https://oktelugu.com/

Pawan Kalyan : పవన్ దగ్గరకు బారులు

ఇదంతా చంద్రబాబు స్కెచ్ అని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. పేరుకే పొత్తు కానీ.. పోటీ చేసేది టిడిపి అని చెప్పుకొస్తున్నారు. మొత్తానికైతే పవన్ ప్రకటనలతో అన్ని పార్టీల నేతలు జనసేనలోకి క్యూ కడుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Written By:
  • Dharma
  • , Updated On : March 4, 2024 / 10:14 AM IST
    Follow us on

    Pawan Kalyan : ఎన్నికలకు రోజులు దగ్గర పడుకున్న కొలది ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. రాజకీయ పార్టీలు అభ్యర్థులను మార్చుతుండడంతో అసంతృప్తులు ప్రత్యర్థి పార్టీలో చేరుతున్నారు.ప్రధానంగా జనసేనకు నేతల తాకిడి అధికంగా ఉంది. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. తక్కువ స్థానాలు తీసుకోవడంపై అనేక రకాలుగా చర్చలు నడిచాయి. ఈ తరుణంలో పవన్ వాటిని తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు. ఎలక్షన్ క్యాంపెయిన్, డబ్బు, బూత్ మేనేజ్మెంట్ వంటి వాటిని గుర్తు చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆర్థికంగా బలమైన నేతలు జనసేనలో చేరడానికి సిద్ధపడుతుండడం విశేషం.

    పొత్తులో భాగంగా జనసేనకు మూడు పార్లమెంట్ స్థానాలు దక్కాయి. అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేయనున్నారు. అయితే మారిన సమీకరణలతో ఆయన వేరే పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. మచిలీపట్నం నుంచి జనసేన అభ్యర్థిగా బాలశౌరి బరిలో దిగనున్నారు. కాకినాడ నుంచి సానా సతీష్ పోటీ చేయనున్నారు. అయితే ఈ ఇద్దరు సైతం బయట వారేనని తెలుస్తోంది. ఇద్దరూ తెలుగుదేశం పార్టీకి విధేయులుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు అనంతపురం నుంచి జెసి పవన్ రెడ్డి వచ్చి టిడిపిలో చేరతారని తెలుస్తోంది. మరోవైపు టిడిపిలో చేరాల్సిన కొణతాల రామకృష్ణ, కొత్తపల్లి సుబ్బారాయుడు లాంటి నేతలు జనసేనలో చేరారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలకే టిక్కెట్లు కేటాయిస్తున్నారన్న అపవాదు జనసేన పై పడుతోంది.

    పవన్ ఆర్థిక అంశాలు, పోల్ మేనేజ్మెంట్ వంటి వాటిని ప్రస్తావించడంతో ఇప్పుడు జనసేన వైపు నేతలు బారులు తీరుతున్నారు. ఇంకా పొత్తులో భాగంగా 19 మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అందుకే టిక్కెట్ల కోసం విపరీతమైన గిరాకీ జనసేనలో ఉంది. మరోవైపు ఎప్పటినుంచో టిక్కెట్ ఆశిస్తూ పనిచేస్తున్న నాయకులు జనసేన లో ఉన్నారు. మరోవైపు వైసీపీ నుంచి సైతం పెద్ద ఎత్తున నేతలు చేరుతున్నారు. ఇప్పుడు ఇది చాలా అన్నట్టు తెలుగుదేశం పార్టీ నుంచి సైతం జనసేనలో చేరికల వెనుక వ్యూహం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టిడిపిలో టిక్కెట్లు రానివారు, పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయిన వారు జనసేన వైపు వస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఇదంతా చంద్రబాబు స్కెచ్ అని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. పేరుకే పొత్తు కానీ.. పోటీ చేసేది టిడిపి అని చెప్పుకొస్తున్నారు. మొత్తానికైతే పవన్ ప్రకటనలతో అన్ని పార్టీల నేతలు జనసేనలోకి క్యూ కడుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.