Ponniyin Selvan Twitter Reviewదేశం గర్వించే ప్రఖ్యాత కళాత్మక దర్శకుడు మణిరత్నం తీసిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పొన్నియన్ సెల్వన్-1’. పురాతన కాలంలోని చోళుల చరిత్రను నేటి తరానికి పరిచయం చేసే అతిపెద్ద సాహసోపేత ప్రయత్నాన్ని మణిరత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష లాంటి దిగ్గజ హీరో హీరోయిన్లతో సినిమాను తీశారు. సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడులవుతోంది. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రీమియర్స్ పడిపోగా.. ఈ సినిమా గురించి నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పొన్నియన్ సెల్వన్ మూవీ ఎలా ఉంది? టాక్ ఏంటో తెలుసుకుందాం..

బాహుబలి ఇచ్చిన సక్సెస్ తో పొన్నియన్ సెల్వన్ లాంటి తమిళ రాజుల కథను మణిరత్నం చెప్పాడు. కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్1’ నవల ఆధారంగా మణిరత్నం ఈ సినిమా తీశాడు. ఇదే తన డ్రీమ్ ప్రాజెక్ట అని చెప్పాడు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించాడు. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు తమ ఓపినియన్ ట్విట్టర్ లో చెబుతున్నారు.
ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తోంది. ఈ మూవీ బాగుందని కొందరు.. అవరేజ్ అని మరికొందరు ట్వీట్స్ చేస్తున్నారు..
https://twitter.com/Lucaown/status/1575666434130477056?s=20&t=zFMbl98w50hMT0DQ_6PfZQ
ఫస్ట్ ఆఫ్ యావరేజ్ గా ఉందని.. పిక్చరైజేషన్ హాలీవుడ్ లెవల్ లో క్వాలిటీతో తీశారని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. పాత్రల పరిచయం హాయిగా సాగుతోంది. విజువల్స్ చూసి అబ్బురపరిచారు. సెకండాఫ్ కోసం వెయిటింగ్..అంటూ చెప్పుకొచ్చాడు.
https://twitter.com/Lucaown/status/1575666434130477056?s=20&t=zFMbl98w50hMT0DQ_6PfZQ
ఇందులో అందరి నటన, లవ్ స్టోరీ, యాక్షన్ సీక్వెన్స్, రెహ్మాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ ఈ సినిమాకు ప్లస్ అంటున్నారు. సెకండాఫ్ స్క్రీన్ ప్లే, గ్రాఫిక్స్ లో క్వాలిటీ మిస్ కావడం.. కథ ఫ్లాట్ గా సాగడం దీనికి మైనస్ గా మారిందని అంటున్నారు.
https://twitter.com/okdonee/status/1575666351842086913?s=20&t=uUQFh0wlgGWWuVoT267cVg
ఫస్టాఫ్ మొత్తం అదిరిపోయే ఇంట్రోసీన్ లతో పాటు యాక్షన్ స్వీక్వెన్స్ లతో అదిరిపోయేలా ఉంటుందట.. మరీ ముఖ్యంగా రెహ్మాన్ బ్రాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుందట.. సెకాండాఫ్ మాత్రం కొంత నిరాశకు గురిచేస్తోందని అంటున్నారు. క్లైమాక్స్ ఓ రేంజ్ లో తీశారని ఘంఠాపథంగా చెబుతున్నారు.
Tamil HIT reports,
Telugu as expected disaster reports #PonniyinSelvan— Saddy (@king_sadashiva) September 30, 2022
[…] […]