ప్రజలకు షాక్.. తెలంగాణలో భారీగా పెరగనున్న రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు?

తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. వీటితో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా అందే అన్ని సేవల ఛార్జీలు కూడా పెరగనుండటం గమనార్హం. రిజిస్టేషన్ ఛార్జీలు పెరగడంతో వినియోగదారులపై ప్రస్తుతం పడుతున్న భారంతో పోలిస్తే భారం మరింత పెరగనుందని సమాచారం. రిజిస్ట్రేషన్ శాఖ వ్యవసాయేతర భూముల విలువను ఏకంగా 50 శాతం పెంచాలని ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. పెరుగుతున్న ధరల వల్ల సాగుభూముల గరిష్ట, కనిష్ట విలువల్లో భారీగా మార్పులు చోటు […]

Written By: Kusuma Aggunna, Updated On : July 6, 2021 9:25 am
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. వీటితో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా అందే అన్ని సేవల ఛార్జీలు కూడా పెరగనుండటం గమనార్హం. రిజిస్టేషన్ ఛార్జీలు పెరగడంతో వినియోగదారులపై ప్రస్తుతం పడుతున్న భారంతో పోలిస్తే భారం మరింత పెరగనుందని సమాచారం. రిజిస్ట్రేషన్ శాఖ వ్యవసాయేతర భూముల విలువను ఏకంగా 50 శాతం పెంచాలని ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది.

పెరుగుతున్న ధరల వల్ల సాగుభూముల గరిష్ట, కనిష్ట విలువల్లో భారీగా మార్పులు చోటు చేసుకోనున్నాయని సమాచారం. భూముల మార్కెట్ విలువ పెరుగుదలతో పాటు రిజిస్ట్రేషన్‌, తత్సంబంధిత దాదాపు 20 రకాల సర్వీసులపై ఛార్జీలను పెంచనున్నారని సమాచారం. ప్రతిపాదనల నివేదికపై రిజిస్ట్రేషన్‌ శాఖ ప్రస్తుతం తుది కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. ప్రాంతీయ వారీ విలువ ఆధారంగా ఛార్జీలు 20 శాతం నుంచి 50 శాతం వరకు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.

రాష్ట్రంలో దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత భూములు, ఇతర ఆస్తుల విలువ పెరగనుండటం గమనార్హం. 2020 సంవత్సరం జనవరి నెలలోనే స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖ ఇందుకు సంబంధించిన నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సంవత్సరంన్నర వ్యవధిలో చోటు చేసుకున్న పరిణామాల ఆధారంగా భూముల విలువను నిర్ధారించనున్నారని తెలుస్తోంది.

రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ), తలసరి ఆదాయం పెరగడం, సాగునీటి వసతి పెరగడంతో ప్రభుత్వం భూముల విలువను పెంచుతున్నట్టు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలతో పాటు విక్రయ అగ్రిమెంట్‌, డెవలప్‌మెంట్‌, డెవలప్‌ కన్‌స్ట్రక్షన్‌ అగ్రిమెంట్‌, కుటుంబీకుల భూముల రిజిస్ట్రేషన్‌, బహుమతి, టైటిల్‌ డీడ్‌ డిపాజిట్‌, వీలునామా, లీజు, ఇతర ఛార్జీలు పెరగనున్నాయి.