https://oktelugu.com/

ఎల్‌ఐసీ బెస్ట్ పాలసీ.. రోజుకు రూ.64తో చేతికి రూ.13 లక్షలు..?

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను కస్టమర్లకు ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఒక పాలసీ తీసుకోవడం వల్ల పాలసీ తీసుకున్న వాళ్లకు చేతికి డబ్బులు వచ్చే అవకాశంతో పాటు పాలసీ తీసుకున్న వ్యక్తి కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత లభిస్తుంది. తక్కువ ప్రీమియం చెల్లించి ఈ పాలసీ ద్వారా ఎక్కువ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. Also Read: టీవీ, ఫ్రిజ్ ఉన్నవారికి షాక్.. రేషన్ కార్డు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 15, 2021 / 06:13 PM IST
    Follow us on

    దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను కస్టమర్లకు ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఒక పాలసీ తీసుకోవడం వల్ల పాలసీ తీసుకున్న వాళ్లకు చేతికి డబ్బులు వచ్చే అవకాశంతో పాటు పాలసీ తీసుకున్న వ్యక్తి కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత లభిస్తుంది. తక్కువ ప్రీమియం చెల్లించి ఈ పాలసీ ద్వారా ఎక్కువ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.

    Also Read: టీవీ, ఫ్రిజ్ ఉన్నవారికి షాక్.. రేషన్ కార్డు రద్దయ్యే ఛాన్స్..?

    కొత్తగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని భావించే వాళ్లకు ఎల్‌ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీ బెస్ట్ పాలసీ అని చెప్పవచ్చు. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల కాలపరిమితితో ఎల్‌ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీని తీసుకోవచ్చు. 35 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి 5 లక్షల రూపాయల మొత్తానికి 25 సంవత్సరాల కాలపరిమితిలో ఈ పాలసీని తీసుకుంటే 13 లక్షల రూపాయలు సొంతమవుతాయి.

    Also Read: పెన్షన్ తీసుకునే వారికి మోదీ సర్కార్ శుభవార్త.. వారికి బెనిఫిట్..?

    నెలకు 1930 రూపాయల చొప్పున రోజుకు 64 రూపాయల చొప్పున ఆదా చేయడం వల్ల ఈ పాలసీ ప్రయోజనాలను పొందవచ్చు. నెలవారీగా ప్రీమియం చెల్లించలేని వాళ్లు సంవత్సరానికి 22,600 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ గడువు తీరిన తరువాత ఈ మొత్తం మీ చేతికి అందుతాయి. ఎంతో విశ్వసనీయమైన ఇన్సూరెన్స్ కంపెనీగా పేరు తెచ్చుకున్న ఎల్‌ఐసీ పాలసీలలో ఇన్వెస్ట్ చేస్తే ఎటువంటి రిస్క్ ఉండదు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలను పొందే అవకాశం ఉండటంతో కొత్తగా పాలసీ తీసుకోవాలని అనుకునే వాళ్లు ఈ పాలసీని తీసుకుంటే మంచిది. ఒకవేళ ఏ కారణం చేతనైనా పాలసీదారుడు గడువులోపు మరణిస్తే నామినీ రూ.6.25 లక్షలు పొందే అవకాశం ఉంటుంది.