KCR survey : తెలంగాణలో వరుసగా మూడోసారి గెలుపు గుర్రం ఎక్కాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చేయని ప్రయత్నం లేదు. ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితులను అంచనావేసి మరీ సర్వేలు చేయించి పోస్టుమార్టం చేస్తున్నారు. ఎమ్మెల్యేల పరిస్థితి.. గెలిచే వారు ఎవరు? పార్టీపై ప్రభావం, విజయావకాశాలు తదితర అంశాలు తీసుకొని సర్వే చేశారు. ఈ రిపోర్టులన్నీ పరిశీలించిన కేసీఆర్.. వచ్చేసారి టీఆర్ఎస్ ఖచ్చితంగా గెలిచే స్తానాలు కేవలం 40 మాత్రమేనని అంచనావేశారట.. ఈ రిపోర్ట్ గులాబీ దండును భయపెడుతోందిప్పుడు.. ఈ విషయంలో ఏం చేయాలన్న దానిపై కేసీఆర్ వ్యూహాలు రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఖచ్చితంగా గెలిచే సీట్లు 40 మాత్రమేనని కేసీఆర్ తేల్చారు. కొంచెం కష్టపడితే గెలిచే సీట్లు 30-35 ఉన్నాయనట.. అయితే ఇక్కడ అటు ఇటూ అయితే టీఆర్ఎస్ ఓటమి ఖాయం. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలిచే అవకాశాలు లేవు. అక్కడ బలమైన అభ్యర్థులు, ప్రభావం లేకపోవడం కారణంగా చెప్పొచ్చు. అందుకే బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై ఫోకస్ చేసి అక్కడ బలమైన నేతలను దింపి గెలిచే ప్లాన్లను కేసీఆర్ రెడీ చేస్తున్నారు. ఇక్కడ మంత్రులు, కీలక నేతలకు బాధ్యతలు అప్పగించి.. ఇన్ చార్జీలను నియమించి గెలుపు బాట పట్టే ప్రణాళికలు రెడీ చేస్తున్నారు.ఇక్కడ ఫలితం తారుమారు చేసేలా ప్రణాళిక రెడీ చేస్తున్నారట..
మూడోసారి అధికారం చేపట్టాలంటే టీఆర్ఎస్ కు బలమున్న ఉత్తర తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధించాలి. బలహీనంగా ఉన్న దక్షిణ తెలంగాణ, హైదరాబాద్ లో మెజార్టీ సీట్లు దక్కించుకోవాలి. ఇక పట్టు లేని ఖమ్మం జిల్లాలో ఎలాగైనా సరే బలమైన నేతలను గులాబీ పార్టీలో చేర్చుకొని గెలుపు గుర్రం ఎక్కాలి. ఈ మూడు వ్యూహాలతో కేసీఆర్ ముందుకు సాగుతున్నారు.
దక్షిణ తెలంగాణ, ఖమ్మం జిల్లాల్లో విస్తరణ, నియోజకవర్గాల ఇన్ చార్జీల నియామకం, చేరికలు ప్రోత్సహించే దిశగా ప్లాన్లు రెడీ చేస్తున్నారు. సర్వే రిపోర్ట్ ఆధారంగా ఆ నియోజకవర్గాలపై ఇక మోహరింపే లక్ష్యంగా సాగుతున్నారు. ప్రభుత్వం పనులు వివరించి.. అభివృద్ధి చేసి జనం మూడ్ ను వచ్చే ఎన్నికల నాటికి మార్చాలని డిసైడ్ అయ్యారు. పథకాలను కూడా అక్కడ ఎక్కువగా ఇవ్వాలని చూస్తున్నారు. దళితబంధు, వెహికల్ లోన్స్, రుణ సదుపాయాలు.. ఇతర పథకాలను అమలు చేసి టీఆర్ఎస్ ను గెలిపించే ఎత్తుగడను కేసీఆర్ వేస్తున్నారు.
మరి 40 సీట్లు కొట్టే కేసీఆర్ మెజార్టీకి అవసరమైన మిగతా 20 సీట్లు కొట్టగలడా? తెలంగాణ ప్రజలు మూడోసారి గెలిపిస్తారా? లేదా? అన్నది వేచిచూడాలి.