https://oktelugu.com/

Maharashtra: అయోధ్య సంబరాలపై ఓ వర్గం దాడి.. వాళ్లపై బుల్డోజర్ అటాక్ చేసి షాకిచ్చిన ప్రభుత్వం

సోమవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలో రాముడి ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. అందులో బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 24, 2024 / 11:42 AM IST
    Follow us on

    Maharashtra: పరమత సహనం అనేది ప్రతి మనిషికి ఉండాలి. ఎదుటివారి అభిప్రాయాలను కచ్చితంగా గౌరవించాలి. ముఖ్యంగా మెజారిటీ వర్గం వారు ఏదైనా చేస్తుంటే గిచ్చి కయ్యం పెట్టుకోకూడదు. అలాకాకుండా మా ఇష్టం.. ఇష్టం వచ్చినట్టు చేస్తాం. దాడికి దిగుతాం. పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తామంటే దాని పర్యవసనాలు కూడా తీవ్రంగానే ఉంటాయి. ఇలాంటిదే ప్రస్తుతం మహారాష్ట్రలో జరిగింది. అయితే దీనికి సంబంధించి అక్కడి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడంతో ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి..

    సోమవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలో రాముడి ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. అందులో బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. మొత్తానికి ఆ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. రామ జన్మభూమి ట్రస్ట్ ఏర్పాట్లను పకడ్బందీగా చేయడంతో ఆ వేడుక అంబరాన్ని అంటింది. ఈ వేడుకను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సంబరాలు జరిగాయి. దేశంలోని ప్రతి గ్రామంలో అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని వేడుకలు నిర్వహించారు. రామాలయాల్లో పూజలు చేశారు. హనుమంతుడికి భక్తజనం నీరాజనాలు అర్పించారు. ఆలయ కమిటీలు అన్నదానాలు నిర్వహించాయి. కొంతమందిని మినహాయిస్తే దేశంలోని మిగతా వారంతా బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టను తమ ఇంట వేడుకగా జరుపుకున్నారు. సాయంత్రం పూట రామ జ్యోతులు వెలిగించారు.. అయితే ఇదంతా ఒక కోణం అయితే.. ముంబై మహానగరంలో అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని కొంతమంది హిందూ భక్తులు ఆదివారం రాత్రి ర్యాలీ నిర్వహించారు. అయితే వీరి ర్యాలీని కొంతమంది అడ్డుకున్నారు. వారి పై దాడి చేశారు.

    అయితే ఈ విషయంపై అక్కడ హిందువులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ అధికారంలో శివసేన_ బిజెపి సంకీర్ణ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఎవరెవరైతే దాడికి పాల్పడ్డారో వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అక్కడితో ఆగకుండా ఆ దాడికి పాల్పడిన వ్యక్తులకు సంబంధించిన అక్రమ కట్టడాలను ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నేలమట్టం చేసింది. ఆ నిందితులకు మీరా రోడ్డు లో 12 నుంచి 15 అంతస్తుల అక్రమ భవనాలు ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎన్నిసార్లు నోటిఫికేషన్ వారు పట్టించుకోవడం మానేశారు. ఇదే క్రమంలో ఆ నిందితులు హిందూ భక్తులపై దాడి చేయడం.. ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించడంతో.. ఒకసారి గా మున్సిపల్ అధికారులకు కొత్త శక్తులు వచ్చినట్టయింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ముంబై మున్సిపల్ అధికారులు బుల్డోజర్లతో మీరా రోడ్డులోని ఆ నిందితులకు సంబంధించిన అక్రమ భవనాలను నేలమట్టం చేశారు. అంతేకాదు ఈ చర్యను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్న విస్ స్వయంగా పర్యవేక్షించారు. కాగా ఈ భవనాలను నేలమట్టం చేస్తున్న సమయంలో మీడియా ప్రతినిధులు అక్కడికి భారీగా చేరుకున్నారు. ఆ దృశ్యాలను వీడియో తీసి వార్తల రూపంలో ప్రసారం చేశారు. ప్రస్తుతం ఆ భవనాల నేల మట్టానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.