Mahesh Babu : ఇక మహేష్ బాబు తెలుగు సినిమాల్లో నటించరా? అదే కారణమా?

అలాంటి నిర్ణయం తీసుకున్నా కొన్ని సంవత్సరాల పాటు మహేష్ బాబు రీజనల్ సినిమా చేయకపోవచ్చు. లేదా మొత్తానికి రీజనల్ సినిమాలకు దూరం కావచ్చు. ఇక వీటిపై క్లారిటీ రావాలంటే కొన్ని సంవత్సరాల వరకు వెయిట్ చేయాల్సిందే.

Written By: Swathi, Updated On : January 18, 2024 8:07 pm

Mahesh Babu

Follow us on

Mahesh Babu : మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ నటుడు తన నటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈయన నటన, అందం, మంచి తనం ముందు ఎవరైనా ఓడిపోవాల్సిందే. ఓర్పు, ఓపికకు బ్రాండ్ అంబాసిడర్ మహేష్ బాబు. అయితే ఈయన సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు అభిమానులు. ఈ మధ్య మహేష్ బాబు నటించిన సినిమాలు మిశ్రమ టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కానీ గుంటూరు కారం పాజిటివ్ టాక్ తో దూసుకొనిపోయింది.

ఎంతో మంది ఆదరణ, ఆసక్తి చూపించే మహేష్ బాబు ఇక తెలుగు సినిమాలు చేయరని టాక్. రీజనల్ సినిమాలు చేయకపోవచ్చనే టాక్ రావడంతో ఘట్టమనేని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ స్టార్ హీరో రీజనల్ సినిమాల్లో నటించరు అనే టాక్ రావడానికి కారణం మహేష్ బాబు. దానికి రీజన్ కూడా ఉందండోయ్.. రీసెంట్ గా గుంటూరు కారం సినిమా సక్సెస్ సాధించడంతో సక్సెస్ మీట్ ను పెట్టారు మేకర్స్. ఇందులో భాగంగానే రీసెంట్ గా మిల్క్ స్టార్ యాంకర్ సుమతో ఇంటర్య్వూలో పాల్గొన్నారు.

సుమతో మాట్లాడుతూ.. ఇకపై తెలుగు సినిమాలు చేయకపోవచ్చు అన్నారు మహేష్. దీనికి వెనుక రహస్యం వెతుకుతున్నారు నెటిజన్లు. అయితే పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తే రీజనల్ సినిమాలు చేసే అవకాశం రాదు. ఒకసారి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగితే ఆ స్టార్ ఆల్మోస్ట్ గా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలే చేస్తారు. లేదా హాలీవుడ్ సినిమాలు చేసే అవకాశం కూడా రావచ్చు. రీసెంట్ గా ఎన్టీఆర్ కూడా హాలీవుడ్ సినిమాలో నటించబోతున్నడంటూ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.

మరో రీజన్ కూడా ఉందండోయ్.. మహేష్ తన తదుపరి సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళితో సినిమా చేయబోతున్నారు. ఇక రాజమౌళితో సినిమా అంటే మామూలుగా ఉండదు. ఇతర దర్శకులతో సంవత్సరం లోపే సినిమా కంప్లీట్ అయితే జక్కన్నతో సినిమా చేయాలంటే సంవత్సరాలు పడుతుంది. ఇప్పటికే మహేష్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. రాజమౌళితో సినిమా అంటే మరో మూడు సంవత్సరాలు ఈజీగా అవుతుంది అనే టాక్ ఉంది. ఆ తర్వాత కెరీర్ ఎలా ఉంటుందో.. లేదా ఈయనే సినిమాలకు బ్రేక్ ఇవ్వచ్చు. రీసెంట్ గా సమంత కూడా సంవత్సరం పాటు సినిమాలు చేయను అనేసింది. అలాంటి నిర్ణయం తీసుకున్నా కొన్ని సంవత్సరాల పాటు మహేష్ బాబు రీజనల్ సినిమా చేయకపోవచ్చు. లేదా మొత్తానికి రీజనల్ సినిమాలకు దూరం కావచ్చు. ఇక వీటిపై క్లారిటీ రావాలంటే కొన్ని సంవత్సరాల వరకు వెయిట్ చేయాల్సిందే.