https://oktelugu.com/

Maaveeran movie review : శివ కార్తికేయన్ ‘మహావీరుడు’ మూవీ ఫుల్ రివ్యూ

. ఈయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ' మహావీరుడు ' నేడు ప్రపంచవ్యాప్తంగా ఘానంగా తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల అయ్యింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాం.

Written By:
  • NARESH
  • , Updated On : July 14, 2023 8:07 pm
    Follow us on

    నటీనటులు: శివ కార్తీకేయన్, అదితి శంకర్, మిస్కిన్, సునీల్ తదితరులు

    దర్శకత్వం : మడొన్నే అశ్విన్

    నిర్మాత : అరుణ్ విశ్వ

    సినిమాటోగ్రఫి : విదు అయ్యన్న

    ఎడిటింగ్ : ఫిలోమిన్ రాజ్

    మ్యూజిక్ : భరత్ శంకర్

    బ్యానర్ : శక్తి టాకీస్

    తమిళనాడు హీరోలకు మన టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది అనే విషయం అందరికీ తెలిసిందే. రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, విజయ్ రేంజ్ కాకపోయినా ఉన్నవారిలో తెలుగుదేశం ఆడియన్స్ కి కాస్తో కూస్తో సూపరిచితమైన హీరోయిన్ శివ కార్తికేయన్. ఈయన హీరో గా నటించిన డాక్టర్, డాన్ వంటి చిత్రాలు తెలుగులో డబ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. అప్పటి నుండి ఈయన సినిమాలకు మన టాలీవుడ్ లో ఒక మోస్తారు రేంజ్ మార్కెట్ ఏర్పడింది. ఈయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ మహావీరుడు ‘ నేడు ప్రపంచవ్యాప్తంగా ఘానంగా తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల అయ్యింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాం.

    కథ :

    వైజాగ్ కి చెందిన సత్య (శివ కార్తికేయన్) ఒక ప్రముఖ దిన పత్రికకు కార్టూనిస్ట్ గా పని చేస్తుంటాడు. స్వతహాగా సత్య చాలా భయస్తుడు, అమ్మ చాటు బిడ్డ అన్నమాట. తన తల్లి (సరిత), సోదరి రాజీ (మనీష బ్లెస్లీ) తో కలిసి అతి సాధారణమైన జీవితం గడుపుతుంటాడు. అయితే ఎన్నో ఏళ్ళ నుండి ఉంటున్న తమ సొంత ఇళ్లను కూల్చివేసి ప్రవుత్వం కట్టించిన అపార్ట్మెంట్స్ లోకి బలవంతం గా పంపిస్తాడు మంత్రి జయసింహా (మిస్కిన్). అయితే అత్యంత నాశిరకపు క్వాలిటీ తో నిర్మించిన ఈ అపార్ట్మెంట్ లో ప్రతీ రోజు ఎదో ఒక సమస్య వస్తుంటాది. రేపో మాపో కూలిపోయేట్టు ఉంటుంది ఈ అపార్ట్మెంట్స్. మరోపక్క ఇదే అపార్ట్మెంట్స్ ఆవరణలో మంత్రి జయ సింహా అక్రమాలు, అన్యాయాలు చేస్తూ ఉంటాడు. ఏ చిన్న అన్యాయం జరిగిన తట్టుకోలేని సత్య తల్లి, ఈ అన్యాయాలను చూసి ఆవేశం తో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు సత్య ఆమెని కంట్రోల్ ఎందుకు చేసాడు? తన తండ్రి మరణం కి జయసింహా కి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అనేది మిగిలిన స్టోరీ.

    విశ్లేషణ :

    కొన్ని కథలను ఆ జానర్ కి తగ్గట్టుగానే స్క్రీన్ ప్లే రాసుకొని తీస్తే కరెక్ట్ గా ఉంటుంది. సీరియస్ గా సాగాల్సిన కథలో కామెడీ పెడితే చిరాకు వేస్తుంది కదూ..? సరిగ్గా ఈ సినిమా విషయం లో అదే జరిగింది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్ బాగా వర్కౌట్ అయ్యింది. యోగి బాబు కామెడీ ఈ సినిమాకు హైలైట్. అయితే ఫస్ట్ హాఫ్ ఉన్న ఆసక్తిగా సెకండ్ హాఫ్ ఉండదు. ప్రతీ సన్నివేశం కి గ్రాఫ్ తగ్గుతుపోతుంది. ఎమోషనల్ గా సాగాల్సిన ఎన్నో సన్నివేశాలను నవ్వులపాలు చేసాడు డైరెక్టర్ మడోన్నే అశ్విన్. సొంత ఇల్లుని కూల్చి వేస్తె ఒక మధ్య తరగతి కి చెందిన కుటుంభీకులకు ఎంతో బాధగా ఉంటుంది. ఆ బాధని వెండితెర మీద పందించలేకపోయాడు డైరెక్టర్. కథలో దమ్ము లేకపోవడం తో శివ కార్తికేయన్, యోగిబాబు పాత్రలు తప్ప మిగిలిన ఆర్టిస్ట్స్ పాత్రలు తేలిపోయాయి. సాంకేతికంగా కూడా ఈ చిత్రం గొప్పగా ఏమి లేదు. ఇక హీరోయిన్ గా చేసిన ఆదితీ శంకర్, విలన్ గా చేసిన సునీల్ పత్రాలు కూడా అంతంత మాత్రం గానే ఉన్నాయి. అంతే కాకుండా రవితేజ అందించిన ఆకాశవాణి వాయిస్ ఓవర్ కూడా పెద్దగా కనెక్ట్ అయ్యే విధంగా లేదు. ఇక భరత్ శంకర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు అనిపించింది కానీ పాటలు మాత్రం ఒక్కటి కూడా బాగాలేదు. అలా బ్లాక్ బస్టర్ ఫస్ట్ హాఫ్ తో, బీలో యావరేజ్ సెకండ్ హాఫ్ తో ఓవరాల్ గా ఎవరేజి చిత్రం గా నిల్చింది ఈ మహా వీరుడు చిత్రం.

    చివరి మాట :

    శివ కార్తికేయన్ మార్క్ కామెడీ ని ఇష్టపడేవారు ఈ సినిమాను ఒక్కసారి టైం పాస్ కోసం చూడొచ్చు. రొటీన్ సినిమాలను లైక్ చెయ్యని వాళ్ళు ఈ చిత్రానికి దూరం గా ఉండొచ్చు.

    రేటింగ్ : 2.25/5

    Mahaveerudu - Official Trailer | Sivakarthikeyan, Aditi Shankar | Madonne Ashwin | Arun Viswa