Mallareddy : మల్లన్నా.. పాయింట్ వదిలేసి ఈ ఊకదంపుడు సినిమాటిక్ డైలాగ్ లేందే!

రైతులకు అన్నీ ఇచ్చాం భారీగా పంట వచ్చింది.. ఎక్కడ చూసినా ధాన్యం కుప్పలేనంటూ గొప్పలు చెప్పుకొచ్చాడు. కానీ అసలు ఆ పంటలు అమ్ముకోవడానికి సరైన మార్కెటింగ్ సదుపాయాలు లేవు.. రైతులు పంటలను వర్షాల బారి నుంచి కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్న విషయంపై మాత్రం మాట్లాడలేదు.

Written By: NARESH, Updated On : November 24, 2023 5:28 pm
Follow us on

Mallareddy : మంత్రి మల్లారెడ్డికి సబ్జెక్ట్ తక్కువ.. లొల్లి ఎక్కువలా ఉంది. ఏ టీవీ చానెల్ ఇంటర్వ్యూ పెట్టినా.. చర్చకు పిలిచినా.. ప్రశ్నలు అడిగే వారి పాయింట్ వదిలేసి తాము చేసిన అభివృద్ధిపై ఊకదంపుడు ఉపన్యాసాలను మల్లారెడ్డి చెబుతున్నాడు.

తాజాగా టీవీ9 ఇంటర్వ్యూలో మల్లారెడ్డి వర్సెస్ జగ్గారెడ్డి మధ్య జరిగిన చర్చలో ఏరువాక ఎడిటర్ గారా రాఘవ రావు ఒక సూటి ప్రశ్నను సంధించారు. తెలంగాణలో నీళ్లు ఇచ్చి రైతులకు రైతుబంధు సహా అన్నింటిని ఇచ్చి పంటలు పండిస్తున్న మీరు వాటిని అమ్ముకునేందుకు సరైన మద్దతు ధర, మార్కెటింగ్ సదుపాయం ఇవ్వడం లేదనr.. దీనివల్ల రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయన్న ప్రశ్నకు సరైన సమాధానాన్ని మంత్రి మల్లారెడ్డి చెప్పలేకపోయాడు.

రైతులకు అన్నీ ఇచ్చాం భారీగా పంట వచ్చింది.. ఎక్కడ చూసినా ధాన్యం కుప్పలేనంటూ గొప్పలు చెప్పుకొచ్చాడు. కానీ అసలు ఆ పంటలు అమ్ముకోవడానికి సరైన మార్కెటింగ్ సదుపాయాలు లేవు.. రైతులు పంటలను వర్షాల బారి నుంచి కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్న విషయంపై మాత్రం మాట్లాడలేదు. తెలంగాణలో ఆత్మహత్యలు పెరిగాయని మధ్యలో టీవీ9 రజినీకాంత్ లెక్కలు కూడా చూపించారు. దీనిపై కూడా మల్లారెడ్డి ఏం సమాధానం చెప్పలేకపోయాడు. తెలంగాణ రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయన్న దాన్ని దాట వేశాడు. ఏవో కథలు సినిమాటిక్ డైలాగులతో డైవర్ట్ చేశాడు.

రైతుల ధాన్యం కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సరైన వ్యవస్థ ఏర్పాటు చేయలేదు. దీంతో ధాన్యం అంతా కల్లాలు, రోడ్లపై కుప్పలుగా పోసి ఉంది. ఎంత పంట పండించినా దాన్ని అమ్ముకునే సౌకర్యాన్ని కల్పించలేదు. దీనికి సమాధానం చెప్పకుండా మల్లారెడ్డి మళ్లీ అదే సినిమాటిక్ నాలుగు డైలాగులు చెప్పి ఊరుకున్నాడు. ఆ వీడియోను మీరు చూడొచ్చు.