KL RAHUL : కొంత మంది ప్లేయర్లని మనం తక్కువ అంచనా వేస్తాం.. ఎందుకంటే వాళ్ళు ఆడిన ఆట ముందు మ్యాచ్ లను బట్టి మనం వాళ్ళమీద నమ్మకాన్ని ఏర్పరచుకుంటాం.. కానీ అది అన్నివేళలా ఒకేలా ఉండదు. ఇదంతా ఎందుకు చెప్తున్న అంటే ఇవాళ్ళ ఇండియా కి పాకిస్థాన్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో కే ఎల్ రాహుల్ సెంచరీ చేసి మ్యాచ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మ్యాచ్ మొత్తాన్ని తన బ్యాటింగ్ తో మలుపు తిప్పాడు వికెట్ పడకుండా చివరి వరకు ఆడి తన బ్యాటింగ్ స్టాండేడ్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. నిజానికి కే ఎల్ రాహుల్ ఈ మ్యాచ్ లో ప్లేయింగ్ లేవన్ లో ఉంటాడు అని ఎవ్వరూ అనుకోలేదు ఎందుకంటే ఆయన ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడి చాలా రోజులు అవుతుంది. అందులోనూ ఆయన ఇంజ్యురి అయి ఇప్పుడు క్యూర్ అయ్యాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన్ని తీసుకునేకంటే మొన్న ఆల్రెడీ ఒక మ్యాచ్ ఆడి మంచి ఫామ్ లో ఉన్న శ్రేయాస్ అయ్యర్ ని తీసుకోవడం బెటర్ అని అందరూ అనుకున్నారు… కానీ కెప్టెన్ రోహిత్ శర్మ హెడ్ కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్ ఇద్దరు కూడా కే ఎల్ రాహుల్ ని నమ్మారు. పాకిస్థాన్ మీద మనకు శ్రేయాస్ అయ్యర్ కంటే నెంబర్ 4 లో ఆడటానికి కొంచం అనుభవం ఉన్న ప్లేయర్ కావాలి అని అనుకోని మరి రాహుల్ ని ఫైనల్ టీమ్ లో ఉండేలా చేశారు…ఫలితం పాకిస్థాన్ బౌలర్లకు చెమటలు పట్టించేలా ఆడాడు అలాగే రాహుల్ పని అయిపోయింది అని కామెంట్లు చేస్తూ అతన్ని ఇంకా ఎందుకు టీమ్ లోకి తీసుకుంటున్నారు అని అరిచిన ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పాడు…
నెంబర్ ఫోర్ లో వచ్చి సెంచరీ కొట్టడం అంటే అంత తేలికైన విషయం కాదు అయిన కూడా అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. ఇక ప్రతి ఒక్కరూ ప్రస్తుతం ఉన్న మ్యాచ్ లో రాహుల్ కంటే అయ్యర్ చాలా బెస్ట్ అని అనుకున్నారు కానీ అందరి అంచనాలను తల దన్నెలా ఆయన 106 బంతుల్లో 2 సిక్స్ లు, 12 ఫోర్లు కొట్టి 111 పరుగులు చేశాడు…రాహుల్ అంటే ఏంటో ప్రపంచ దేశాలకి తెలిసేలా చేశాడు నిజానికి పాకిస్థాన్ టీమ్ లో చాలా మంచి బౌలర్లు ఉన్నారు ప్రపంచం లోనే ది బెస్ట్ బౌలర్లు అందరూ కూడా పాకిస్థాన్ లోనే ఉన్నారు…వాళ్లందరినీ తట్టుకొని సెంచరీ చేయడం అంటే మామూలు విషయం కాదు అయిన కూడా వాళ్ల బౌలింగ్ లో గ్రౌండ్ మొత్తం 360 డిగ్రీ లో రన్స్ కొడుతూ అసలు ఏ మాత్రం టెన్షన్ లేకుండా చాలా కూల్ గా మ్యాచ్ అడాడు…
అయితే ద్రావిడ్ నుంచి లభించిన ప్రోత్సాహం ఇంతకు ముందు రాహుల్ కి ఎవ్వరూ దగ్గరి నుంచి లభించలేదు ఇలాంటి ప్రోత్సాహం ఇచ్చేవారు లేకనే ఆయన ఇన్ని రోజుల నుంచి చాలా నీరసంగా మ్యాచు ఆడుతూ ఉన్నాడు…నిజానికి రాహుల్ మొదట్లో చాలా అగ్రసివ్ గా బ్యాటింగ్ చేస్తూ ఎవ్వరూ బౌలింగ్ లో అయిన సూపర్ గా ఆడేవాడు కానీ మధ్యలో కొంచం డల్ అయ్యాడు ఇప్పుడు మళ్ళీ తన పూర్వపు ఫామ్ లోకి వచ్చాడు.రాహుల్ ఫాం లోకి రావడం ఒకవంతుకు ఇండియన్ టీమ్ కి శుభపరిణామం అనే చెప్పాలి ఎందుకంటే ఏషియా కప్ ముగిసిన వెంటనే వరల్డ్ కప్ ఉండటం తో మొన్నటి వరకు నెంబర్ ఫోర్ లో ఎవరు ఆడుతారు అని అందరికీ చాలా డౌట్లు ఉండేవి కానీ ఇప్పుడు రాహుల్ టీమ్ లోకి రావడం ఆయన మంచి ఫామ్ లో ఉండటం తో ఇక వరల్డ్ కప్ లో కూడా మనకు నెంబర్ ఫోర్ లో ఆడే ప్లేయర్ దొరికేసాడు అని ఇండియన్ క్రికెట్ అభిమానులు అందరూ చాలా సంతోషం గా ఉన్నారు… రాహుల్ మళ్ళీ తన ఫామ్ లోకి రావడం లో కోచ్ ద్రావిడ్ కీలక పాత్ర వహించారని చెప్పాలి…