Maa Oori Polimera Trailer : సత్యం రాజేష్ గత కొన్ని రోజులు గా డిఫరెంట్ సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. ఇక అందులో భాగంగానే సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్ శ్రీను లీడ్ రోల్స్ లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మా ఊరి పొలిమేర 2…ఈ సినిమాకి అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించగా,ఈ సినిమాను గౌరికృష్ణ నిర్మించారు. ఇక మా పోలి మేర పార్ట్ 1 ను ఒక అద్భుతమైన ట్విస్టుతో డైరెక్టర్ ముగించాడు.ఇక మొదటి పార్ట్ సినిమా అంతా కూడా చూసే ప్రేక్షకులకు ఉత్కంఠను రేకెత్తిస్తు సినిమా మొత్తం సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తూ డైరెక్టర్ ప్రతి క్యారెక్టర్ ని కూడా చాలా అద్భుతంగా ఎస్టాబ్లిష్ చేసి ప్రతి క్యారెక్టర్ కి కూడా ఒక కన్ క్లూజన్ ఇస్తూ అందులో భాగంగానే మొదటి పార్ట్ ఎండ్ చేశాడు.
అయితే ఆ సినిమా ఎండింగ్ లో అంటే సినిమా మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత కూడా డైరెక్టర్ ఒక అద్భుతమైన ట్విస్ట్ తో సినిమాని ఎండ్ చేసిన విధానం చాలా బాగుంది.అలాగే అది సెకండ్ పార్ట్ కి లీడ్ అయింది. ఇక దాంతో ఇప్పుడు మా ఊరి పోలిమేర 2 అనే సినిమా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది .అందులో భాగంగానే ఇవాళ్ల వచ్చిన ట్రైలర్ అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఈ ట్రైలర్ ని చూస్తే ఇది మూఢనమ్మకాలకి, సైన్స్ కి మధ్య జరిగే పోరాటంగా తెలుస్తుంది. ట్రైలర్ లో అధ్యంతం చేతబడులకి సంబంధించిన విషయాలని ఎక్కువగా డిస్కస్ చేశారు. కాబట్టి ఇది ఒక గుడి కి సంభందించిన స్టోరీ అని కూడా తెలుస్తుంది.ఇక ఇలాంటి టైంలోనే ఈ సినిమా ట్రైలర్ లో మనకు తెలియజేసిన విషయాలు ఏంటి అంటే మహబూబ్ నగర్ లోని ఒక గ్రామంలో జరుగుతున్న చేతబడులకి సంబంధించిన వివరాలు చూపిస్తూ ట్రైలర్ అనేది ఓపెన్ అవుతుంది.ఇక ఆ గుడి కి చేత బడికి మధ్య సంబంధం ఏంటి అనే విషయాలను తెలుసుకోవడానికి ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఆర్కియాలజిస్ట్ ఇద్దరు కలిసి టెంపుల్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని తెలుసుకునే ప్రాసెస్ లో మల్లేశం ( సత్యం రాజేష్) క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ అలాగే గెటప్ శీను క్యారెక్టర్ ని కూడా అందులో ఇన్వాల్వ్ చేస్తూ ట్రైలర్ ని అధ్యంతం సస్పెన్స్ ని కలిగిస్తూ చాలా బాగా కట్ చేశారు.
ఇక మా ఊరి పొలిమేర సినిమా మొదటి పార్ట్ ఓటీటి లో డైరెక్ట్ గా రిలీజ్ అయింది. కానీ పొలిమేర 2 సినిమా మాత్రం థియేటర్ లో రిలీజ్ అవుతుంది. అందుకోసమే దీన్ని థియేటర్ లో చూసిన తర్వాతనే ప్రేక్షకులు ఓటిటి లో చూడాల్సి ఉంటుంది. ఇక చాలా మంది అభిమానులు ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మా ఊరి పొలిమేర మొదటి పార్ట్ చూసిన ప్రతి ఆడియన్స్ కూడా ఈ సినిమాని తప్పకుండా చూడ్డానికి ఉత్సహం చూపిస్తారు ఎందుకంటే దర్శకుడు ఆ సినిమాని మలిచిన తీరు అద్భుతంగా ఉంది.ఇక ఈ పొలిమేర 2 లో కూడా చాలా ట్విస్ట్ లు ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా సత్యం రాజేష్ పోషించిన మల్లేశం క్యారెక్టర్ ఎంటైర్ సినిమాలో మంచి క్యారెక్టర్ గా ఉంది,లేదా చెడ్డ క్యారెక్టర్ గా ఉందా అనేది చూపించ కుండానే మొదటి పార్ట్ లో సస్పెన్స్ పెట్టారు. నిజానికి ఆయన మంచోడా, చెడ్డోడా అనేది తెలియాలంటే ఈ సినిమా వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే ఇక నవంబర్ 3 వ తేదీన ఈ సినిమా థియేటర్ లలో రిలీజ్ అవుతుంది…