https://oktelugu.com/

Telangana New Cabinet : తెలంగాణ మంత్రుల జాబితా విడుదల.. సీనియర్లకు చోటు.. డిప్యూటీ సీఎం ఎవరంటే?

ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రాష్ట్ర కేబినెట్ లోకి ఇద్దరికి మంత్రి పదవి లభించింది. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుతోపాటు హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ పేర్లను కాంగ్రెస్ నాయకులు గవర్నర్ కు అందజేశారు. వీరికి కేటాయించే శాఖలు కాసేపట్లో తెలియనున్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : December 7, 2023 / 10:12 AM IST
    Follow us on

    Telangana New Cabinet : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేయనున్నారు. ఇక అసంతృప్తులు, అసమ్మతులు అందరినీ తోసిరాజని.. అన్ని సమస్యలను పరిష్కరించి మరీ రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంతో కొలువు దీరనున్నారు.

    తెలంగాణ కేబినెట్ లో చోటు కల్పించిన మంత్రుల జాబితాను రాజ్ భవన్ కు కాంగ్రెస్ నేతలు అందించారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దామోదర రాజనర్సింహలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు కాసేపట్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

    ఇక తెలంగాణ డిప్యూటీ సీఎంగా దళిత సీనియర్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీతక్కను హోంమంత్రిని చేయనున్నట్టు తెలుస్తోంది. ఆయనతోపాటు మంత్రులంతా ఉదయం 11 గంటలకల్లా ఎల్బీ స్టేడియానికి చేరుకోనున్నారు. రేవంత్ రెడ్డితోపాటు వీరంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.