https://oktelugu.com/

Animals : ఇవి మనుషులు చేసిన జంతువులు.. జాబితాలో ‘పూరి’ లైగర్

మగ మేక, ఆడ గొర్రె కలయిక ద్వారా రూపొందించిన జాతి ఇది. తక్కువ బొచ్చును కలిగి ఉండి ఎక్కువ మాంసాన్ని ఇస్తుంది. ఇది ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా మనగలుగుతుంది. అందుకే దీనిని శాస్త్రవేత్తలు రూపొందించారు. దీని మాంసాన్ని న్యూజిలాండ్ ప్రజలు ఎక్కువగా తింటారు.

Written By:
  • NARESH
  • , Updated On : March 13, 2024 / 08:38 PM IST
    Follow us on

    Man Made Animals : అప్పట్లో పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే సినిమాను రూపొందించాడు. ఆ పేరు కొత్తగా ఉండడంతో చాలామంది నోట్లో నానింది. వాస్తవానికి అది పాత పేరే. కాకపోతే చాలామందికి అవగాహన తక్కువ కాబట్టి కొత్తగా అనిపించింది. పైగా ఆ లైగర్ సినిమా టైటిల్ కింద సాలా క్రాస్ బ్రీడ్.. అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. హీరో పాత్రను బట్టి పూరి అలా పెట్టాడు. నిజంగానే లైగర్ అనేది క్రాస్ బ్రీడ్.. సింహానికి, పులికి పుట్టిన సంతానం అది. చదువుతుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఇలాంటి జంతువులను శాస్త్రవేత్తలు ఇంకా చాలా రూపొందించారు. అవి ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

    లైగర్

    మగ సింహం, ఆడపులి కలయిక ద్వారా ఈ కొత్తరకం జంతువును సృష్టించారు. ఇది చూడ్డానికి పులి ముఖంలాగా.. సింహం దేహం లాగా కనిపిస్తుంది. వేటాడే విషయంలో ఏమాత్రం తగ్గదు. పులి చూసేందుకు కొంచెం పొడుగ్గా ఉంటుంది. సింహం లావుగా ఉంటుంది.. లైగర్ చూడ్డానికి పొడవుగా, లావుగా ఉంటుంది. అయితే దీని ఒంటిపై పులి లాగే చారలు కనిపిస్తుంటాయి. కాకపోతే సింహాల లాగా వీటికి జూలు రాలేదు.

    టైగాన్స్

    ఇది మగ పులికి, ఆడ సింహానికి కలిగిన సంతానం. టైగాన్స్ చూడడానికి అచ్చం పులి లాగే కనిపిస్తుంది. కాకపోతే దీనికి జూలు ఉంటుంది. పరిమాణంలో కొంచెం లావు తక్కువ ఉంటుంది. ఒంటిపై తక్కువ సంఖ్యలో చారలు ఉంటాయి.

    జీబ్రాయిడ్లు

    చూడ్డానికి ఇది గాడిద, గుర్రం రూపంలో కనిపిస్తుంది. మగ గాడిద, ఆడ గుర్రం కలయిక వల్ల ఈ జంతువు ఉద్భవించింది.. ఇక దీని తరహాలోనే జోర్సెస్ అనే జంతువును కనిపెట్టారు. మగ జీబ్రా , ఆడ గుర్రం కలయికతో దీనిని రూపొందించారు. జోర్సెస్ మాదిరి జొంకీలు అనే జంతువును కూడా తయారు చేశారు. మగ జీబ్రా, ఆడ గాడిద కలయికతో దీనిని రూపొందించారు.

    బీఫాలో

    అమెరికన్ బైసన్ మాంసం చాలా లావుగా ఉంటుంది. తినే విషయంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది. అందుకే తక్కువ సైజులో ఉండే మాంసం కోసం బీఫాలో అనే పశువు జాతిని రూపొందించారు.. అమెరికన్ మగ బైసన్, నాటు ఆవు కలయిక ద్వారా ఈ జాతిని ఆవిష్కరించారు. బీఫాలో మాంసాన్ని అమెరికన్లు లొట్టలు వేసుకుని తింటారు.

    వోల్ఫిన్

    సముద్రపు మగ వేల్ చాపలు, ఆడ డాల్ఫిన్ కలయిక ద్వారా ఈ జాతిని సృష్టించారు. వేల చేపలకు ఉన్నట్టు వీటికి విస్తారంగా దంతాలుంటాయి. ఇవి వేల్స్ చేపల లాగా వేటాడుతాయి. డాల్ఫిన్ మాదిరి సముద్రంలో ఆటలాడుతాయి.

    కామా

    ఇది చూడ్డానికి ఒంటెలాగే కనిపిస్తుంది. కాకపోతే ఇది పూర్తి హైబ్రీడ్ రకం.. మగ ఒంటె, ఆడ లామా ద్వారా ఈ జాతిని సృష్టించారు. ఉన్ని ఉత్పత్తి కోసం, అధిక మాంసం కోసం దీనిని రూపొందించారు.

    గీఫ్

    మగ మేక, ఆడ గొర్రె కలయిక ద్వారా రూపొందించిన జాతి ఇది. తక్కువ బొచ్చును కలిగి ఉండి ఎక్కువ మాంసాన్ని ఇస్తుంది. ఇది ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా మనగలుగుతుంది. అందుకే దీనిని శాస్త్రవేత్తలు రూపొందించారు. దీని మాంసాన్ని న్యూజిలాండ్ ప్రజలు ఎక్కువగా తింటారు.