Happiest Countries: మనం బతికేదే సంతోషంగా ఉండడానికి.. చేసే పనులు, ఉద్యోగాలు, ఏం చేసినా అదంతా మన ఆనందం కోసమే. అలాంటి ఆనందం ఈ ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుందో తెలుసా? దీనిపై తాజాగా ఐక్యరాజ్యసమితి క్లారిటీ ఇచ్చింది. ఈ భూమ్మీద అత్యంత సంతోషకరమైన దేశంగా ‘ఫిన్ లాండ్’ నిలిచింది. వరుసగా ప్రతీ సంవత్సరం ఈ దేశమే ఆనందకరమైన దేశంగా నిలుస్తోంది.

ప్రపంంలోని టాప్ 10 సంతోషకరమైన దేశాల జాబితాను తాజాగా ఐక్యరాజ్యసమితి విడుదల చేసింది. ‘ఆనందం, సంతృప్తి, పరిపూర్ణత మొదలైన అంశాల్లో అత్యంత ఎక్కువ ఉన్న దేశాన్ని ఐక్యరాజ్యసమితి లెక్కగట్టింది. ఇందుకోసం వివిధ మార్గాలను పరిగణలోకి తీసుకుంది. వాటి ఫలితాలను ఒక నివేదిక ద్వారా తెలియజేసింది.
1. ఫిన్లాండ్:
ప్రపంచంలోనే నంబర్ 1 సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ నిలిచింది. ఫిన్లాండ్ లోని మెరుగైన జీవనశైలి, స్వేచ్ఛ మొదలైన వాటి కారణంగా వరుసగా నాలుగు సార్లు ప్రపంచంలోని సంతోషకరమైన దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇది ప్రపంచంలోని అత్యుత్తమ విద్యావ్యవస్థల పరంగానూ మొదటి ర్యాంక్ పొందింది.
2.డెన్మార్క్:
ప్రపంచంలోని అత్యంత స్నేహ పూర్వక దేశంగా డెన్మార్క్ ఉంది. అందమైన తీరప్రాంతం ఇక్కడుంది. ప్రపంచవ్యాప్తంగా డానిష్ జీవన విధానం ఎంతో గౌరవం పొందుతోంది.
3.స్విట్జర్లాండ్
ఇక ప్రకృతి అందానికి ప్రసిద్ధి చెందిన స్విట్జర్లాండ్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. ప్రత్యక్ష ప్రజాస్వామ్య వ్యవస్థను కలిగి మానవ హక్కులను పూర్తి స్థాయిలో అందుకునే దేశం ఇదీ. ఇదే ప్రపంచంలో 3వ సంతోషకరమైన దేశంగా నిలిచింది.
Also Read: TDP- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆఫర్ పై టీడీపీ మౌనం.. అసలు కారణం ఇదేనా?
4.ఐస్ లాండ్
ఈ శీతల దేశం ప్రపంచంలోనే 4వ అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. 2007లో ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కింది.
5. నెదర్లాండ్స్
ఆనందాలకు చిహ్నమైన దేశం నెదర్లాండ్స్. డచ్ పిల్లలను ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వారిగా గుర్తించింది.
6.నార్వే
నార్వేలో 2017 నుంచి ఈ ర్యాంక్ దిగజారుతోంది. ప్రపంచంలోని అత్యత్తుమ సామాజిక భద్రతా వ్యవస్థలలో ఒకటి. సహజ వనరుల ఆధారంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఇదీ.
7. స్వీడన్
పని-జీవిత సమతుల్యతకు అధిక ప్రాధాన్యమిచ్చే ఇక్కడి ప్రజల సంతోషానికి దారితీస్తుంది.
ఇక ప్రపంచంలోనే సంతోషకమైన దేశాల జాబితాలో 8వ స్థానంలో లక్సెంబర్గ్, న్యూజిలాండ్, ఆస్ట్రియాలు అధిక ఆదాయంతో సంతోషకరమైన దేశాలుగా ఉన్నాయి.