https://oktelugu.com/

Kalvakuntla Kavitha – KTR : బాధపడకు.. నీకు నేనున్నా.. కవితకు కేటీఆర్ ధైర్యం.. వీడియో వైరల్

కేటీఆర్ తమతో గొడవ పడిన నేపథ్యంలో ఈడి అధికారి భానూప్రియ మీనా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారని ఆరోపించారు. భానుప్రియ మీనా ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. కాగా, కవితను అరెస్టు చేసి ఈడి అధికారులు ఢిల్లీ తీసుకెళ్లిన నేపథ్యంలో.. కేటీఆర్ కూడా ఢిల్లీ వెళ్ళిపోయారు. అక్కడ న్యాయ నిపుణులతో భేటీ అవుతారని తెలుస్తోంది.

Written By:
  • NARESH
  • , Updated On : March 15, 2024 / 10:48 PM IST

    Kalvakuntla Kavitha Arrested

    Follow us on

    Kalvakuntla Kavitha – KTR : లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి.. ఈడి కస్టడీలోకి వెళ్లే ముందు ఆమె సోదరుడు కేటీఆర్ ధైర్యం చెప్పారు. శుక్రవారం ఈడి అధికారులు ఆమెను అరెస్టు చేసి శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకెళ్తున్న క్రమంలో.. కారు వద్దకు వెళ్లారు. కవితను అలా చూసి ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యారు. ఒక చేత్తో కంట నీరును తుడుచుకుంటూనే.. మరో చేతితో తన సోదరికి ధైర్యం చెప్పారు..”నీకు నేనున్నా. ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటా. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఢిల్లీ బయలుదేరిన వెంటనే.. నేను కూడా అక్కడికి వచ్చేస్తా. న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నా. ఏం కాదు.. నువ్వు స్ట్రాంగ్ గా ఉండు” అంటూ కేటీఆర్ కవితను ఊరడించారు.

    కేటీఆర్ కవితకు ధైర్యం చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై భారత రాష్ట్ర సమితి అనుకూల నెటిజన్లు స్పందిస్తున్నారు. అన్నా మీకు మేమున్నామని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, శుక్రవారం ఉదయం ఈడీ అధికారులు కవిత నివాసానికి చేరుకున్న వెంటనే సోదాలు నిర్వహించారు. సిఆర్పిఎఫ్ బలగాలతో వారు కవిత నివాసానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్, హరీష్ రావు కవిత నివాసంలోకి వెళ్లారు. ఈడి అధికారులతో గొడవపడ్డారు. అనంతరం ఈడి అధికారులకు సహకరిస్తామని ప్రకటించారు. నిబంధనల ప్రకారం అరెస్టు విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా చెప్పాలి కాబట్టి.. ఈడి అధికారులు కేటీఆర్, హరీష్ రావును కవిత నివాసంలోకి అనుమతించారు.