Main Atal Hoon Trailer: దేశ రాజకీయాల్లో అటల్ బిహారీ వాజ్ పేయ్ ఒక సంచలనం. ప్రధానిగా ఆయన దేశానికి మరవలేని సేవలు అందించారు. అటల్ బీహారీ వాజ్ పేయ్ కి పార్టీలకు అతీతంగా అభిమానులు ఉంటారు. 1996లో ఫస్ట్ టైం ప్రధాని పీఠం అధిరోహించిన వాజ్ పేయ్ మెజారిటీ కోల్పోవడంతో 16 రోజులకే పదవి నుండి వైదొలగాల్సి వచ్చింది. 1998లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం మరలా అధికారంలోకి రాగా వాజ్ పేయి ప్రధాని అయ్యారు.
వాజ్ పేయి ప్రధానిగా ఉండగా కీలకమైన న్యూక్లియర్ టెస్ట్స్ జరిగాయి. రాజస్థాన్ లోని పోక్రాన్ లో జరిపిన న్యూక్లియర్ టెస్ట్ విజయం సాధించింది. అణ్వాయుధాలు కలిగిన దేశాల జాబితాలో ఇండియా చేరింది. శత్రు దేశాలకు గట్టి సమాధానం ఇచ్చింది. 1999లో పాకిస్తాన్ తో జరిగిన కార్గిల్ వార్ లో ఇండియా విజయం సాధించింది. ఇలాంటి కీలక పరిణామాలు, అభివృద్ధి అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉండగా చోటు చేసుకున్నాయి.
దేశ రాజకీయాలను శాసించిన కీలక నేత అటల్ బిహారీ వాజ్ పేయ్ జీవితం గురించి ఈ తరాలకు కూడా తెలియాలని ఆయన బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. మై అటల్ హూ టైటిల్ తో ఈ బయోపిక్ రూపొందుతుంది. నేడు ఈ చిత్ర సెకండ్ ట్రైలర్ విడుదల చేశారు. నాయకుడిగా, ప్రధానిగా అటల్ బిహారీ వాజ్ పేయ్ జీవితంలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనల సమాహారంగా మై అటల్ హూ తెరకెక్కినట్లు అర్థం అవుతుంది.
ప్రధాని ఇందిరా గాంధీ 1975లో ఎమర్జెన్సీ విధించింది. దానికి వ్యతిరేకంగా అటల్ బిహారి వాజ్ పేయ్ పోరాడాడు. జైలు పాలు అయ్యాడు. అలాగే ప్రధాని అయ్యాక ఆయన తీసుకున్న కీలక నిర్ణయాలు, చోటు చేసుకున్న పరిణామాలు చూపించారు. మై అటల్ హూ చిత్రానికి రవి జాదవ్ దర్శకుడు. అటల్ పాత్రను పంకజ్ త్రిపాఠి చేశారు. జనవరి 19న ఈ చిత్రం విడుదల కానుంది.