https://oktelugu.com/

ఆడపిల్ల పుడితే 10వేల రూపాయలు డిపాజిట్.. ఎక్కడంటే..?

దేశంలో ఇప్పటికీ చాలామంది కుటుంబంలోని ఆడపిల్ల, మగపిల్లాడి విషయంలో వ్యత్యాసం చూపిస్తూ ఉంటారు. అయితే ఒక గ్రామంలో మాత్రం ఆడపిల్ల పుడితే ఆ చిన్నారి పేరుపై పోస్టాఫీస్ లో ఖాతా తెరిచి ఆ ఖాతాలో పదివేల రూపాయలు డిపాజిట్ చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కరీంనగర్ జిల్లాలోని కొండాయపల్లి గ్రామంలోని ఆడపిల్లల పాలిట వరమైంది. Also Read: రాజ్‌దీప్ పై వేటు..: రెండు వారాలు స్క్రీన్‌ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 29, 2021 5:03 pm
    Follow us on

    Kondapally

    దేశంలో ఇప్పటికీ చాలామంది కుటుంబంలోని ఆడపిల్ల, మగపిల్లాడి విషయంలో వ్యత్యాసం చూపిస్తూ ఉంటారు. అయితే ఒక గ్రామంలో మాత్రం ఆడపిల్ల పుడితే ఆ చిన్నారి పేరుపై పోస్టాఫీస్ లో ఖాతా తెరిచి ఆ ఖాతాలో పదివేల రూపాయలు డిపాజిట్ చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కరీంనగర్ జిల్లాలోని కొండాయపల్లి గ్రామంలోని ఆడపిల్లల పాలిట వరమైంది.

    Also Read: రాజ్‌దీప్ పై వేటు..: రెండు వారాలు స్క్రీన్‌ పైకి రాకూడదని ఆదేశం

    తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టిందంటే భారంగా భావించకూడదని.. ఆ ఇంట్లో సంతోషం వెల్లి విరియాలని ఆ గ్రామం ఈ నిర్ణయం తీసుకుంది. మా ఊరి మహాలక్ష్మి పేరుతో ఏర్పాటైన ట్రస్ట్ ద్వారా ఎవరి ఇంట్లో ఆడపిల్ల పుట్టినా 5 వేల రూపాయలు డిపాజిట్ చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. రెండ్ల శ్రీనివాస్ ఇలా సుకన్య సమృద్ధి స్కీమ్ లో డిపాజిట్ చేయడం ద్వారా ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక భద్రత కలుగుతుందని తెలిపారు.

    Also Read: సకల సంపదలు మీ సొంతం కావాలంటే.. ఈ మంత్రం జపించాల్సిందే..!

    గ్రామంలో ఇప్పటివరకు గత మూడేళ్లలో పుట్టిన 40 మంది ఆడపిల్లల ఖాతాలలో ఈ మొత్తం జమైంది. ఆడపిల్లలకు ట్రస్ట్ ద్వారా 5 వేల రూపాయలు, వారి తల్లిదండ్రుల ద్వారా 5 వేల రూపాయలు.. మొత్తం 10 వేల రూపాయలు పోస్టాఫీస్ ఖాతాలలో ట్రస్ట్ సభ్యులు డిపాజిట్ చేసి పాస్ బుక్కులను ఆడపిల్లల తల్లిదండ్రులకు ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో 50 వేల రూపాయలు డిపాజిట్ చేయాలని ట్రస్ట్ సభ్యులు భావిస్తున్నారు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    ప్రతి గ్రామంలో గ్రామస్తులు ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మా ఊరి మహాలక్ష్మి ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ సభ్యులు గల్ఫ్ లో చనిపోయిన కుటుంబ సభ్యుల పిల్లలకు కూడా ఆర్థిక సహాయం చేయడం గమనార్హం.