఫికేషన్ అని చెప్పవచ్చు. ఈ కారు 1.0 లీటర్ , 1.2 లీటర్ పెట్రోల్ రెండు ఇంజిన్లు ఉన్నాయి.1.0 లీటర్ 67 బీహెచ్ పీ పవర్, 90 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 1.2 లీటర్ పెట్రోల్ వేరియంగ్ 90 బీహెచ్ పీ పవర్, 113 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఎంచుకున్న ప్రకారంగా గేర్ బాక్స్ ఏజీఎస్, ఏఎంటీ రెండు సౌకర్యవంతంగా ఉన్నాయి.
2019 మారుతి వ్యాగన్ ఆర్ మోడల్ లీటర్ పెట్రోల్ కు 22.5 కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. 32 లీటర్ల ఫ్యూయెల్ సామర్థ్యం ఉన్న ఇందులో 7.0 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆకర్షిస్తుంది. ఆండ్రాయిడ్ ఆటో, పవర్ ORVM తో పాటు స్పిట్, ఫోల్డ్ రియర్ బెంజ్ వంటివి ఉన్నాయి. ఇందులో ప్రయాణికుల రక్షణ కోసం డ్యూయెల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. వ్యాగన్ ఆర్ ను రూ.5.54 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.
మిగతా కార్ల కంటే వ్యాగన్ ఆర్ లో బూట్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. 341 లీటర్ల బూట్ స్పేస్ ఉండడంతో విశాలవంతమైన కారు కొనాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని కొనియాడుతున్నారు. అంతేకాకుండా ఇది హ్యాచ్ బ్యాక్ కారు అయినా ఎస్ యూవీ తరహాలో పెద్ద కారులా డిజైన్ చేయడం ఆకర్షిస్తోంది. అందుకే గత రెండు సంవత్సరాలుగా వ్యాగర్ ఆర్ అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. వ్యాగన్ ఆర్ కు పోటీగా టాటా టియాగో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 మార్కట్లోకి వచ్చాయి. అయినా వీటి పోటీని తట్టుకొని నిలబడడం విశేషం.