LK Advani: బీజేపీ దిగ్గజ నేత. రాజకీయ కురవృద్ధుడు లాక్ కృష్ణ అధ్వానీకి భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ మేరకు ఆయన శనివారం(ఫిబ్రవరి 3న) ట్వీట్ చేశారు. ‘శ్రీ ఎల్కే అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని ఇస్తున్నామని ప్రకటించడం నాకు సంతోషంగా ఉంది. పురస్కారం ఇస్తున్నామని ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపాను. భారత దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకం. క్షేత్రస్థాయి కార్మికుడి స్థాయి నుంచి భారత దేశ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా ఎదిగారు ఆయన. హోంమంత్రి, ఐబీశాఖ మంత్రిగానూ పనిచేశారు. పార్లమెంట్లో ఆయన పనితీరు ఎందరినో ప్రభావితం చేసింది. పారదర్శకత, సమగ్రతతో.. దశాబ్దాలపాటు ఆయన ప్రజా సేవ చేశారు. అందరు గౌరవించే రాజనీతిజ్ఞుడు అద్వానీ. దేశ ఐకమత్యానికి ఎంతో కృషి చేశారు. అద్వానీకి భారతరత్న లభించడం నాకు నిజంగా భావోద్వేగమైన విషయం. ఆయనతో అనేకమార్లు మాట్లాడే అవకాశం నాకు లభించడం ఒక ప్రివిలేజ్‌గా భావిస్తున్నాను. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను’ అని, ప్రధానమంత్రి ట్వీట్‌లో పేర్కొన్నారు.
దేశ రాజకీయాల్లో కీలకంగా
ఎల్‌కే.అధ్వానీ కొన్నేళ్ల 6కితం వరకు దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన వయసు 96 ఏళ్లు. 1970 నుంచి 2019 వరకు అధ్వానీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. రామజన్మభూమి ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో ఉప ప్రధానిగా పనిచేశారు.
ఒకే ఏడాది రెండు అవార్డులు..
కేంద్రం ఒకే ఏడాది రెండు భారత రత్న అవార్డులు ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి, సోషలిస్టు నేత కర్పూరి ఠాకూర్‌కు 2023–24 సవంత్సరానికి భారతరత్న ప్రకటించారు. తాజాగా 2024–25 సవంత్సరానికి భారత మాజీ ఉప ప్రధాని ఎల్‌కే.అధ్వానీకి భారత రత్న ప్రకటించారు.