https://oktelugu.com/

Layoffs 2024 : ఉద్యోగం పోయిందా.. ఇలా చేస్తే లోన్, ఈఎంఐ కట్టక్కర్లేదు!

ఉద్యోగ నష్ట బీమా రూ.300 నుంచి రూ.500 వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ జాబ్‌లాస్‌ బీమా కవరేజీ ఐదేళ్లు మాత్రమే ఉంటుంది.

Written By:
  • NARESH
  • , Updated On : February 18, 2024 12:00 pm
    Follow us on

    Layoffs 2024 : మీ ఉద్యోగం పోయిందా.. ప్రతినెలా వచ్చే జీతం రావడం లేదా.. లోన్, ఈఎంఐలు ఎలా కట్టాలి అని టెన్షన్‌ పడుతున్నారా.. కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడానికి కష్టపడుతున్నారా.. రుణాలు, ఈఎంఐ భారం పెరుగుతుందని మానసిక క్షోభకు గురవుతున్నారా.. అయితే ఇలా చేస్తే.. మీరు ఈఎంఐ, లోన్‌ కట్టనక్కర్లేదు.

    ఊడుతున్న ఉద్యోగాలు..
    ప్రస్తుతం ఐటీ పరిశ్రమ సంక్షోభం ఎదుర్కొంటోంది. రెండు రోజుల క్రితమే సిస్కో సంస్థ 4 వేల మంది ఉద్యోగులను తొలగించింది. అదే బాటలో ఇంకా పలు కంపెనీలు ఉన్నాయి. అయితే భారీ వేతనాలు వచ్చే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు లోన్స్, ఈఎంఐలపై ఆధారపడి ప్రాపర్టీలు, వస్తువులు కొనుగోలు చేస్తారు. కానీ సడెన్‌గా ఉద్యోగం పోవడంతో మానసికంగా కుంగిపోతున్నారు. కొందరైతే ఆర్థిక ఇబ్బందులతో సూసైడ్‌ చేసుకున్న ఘటనలు ఉన్నాయి.

    సమస్యకు పరిష్కారం..
    ఉద్యోగం పోవడంతో చాలా మంది ఈఎంఐలు చెల్లించలేక కొత్త ఉద్యోగం వచ్చే వరకు ఈఎంఐలు ఎలా చెల్లించాలి అని మానసిక క్షోభకు గురవుతుంటారు. అయితే ఈ సమస్యకు ఓ పరిష్కారం ఉంది.. దానిని ఫాలో అయితే ఉద్యోగం పోయినా ఈఎంఐ టెన్షన్‌ ఉండదు. ఉద్యోగం పోయినా లోన్‌ లేదా ఈఎంఐ చెల్లించే అవకాశం కలిగి ఉండాలంటే జాబ్‌ లాస్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అనేక బీమా కంపెనీలు, బ్యాంకులు, బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు మీ జీతం,ఉద్యోగానికి బీమా చేస్తున్నాయి.

    జాబ్‌లాస్‌ ఇన్సూరెన్స్‌
    కొత్తగా వచ్చిన ఈ జాబ్‌లాస్‌ ఇన్సూరెన్స్‌ లేదా ఉద్యోగ నష్ట బీమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది జీవిత బీమాకు సంబంధించిన యాడ్‌ ఆన్‌ ఫీచర్‌. ఇది క్రెడిట్‌ రక్షణ జీవిత బీమారూపంలో అందుబాటులో ఉంటుంది. దీనిని బీమా కంపెనీలు జీవితబీమాతోపాటు విక్రయిస్తున్నాయి. కొన్ని కంపెనీలు విడివిడిగా అందిస్తున్నాయి. దీనిద్వారా ఉద్యోగం కల్పోతే క్రెడిట్‌ బిల్లు, ఇల్లు లేదా ఆటోలోన్, ఈఎంఐ చెల్లించవచ్చు.

    ఎవరు అర్హులు?
    కంపెనీలు ఉద్యోగ నష్టబీమాకు ప్రతి ఒక్కరినీ అర్హులుగా పరిగణించవు. పూర్తి సమయం పనిచేసే ఉద్యోగులు మాత్రమే ఈ బీమాకు అర్హులు. ఈ బీమా పదవీ విరమణ పొందిన వారికి, నిరుద్యోగులకు, స్వయం ఉపాధి లేదా తాత్కాలిక ఉద్యోగాలు చేసేవారికి కూడా అందించరు. ఇక బీమా కంపెనీలు వయసు విషయంలోనూ కొన్ని పరిమితులు విధిస్తాయి.

    ఎంత కవరేజీ ఉంటుంది..
    సాధారణంగా జాబ్‌లాస్‌ ఇన్సూరెన్స్‌ అంటే ఉద్యోగం పోయిన తర్వాత మూడు నుంచి నాలుగు నెలలు ఈఎంఐ చెల్లిస్తుంది. ఎవరైనా ఉద్యోగం కోలోపతే ఆ గడువులోపు కొత్త జాబ్‌ వెతుక్కోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు బీమా కంపెనీలు ఈఎంఐ, లోన్‌ వాయిదాలు చెల్లిస్తాయి. ఇది తాత్కాలిక ఉపశమనం కల్పిస్తుంది.

    ప్రీమియం ఎలా ఉంటుంది?
    ఇక జాబ్‌లాస్‌ బీమా ఇన్సూరెన్స్‌ ప్రీమియం ఎంత ఉంటుందంటే.. ప్రాథమిక బీమా ప్రీమియంలో 3 నుంచి 5 శాతం వరకు ఉంటుంది. హోమ్‌లోన్‌ తీసుకుని జీవితబీమా పొందితే దీని వార్షిక ప్రీమియం రూ.10 వేలు ఉంటే.. ఉద్యోగ నష్ట బీమా రూ.300 నుంచి రూ.500 వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ జాబ్‌లాస్‌ బీమా కవరేజీ ఐదేళ్లు మాత్రమే ఉంటుంది.