Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరో 24 గంటలో‍్ల వెలవడనున్నాయి. సర్వేలన్నీ కాంగ్రెస్‌కు అధికారం ఖాయమంటున్నాయి. ఒకటి రెండు సర్వేలు హంగ్ వస్తుందని, బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని అంటున్నాయి. అయితే కాంగ్రెస్‌లో మాత్ర గెలుపుపై ధీమా కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఇండియా టుడేతో మాట్లాడుతూ.. గతంలో వైఎస్సాఆర్, కేసీఆర్ తనక ఆఫర్లు ఇచ్చినా తిరస్కరించానన్నారు. అధికారం ఆశించి ఉంటే ఇప్పటికే అధికార పార్టీల్లో కీలక పదవుల్లో ఉండే వాడినని తెలిపారు. పదవులు ఆశించలేదు కాబట్టే ప్రతిపక్ష పార్టీకి పీసీసీ చీఫ్‌గా ఉన్నానన్నారు. 20 ఏళ్లుగా అపోజిషన్ పార్టీలో ఉన్నానని దాంతోనే తాను సంతోషంగా ఉన్నానన్నారు.
గుండెల్లో ప్రజలు..
తెలంగాణ అధికారంలోకి రాబోతున్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమా, అధికారం ముఖ్యమా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు రేవంత్ సెంటిమెంట్ సమాధానం ఇచ్చారు. తన గుండెల్లో ప్రజలు ఉన్నారన్నారు. తాను ఇండింపెండెంట్‌గా జెడ్పీటీసీ, ఎమ్మెల్సీగా గెలిచానన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచానన్నారు.
వారికన్నా తన పార్లమెంట్ ఓటర్లే ఎక్కువ..
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఓటర్లు మోడీ, అమిత్ షా ఇద్దరు సెగ్మెంట్లలో ఉన్న ఓటర్ల కన్నా ఎక్కువ అన్నారు. మల్లు భట్టి విక్రమార్క సీఎం రేసులో ఉన్ననని చెప్పారని రాజ్‌దీప్ సర్దేశాయ్ చెప్పగా.. రేవంత్‌రెడ్డి బదులిస్తూ తమ పార్టీలో గెలవబోయే 80 మంది ఎమ్మెల్యేలు సీఎం క్యాండిడేట్లే అన్నారు. సీఎం పోస్ట్ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయమే తమకు శిరోధార్యమన్నారు.