https://oktelugu.com/

OG Leaks : ఓజీ సెట్స్ నుండి కీలక ఫోటోలు లీక్… పవన్ ఏం చేస్తున్నారో చూడండి!

ఓజీ మూవీ కోసం పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నిపుణుల పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ కాస్ట్యూమ్స్ లో పవన్ కళ్యాణ్ లుక్ సరికొత్తగా ఉంది.

Written By:
  • NARESH
  • , Updated On : August 1, 2023 / 07:38 PM IST
    Follow us on

    OG Leaks : బ్రో మూవీ థియేటర్స్ లో సందడి చేస్తుండగా ఓజీ చిత్ర అప్డేట్స్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే మోస్ట్ స్టైలిష్ అండ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా ఓజీ ఉండనుంది. ఓజీ వర్కింగ్ టైటిల్ కాగా టైటిల్ నిర్ణయించాల్సి ఉంది. కాన్సెప్ట్ పోస్టర్ తోనే దర్శకుడు సుజీత్ సినిమాపై ఆసక్తిరేపాడు. ఇది అవుట్ అండ్ అవుట్ గ్యాంగ్స్టర్ డ్రామా. ముంబై, జపాన్ నేపథ్యంలో నడుస్తుందని సమాచారం. ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తి చేశారు. హైదరాబాద్ లో భారీ సెట్ ఒకటి ఏర్పాటు చేయగా పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సి ఉంది.

    ఓజీ మూవీ కోసం పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నిపుణుల పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ కాస్ట్యూమ్స్ లో పవన్ కళ్యాణ్ లుక్ సరికొత్తగా ఉంది. పవన్ కళ్యాణ్ కి మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. గతంలో ఆయన నెలల పాటు నేర్చుకున్నారు. జానీ చిత్రం కోసం ఆయన ఈ విద్యల్లో ప్రావీణ్యం సాధించారు.

    ఓజీ మూవీలో ఆయన మరోసారి తన మార్షల్ ఆర్ట్స్ పవర్ చూపించనున్నారని అనుకోవచ్చు. ఇక సుజీత్ ప్రభాస్ తో తెరకెక్కించిన సాహో కథతో లింక్ ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. ఇటీవల లీకైన కొన్ని ఫోటోల్లో వాజీ సిటీ అని కనిపించింది. సాహో మూవీలో సుజీత్ వాజీ అనే ఒక కల్పిత గ్యాంగ్ స్టర్స్ సిటీని సృష్టించాడు. మరి ఆ నగరంతో ఓజీ సినిమాకు సంబంధం ఏమిటనేది ఆసక్తికరం.

    ఓజీ చిత్రానికి డివివి దానయ్య నిర్మాత. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. వీలైనంత త్వరగా ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండగా సన్నద్ధం అవుతున్నారు. పవన్ కళ్యాణ్ కోసం విజయవాడ పరిసర ప్రాంతాల్లో షూటింగ్స్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. పూర్తిగా తన మకాం పవన్ కళ్యాణ్ విజయవాడకు మార్చేస్తున్నారని తెలుస్తుంది.

    https://twitter.com/Vamsivardhan_2/status/1685923758765375488?s=20